ఆయన మాట్లాడినా, వద్యం చదివినా.. ఆబాలగోపాలానికి శ్రవణాలలో అమృత ధారకురిసినట్లు ఉ oటుంది. అలవోకగా చెప్పే ఆ ప్రవచన ధార… ఆ విశ్లేషణా, ఆ వివరణలు నదీ ప్రవాహాన్ని సెలయేళ్ళని, జలపాతాలను, ఉప్పొంగుతున్న తరంగాలను జ్ఞప్తికి తెస్తాయి. యువజనంలో సైతం ధార్మికచైతన్యం, భక్తి ప్రవత్తులు పొంగిపొర్లుతాయి. సంస్కృతి సంప్రదాయం మూర్తీభవించిన వ్యక్తిగా… స్వచ్ఛమైన అచ్చ తెలుగు పంచకట్టుతో నిరాండబరునిగా…
