శ్రీ హేరంభ లైన్స్ అఫ్ యూనివర్సల్ సింఫోనీ పేరిట, హైదరాబాద్ ఈశ్వరయ్య ఆర్ట్ గేలరీ మధురనగర్ లో చిత్రకారుడు రాంప్రతాప్ కాళీపట్న౦ వేసిన 108 గణపతి చిత్రాల ప్రదర్శన ను ప్రముఖ ఈ.యన్.టి. స్పెషలిస్ట్ డాక్టర్ జి.వి.యస్. రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 16వ తారిఖు వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రదర్శనలో 108 గణపతి చిత్రాల పుస్తకాన్ని విడుదల చేశారు, ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఈశ్వరయ్య ఆర్ట్ గేలరీ డైరెక్టర్ సంజయ్ కుమార్, పానుగంటి వెంకటేష్, శివరామకృష్ణ గారు ఇంకా అనేకమంది చిత్రకారులు, ఇతర పెద్దలు హాజరయ్యారు.