
సుమారు ఇరవై సంవత్సరాలకు పైగానే వివిధ కోణాల్లో చిత్రాలు గీస్తూ వాటికి ప్రాణం పోస్తున్నారు ఇనుగుర్తి విజయ్ కుమార్. మత సామరస్యం, వరకట్నం, ఆడపిల్లల అమ్మకాలు, మద్యపానం, ఎయిడ్స్, వెట్టిచాకిరి, బాలకార్మికుల జీవితం, పర్యావరణం, గిరిజన సంస్కృతి వంటి చిత్రాలు విజయ్ కుమార్ గారి సామాజిక స్పృహను, భావోద్వేగానికి అద్దం పడతాయి.
చదువపరంగా…
•ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.ఏ. డిగ్రీ పూర్తి చేసారు.,
•డ్రాయింగ్ లోయర్, హైయర్ మరియు టి.టి.సి. లను పూర్తి చేసారు,
•కర్ణాటక యూనివర్సిటీ నుండి క్రియేటివ్ పేయింటింగ్ లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్.,
•తమిళనాడు ప్రభుత్వం నుండి డ్రాయింగ్ లో హైయర్ గ్రేడ్ పూర్తి చేసారు.
వృత్తిరీత్యా పలు ప్రైవేట్ స్కూళ్ళలో చిత్రకళా ఉపాథ్యాయుడుగా చేస్తున్నారు.
జీవన సౌందర్యాన్ని వ్యక్తం చేసే సాధనాల్లో చిత్రకళ ఒకటి. చిత్రకళతో అనంతమైన భావాలను చిత్రించి సమాజానికి తెలియజెప్పవచ్చును. వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ప్రశాంతతకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చిత్రకళలు దోహదం చేస్తాయి. అలాంటి చిత్రకళను తన తండ్రి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న విజయ్ కుమార్ గారు తనదైన శైలిలో సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. చిన్నతనం నుంచి తన తండ్రిని అనుకరిస్తూ, తల్లి ప్రోత్సాహంతో పాఠశాలలో చదివే రోజులలోనే చిత్రకళకు శ్రీకారం చుట్టారు. విచిత్రం ఏమంటే “తను చిత్రాలు వేస్తూనే సాటి-తోటి విద్యార్ధులతో వేయించేవారు. ఇప్పుడు స్కూలు పిల్లల చేత వేయించే స్థాయికి ఎదిగారు విజయ్ కుమార్ గారు”.
వీరు రూపొందిస్తున్న చిత్రాలకు ప్రశంసలు, అవార్డులను అందుకుంటున్నారు. అందుకు కారణం విజయ్ గారు వైవిధ్యమైన శైలిలో, నూతన పద్ధతిలో, చిత్రకళను రూపకల్పనలు చేస్తుంటారు. ఆయన వేసే ప్రతి పేయింటింగ్ లో ఆహ్లాదంతోపాటు ఆలోచింప జేస్తాయి. ప్రతిదీ ప్రయోగాత్మకం. సందేశాత్మకం.



విజయ్ గారు కళామతల్లికి చేసిన కృషికి అందుకున్న అవార్డులు….
•ఆచార్యదేవోభవ పురస్కార్.,
•యునెస్కో క్లబ్ నుండి ఫైన్ ఆర్ట్స్ ఎంకరేజ్ అవార్డును.,
•మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్,
•నెహ్రూ కల్చరల్ అవార్డును.,
•రిపబ్లిక్ అవార్డును.,
•ఎఐఐఇఎ వారిచే ఘనమైన సన్మానం అవార్డును.,
•నవ్యకళా నికేతన్ వారిచే సన్మానం అవార్డును.,
•ఉత్తమ ఆచార్య పురస్కారం.,
•వండర్ ఆర్ట్ పురస్కారం.,
•విశిష్ట ఆచార్య పురస్కారం.,
•మారుతి ఆర్ట్ అకాడమీ-గుజరాత్ వారు సంయుక్తంగా అందించిన ఉత్తమ ఆర్ట్ టీచర్ అవార్డు.,
•చెన్నై వారి శ్రీ దర్శిని కళైకూడమ్ నుండి బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డు.,
•అజంతా కళారామం-తెనాలి నుండి చిత్రకళాచార్య పురస్కారం.,
•కాళీపట్నం ఆర్ట్ అకాడమీ నుండి ఉత్తమ చిత్రకారుడు అవార్డు.,
•సెవన్ హిల్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ నుండి ఉత్తమ చిత్రకళాచార్య అవార్డు.,
•ఇటీవల సాలార్ జంగ్ మ్యూజియంలో స్వచ్ఛ తెలంగాణపై చిత్రాలను గీసి, బిర్లా ప్లానిటోరియంలో ఆరోగ్యంపై అవగాహన పోస్టర్స్ ల ప్రదర్శించినందులకు ఘన సన్మానం, అవార్డు…..
ఇలా లెక్కకు మించి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
సోలో గా పది, పదిహేను గ్రూప్ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాలి..
చివరిగా “ప్రభుత్వం చిత్ర కళాకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఇతర ఉపాధ్యాయ పోస్టుల వలే ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్లు ఉండాలి. అప్పుడే పిల్లలలో సృజనాత్మకను వెలికితీసేందుకు, వారిలో ఏకాగ్రత, పట్టుదల, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు చిత్రకళలు దోహదపడతాయని” వివరించారు ఇనుగుర్తి విజయ్ కుమార్ గారు.


You have introduced about Great Artist. Thank you Kalasagar garu
విజయ్ గారికి… అభినందనలు…. గుండు రమణయ్య…