సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

ఏప్రిల్ 22న శీలా వీర్రాజు జన్మదిన సందర్భంగా ..

కలం, కుంచె రెంటినీ సమసార్థ్యంతో ఉ పయోగించిన కల్గిన వారిలో శీలా వీర్రాజు ఒకరు.” శీలావి” గా ప్రసిద్దిన వీరు చారిత్రక పట్టణమైన రాజమహేంద్రవరంలో వీరచంద్రమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1939 ఏప్రిల్ 22న జన్మించారు. స్థానికంగా జరిగే చిత్రకళాపోటీల్లో పాల్గొని విద్యార్థి దశలోనే అనేక బహుమతులు గెలుపొందారు. 1956లో గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిసారి తన వ్యక్తి గత చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుకే చేయగా, ఆ ప్రదర్శనను ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు ప్రారంభించారు.
దామెర్ల ఆర్డుగ్యాలరీ స్కూలులో ప్రముఖ చిత్రకారుడు వరదా వెంకటర్నం వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకొన్నారు. 1961లో విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణా పత్రికలో ఉప సంపాదకుడు/ చిత్రకారునిగా చేరారు. తర్వాత 1963 నుండి 1990 వరకు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే తీరిక సమయాన్ని వృధా చెయ్యక చిత్రభావాన్ని కొనసాగించారు. రాష్ట్రంలోనూ పరిసరాల్లో వున్న ప్రముఖ శిల్పకళా క్షేత్రాన్ని సందర్శించి, రేశాచిత్రాలు గీచారు. 1970లో జర్మనీలోని గోటింజన్ అనేకనగరంలోను, హైదరాబాద్, బెంగుళూరులలో ఒన్మేన్ షో లు నిర్వహించారు.


దామెర్ల శైలిలో నీటి, నూనె రంగుల్లో చిత్రాలు గీయడం వీరి ప్రత్యేకత. 1990లో లేపాక్షీ శిల్పాలకు వీరు గీసిన స్కెచ్లను “శిల్పరేఖ” పేరుతో 2009లో శీలా వీర్రాజు చిత్రకారీయం పేరుతోనో నీటి, నూనెరంగుల చిత్రాల పుస్తకాన్ని వెలువరించారు. 2016లో కుంచెముద్రుల పేరుతో మరో పుస్తకాన్ని వెలువరించారు. సాహిత్యరంగంలోనూ వీరు విశేష కృషిచేస్తున్నారు. 2017లో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో కూడా తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. 1968లో వీరు రచించిన కొడగట్టిన సూర్యుడు అనేకవచనకవితాకథ ‘తిలక్ అవార్డును, సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఆయన దాదాపు రెండు వందల పుస్తకాలకు ముఖచిత్రాలు గీశారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లో నివశిస్తున్నారు. వీరి శ్రీమతి శీలా సుభద్రా దేవి కూడా రచయిత్రి.

-సుంకర చలపతిరావు

1 thought on “సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

  1. శీలా వీర్రాజు గారు నాకెంతో ఆత్మీయులు. సుమారు 22 సంవత్సరాల క్రిందట నా మొదటి కవితా సంపుటి ” ఆహ్వానం ” తనే బాధ్యత వహించి ముఖ చిత్రం వేసి, ప్రూ ఫులు చూసి హైదరాబాద్ లో ప్రచురించారు. ఆయన రుణం తీర్చుకో లేనిది. చాలా గొప్ప మనిషి. మంచితనానికి సౌజన్యానికి.మారు పేరు
    నిష్కల్మష నిరాడంబర వ్యక్తి. ఆయనకు నా నమస్సులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap