కళాకారులందరు అదృష్టవంతులు కారు.
తాము జీవితకాలమంతా పడిన కష్టానికి బ్రతికి వుండగా సరైన ప్రశంస లభించిక నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారుంటారు. తనను అసలు లెక్కచెయ్యని జనం చూసి బాధపడతారు.
ఆ క్షణంలో వారు అనుభవించే మానసిక ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి వేదనకు గురైన వాడే విన్సెంట్ వాన్ గోహ్.
వాన్ గోహ్ మరణం తర్వాత కీర్తి ప్రతిష్టలు పుంజు కున్నాయి. ఆయనంత గొప్ప చిత్రకారుడు లేడన్నారు. 20వ శతాబ్దపు చిత్రకళపై సుదూర ప్రభావం చూపించిన వాడన్నారు. ఆధునిక కళస్థాపనకు సేవలు అందించిన వారిలో ఒకరిగా పొగడ్తలు అందుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదు కట్టబడిన కళాఖండాలు వాన్ గోహ్ గీసిన చిత్రాలు.
విన్సెంట్ వాన్ గోప్ స్వీడన్ దేశంలో 1853 మార్చి 30న పుట్టాడు. వారి కుటుంబం ఒక రకంగా వడ్రంగి వృత్తిలో వుండేది. చిత్రకళలో, క్రైస్తవం మీద బోధన, ప్రచారంలో వారి పెద్దలకు ప్రవేశం వుండేది. చిన్నప్పుడు చదువుకునే వయసులోనే బొమ్మలు గీయటం మొదలు పెట్టాడు. వాటిలో భావం వున్న చిత్రంలో స్పష్టత కనిపించేది కాదు. బాల్యంలో బోర్డింగ్ స్కూల్ కి పంపటంతో వాన్ గోహకి మానసికంగా ఇబ్బంది మొదలైంది.
స్వతంత్రంగా ఎదగాలని, తాను ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించాలన్న అతని ఆలోచనకు బోర్డింగ్ స్కూల్లోని నిబంధనలకు అస్సలు పొంతన కుదిరేది కాదు. తెలియని ఒత్తిడి.
అక్కడనుండి ఎలాగైనా పారిపోవాలన్న ఆలోచన. నాటి భయాందోళనలు, ఆ ఒంటరితనం ఆయన్ని జీవితాంతం వెంటాడాయని అనిపిస్తుంది. బాధ ఆయన చిత్రాలలో కనిపిస్తుండేది. తన 16వ ఏట చదువు మానేసి హఠాత్తుగా ఇంటికి వచ్చాడు.
టీనేజ్ వాన్ గోస్లో వున్న చిత్రకళ ఆసక్తి గమనించిన అతని బాబాయి హేగ్ నగరంలో ఒక ఆర్ట్ డీలర్ షాపులో పనికి కుదిర్చాడు. అక్కడకి అమ్మకానికి వచ్చిన చిత్రాలను జాగ్రత్తగా ప్రదర్శించటం అనే బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతతోపాటుగా చిత్రలేఖనం, పరిశీలన, చిత్రీకరణ కూడా చేసేవాడు. రెండేళ్ళు వాన్ గోహ్ పనిచేసిన తీరుకు మెచ్చి లండన్ ఆఫీసుకు బదిలీ చేశారు.
లండన్లో ఎదగాలనుకుంటే ఈలోగా ఇంటి సొంతదారు కూతురిమీద మనసుపారేసుకుని, ఆమె తిరస్కరించటంతో మానసికంగా ఇబ్బందికి గురయ్యాడు. ప్రేమబాధ వెంటాడి ఏ పని చెయ్యలేని అతడిని చూసి ఆ బాధ మరిచిపోతాడని ప్యారిస్ బదిలీ చేశారు. ఎక్కడ వున్న తిరస్కారబాధ వదల లేదు. అది మరచిపోయేందుకు మతాన్ని ఆశ్రయించాడు. ఇల్లు వదిలి ఒక పూరిపాకలోకి మారాడు. అతని ప్రవర్తన చివరికి చర్చి పెద్దలకే విసుగు తెప్పించింది. నువ్వు మతబోధకుడి బాధ్యతకు తగిన వాడివి కాదు పొమ్మని డిస్మిస్ చేశారు. ఈ వాన్ గోహ్ గోలపడలేక ఒక దశలో పిచ్చాసుపత్రిలో చేరుద్దామనుకున్నారు. అందుకు మరో కారణం వానీ వరస, వయసు సంబంధం లేకుండా పిల్లల తల్లి వెంటపడ్డాడు. తిరస్కరణకు గురై వేశ్యలతో జీవితం గడిపాడు. ప్రతిదశలో వైఫల్యమే. మనసునిండా దిగులే. ఏం చేసినా సక్సెస్ రావటం లేదు.
చివరి రెండు సంవత్సరాలు వాన్ గోహ్ మానసిక రుగ్మతలు పెరిగాయి. మరోవైపు సుఖవ్యాధి వెంటాడిందన్నది అనుమానం. ఏమైనా తాను అనుకున్నది సాధించలేకపోయాడు. కోరిన పొందు దొరకలేదు. అదొక బాధ. ఉన్మాదస్థితి చేరుకునేవాడు. సాటి చిత్రకారుడితో తీవ్రంగా విభేదించేవాడు. అనవసరపు అంశాలకు తీవ్రంగా స్పందించేవాడు.
తనతో విభేదించిన చిత్రకారుడి మీద బ్లేడ్లో దాడిచేసి ఆ తర్వాత భయంతో వేశ్యావాటికలో దాక్కుని ఆ భయంలో తన సొంత చెవికోసుకుని చెవి ముక్కుని జాగ్రత్తగా దాచమని వేశ్యకి ఇచ్చి వెళ్ళిపోయాడు. తన మీద ఎవరో మంత్రప్రయోగం చేశారన్నది అనుమానం.
అతని పిచ్చపనులు భరించలేక కొందరు పౌరులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు అతను పెయింటింగ్ చేసే ఇంటిని మూసివేశారు. ఆసుపత్రిలో చేర్చారు. వాన్ గోహ్ మరింత ఒంటరి వాడయ్యాడు. కాని ఆ కటకటాలనుండి కనిపించే ప్రకృతినే చిత్రాలుగా గీస్తుండేవాడు. ఆ సమయంలో గీసిన వాటికి ఆ తర్వాత కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి చిత్రాలుగా గుర్తింపువచ్చాయి.
వాస్ గోహకి స్థిరత్వం లేదు. ఆసుపత్రిని వదిలి ప్యారిస్ సమీపంలోని మరోచోటుకు వెళ్ళాడు. అక్కడ చిత్రకారులు చిత్తచాపల్యాలకు గతంలో చికిత్స చేసిన వైద్యుడు వున్నాడు. అతని దగ్గర తన రోగం తగ్గుతుందనుకున్నాడు. అక్కడ చికిత్స చేయించుకుంటూనే చిత్రాలను గీశాడు.
కాని మానసిక రుగ్మత తగ్గలేదు. అది తట్టుకోలేక పెయింటింగ్ మానేశాడు. ప్రయత్నించినా మధ్యలో ఆగిపోయేవి. తాను ఎందుకు పనికిరాని వాడుగా తయారవుతున్నానన్న బాధ బ్రతకటం అనవసరం అనే ఆలోచనకు వచ్చినట్లున్నాడు నాటి నుండి వాన్ గోహ్ ఆలోచనలు ప్రాణం తీసుకోవటం ఎలా అనేదాని మీదే.
రహస్యంగా ఒక పిస్టల్ సంపాదించాడు. దానిలోకి ఇమిడే తూటాను తానే తయారుచేసుకున్నాడు. 1880 జూలై 27 అలా నడుచుకుంటూ పొలంలోకి వెళ్ళి అక్కడే తన ఛాతిలోకి కాల్చుకున్నాడు. కాని ఆ తూటా గుండెను తాకలేదు. రక్తం కారుతుండగా తానే చివరికి వెనక్కి వచ్చాడు. చివరికి ప్రాణాలు తీసుకోవటంలో కూడా నేను విఫలుడినే అనుకుంటూ తన నివాసానికి వచ్చాడు. బుల్లెట్ తన ప్రాణం
తీయలేకపోయింది. అంటే తాను బ్రతకాలి. ఇక బ్రతికి మరిన్ని చిత్రాలు గీయాలి అని అనుకున్నాడు. కాని అప్పటికే ఆ బుల్లెట్ చేసిన గాయం ప్రభావం అతని శరీరంలో మొదలైంది.
ప్రాణం తీసుకోవాలనుకున్నప్పుడు అతని ప్రాణం పోలేదు. తిరిగి బ్రతకాలని ఆశపడుతున్న ఆ సమయంలో, బుల్లెట్ దిగిన 48 గంటల తర్వాత వాన్ గోహ్ ప్రాణం పోయింది. అప్పటికి అతని వయసు కేవలం 37 సంవత్సరాలు. మరణానికి ముందు తన సోదరుడితో చెప్పిన మాట “ఈ – విచారం ఎప్పటికి వుండిపోతుంది” అనేది. నిజమే అతని మరణం ఒక విషాదం. ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిన విచారం లోకానిది.
-స్వాతి