కరోనా పై కళాకారులు సమరం-2

రెండవ భాగం:

చైనా కు సమీప దేశమైన వియత్నాం మాత్రం కరోనా పై విజయం సాధించింది. ఈ విజయంతో అక్కడి చిత్రకారులు కీలక పాత్ర పోషించారు. ఈ వైరస్ ని కట్టడి చేస్తేందుకు అక్కడి చిత్రకారులు ఉద్యమ స్పూర్తి కనపర్చారు. లెడక్ హిప్ అనే కళాకారుడు రూపొందిన పోస్టర్ అక్కడి ప్రజల్లో ఎనలేని ప్రచారం కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలతో చేయికలిపి నినదిస్తున్న వ్యక్తి చిత్రంతో గీసిన బొమ్మ వియత్నాం వాసుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మాస్కు ధరించాలని సూచించేలా ఉన్న మరో పోస్టర్ లుయెన్ డిజైన్ చేసారు. ఈ పోస్టర్ను వీధి వీధినా ఏర్పాటు చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. పాం త్రంగ్ హ అనే కళాకారుడు ప్రభుత్వ సహకారంతో రెండు స్టాంపుల్ని అందులో ఒకటి వైద్య సిబ్బంది కరోనా వైరస్ పరీక్ష లో బిజీగావున్న స్టాంపు. మరొకటి  పనిలో నిమగ్నమయిన వైద్య సిబ్బంది వెనుక ఒక పిడికిలి కనిపిస్తుంది. కరోనా కట్టడికి కళాకారులు చేసిన సేవ మంచి ఫలితాన్ని ఇంచ్చిందని వియత్నాం ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం విశేషం.

శిల్పాలకు మాస్కులు:
కరోనా పై అవగాహన కల్పించేదుకు వూహన్ నుంచి అమెరికా వరకు చారిత్రక ప్రసిద్ద వ్యక్తుల విగ్రహాలకు మాస్కులు తొడిగారు. వీటిని చూడగానే మనసులో ఓలాంటి భయం కలిగి ప్రజలు జాగ్రత్తగా వుండాలని. బెల్జియం, అర్జెంటినా, స్కాట్లాండ్ తదితర దేశాల్లో ప్రపంచ ప్రఖ్యాత శిల్పాలకు కొందరు కళాభిమానులు మాస్కులు తొడిగి స్థానికులకు ‘కరోనా ‘ పై అవగాహన కల్పిస్తున్నారు. మన దేశంలో కూడా గాంధీ, అంబేద్కర్ శిల్పాలకు మాస్కులు తగిలిస్తున్నారు. కోల్ కతా లో కూడా తల్లీబిడ్డల విగ్రహానికి మాస్కులు తొడిగి, వాటి ఆవష్యకతను తెలియజేస్తున్నారు.

అమెరికాలో ఒక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త లూక్ జెర్రం 23 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గాజు శిల్పాన్ని రూపొందించి కరోనా పై పోరాడుతున్న వైద్య, భద్రతా సిబ్బందికి నివాళిగా ఈ శిల్పాన్ని అంకితం ఇచ్చారు.

మన దేశంలో ఔత్సాహవంతులయిన చిత్ర కారులందరూ భయంకరమయిన కరోనా గురించి తమ చిత్రాల్లో చూపించి, కళాభిమానులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక ఆన్లైన్ లో చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. బిందాస్ ఆర్టిస్ట్ గ్రూప్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీలో చిత్తూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిత్రకళోపాద్యాయుడు కె. దామోదరాచారి చిత్రించిన కరోనా చిత్రానికి అంతర్జాతీయ బహుమతి గెలుపొందారు.

ఎ.పి. ఆర్టిస్ట్స్ గిల్డ్ అసోసియేషన్ వారు వందమంది చిత్రకారులతో కరోనా పై చిత్రాలు గీయించి, వాటిని గ్రంథరూపంలో తేవడానికి చర్యలు చేపట్టింది. ఇంకా విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు గౌస్బేగ్, రాజమండ్రికి చెందిన పి. బాపిరాజు, కె. రాజా, కె.వి. శివకుమార్, కె. గాంధి, జస్టిస్ వజ్రగిరి, ఇనపకుర్తి, బంగార్రాజు, రోహిణికుమార్, టీవీ, కోటేష్, అమీర్, ప్రసాద్ తదితరులు గొప్ప సందేశాత్మక చిత్రాలు గీసారు. సినీహాస్య నటుడు బ్రహ్మానందం కూడా కరోనా పై పెన్సిల్ చిత్రాన్ని అర్థవంతంగా గీసారు. ఇటీవలే తానా , APNRTC, జిజ్ఞాస సంస్థల ఆధ్వర్యంలో కరోనా పై ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.

ఇవే కాకుండా విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి, విజయనగరం, బొబ్బిలి, అనతపురం టవర్ క్లాక్ వద్ద, కర్నూలు, తిరుపతి, విజయవాడ బెంజ్ సిర్కిల్, అజిత్సింగ్ నగర్ కూడలి వద్ద కొందరు హౌత్సాహికులు కరోనా పై చిత్రాలు గీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈశా పౌండేషన్ వ్యవస్థాపకుడూ, ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ ‘ప్రకృతితో… సంపూర్ణ జీవితం ‘ అనే చిత్రం గీసి వేలం వేయగా వచ్చిన 4 కోట్ల రూపాయల విరాళాన్ని కోయం చిత్తూరు లో నున్న తన ఆశ్రమం చుట్టుప్రక్కలనున్న నిరుపేదలకు  ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఇదే సమయంలో ఎందరో చిత్రకళ జీవనాధారం చేసుకొని జీవిస్తున్న పేదకళాకారులు ఉపాధి కోల్పోయి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి నిస్సహాయకులకు ప్రభుత్వం తరపున చేయూత అందించాల్సిన అవసరంవుంది.

(సమాప్తం)

-సుంకర చలపతిరావు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap