బతుకమ్మ తెలంగాణకి మాత్రమే సొంతమైన ప్రకృతి పండగ. ప్రకృతిని ఆరాధించే పండగ. ప్రకృతిని తల్లిలా స్త్రీలా కొలిచే పండగ. స్త్రీని ప్రకృతిలా ఆరాధించే పండుగ. అలాంటి పండుగను తెలంగాణ ప్రభుత్వం చాలా మహోన్నతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
భాషా సాంసాంస్కృతిక శాఖ, తెలంగాణ బతుకమ్మ సంబురాలలో భాగంగా .. మరోమారు మీ ముందుకు “అసమర్థుడు” నాటకం మరో ప్రదర్శన ఇవ్వబోతున్నాం. ఈ నాటకాన్ని ఉత్సవాలలో భాగం చేసినందుకు CREATIVE THEATRE తరపున మామిడి హరికృష్ణ Harikrishna Mamidi అన్నకు , భాషా సాంస్కృతిక శాఖకు నా కృతజ్ఞతలు.
” అసమర్థుడు ” నాటకం స్త్రీల ప్రాతినిధ్యం .. స్త్రీల శక్తిని చూపే నాటకం. మా నాటకంలోని బతుకమ్మలు మీ గురించి ఎదురుచూస్తున్నారు. మీ అందరికీ స్వాగతం.
October 9th న, సాయంత్రం 6.30 నిలకి హైదరాబాద్ రవీంద్రభారతిలో.
-అజయ్ మంకెనపల్లి