నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నేటి ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయంగా “స్త్రీ” అన్ని రంగాల్లోనూ తన అభినివేశాన్ని, ఉనికిని, ప్రాముఖ్యతని చాటి చెబుతోంది. అందునా నాట్యకళల్లో మరింత ముఖ్యపాత్రను పోషిస్తున్నారని చెప్పవచ్చు. నాడు మనువు “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అన్నాడని చెప్పి స్త్రీలను అణగదొక్కడానికి ప్రయత్నించినా నాటి వేదకాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీ తన ప్రతిభను చాటుకుంటూనే ఉంది….

సాహితీ సవ్యసాచి-ద్వానా శాస్త్రి

సాహితీ సవ్యసాచి-ద్వానా శాస్త్రి

తెలుగులో విమర్శనాత్మక సాహిత్యం కొరవడిన సమయంలో ఆయన తన కళాన్ని ఝళిపించినవాడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఎత్తిన కలం దించకుండా విమర్శనారంగంలో నిరంతర కృషి చేస్తున్నవా డు. ఆయన వ్యాసాలు రచయిత హృదయావిష్కరణకు అద్దంపడుతాయి. ప్రాచ్యలక్షణ పరిజ్ఞానాన్ని, పాశ్చాత్య వివేచనాన్ని సమన్వయిస్తూ ఆధునిక పాఠకులకు అవలీలగా అర్థమయ్యే రీతిలో వివరించడంలో ఆయనది అనుభవమున్న కలం. వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ,…

ప్రతి తెలుగు ఇంటా హరికథా గానం నా లక్ష్యం – కరాటే కల్యాణి

ప్రతి తెలుగు ఇంటా హరికథా గానం నా లక్ష్యం – కరాటే కల్యాణి

కరాటే కల్యాణి.. ఆమె నటి మాత్రమే కాదు. అంతకుమించి గొప్ప హరికథా భాగవతారిణి. అంతేకాదు.. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించి నాలుగు సార్లు నేషనల్ చాంపియన్ గోల్డ్ మెడల్ సాధించారు, గాయనిగానూ రాణించారు. వీటన్నింటితో పాటు గొప్ప మానవమూర్తి కూడా, అనాధ పిల్లలను దత్తత తీసుకుని, హరికథా పాఠశాల ఏర్పాటుచేసి వారిని హరికథా భాగవతారులుగా తీర్చిదిద్దాలనేది ఆమె లక్ష్యం, హరికథకులను,…

పాతికేళ్ల ప్రస్థానం – పన్నెండు సినిమాలు

పాతికేళ్ల ప్రస్థానం – పన్నెండు సినిమాలు

అతడు తన తొలి సినిమాతోనే అదరగొట్టినా అందులోని కథ ఏమీ కొత్త కాదు! అప్పటికే బోలెడన్ని తెలుగు, తమిళ సినిమాల్లో అరగదీసిన ఒక రాబిన్హుడ్ కథ! అదే కథనే అంతకు కిందటి ఏడాదిలో కూడా వేరే దర్శకులూ చెప్పారు. అయితే పాతకథనే తన స్టైల్లో చెప్పాడు! తొలి సినిమా(‘జెంటిల్మన్’)తోనే ‘వావ్..’ అనిపించాడు! కొత్త చరిత్రను ప్రారంభించాడు. అలా పాతికేళ్ల…

విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అయిదు రోజులపాటు ( ఏప్రిల్ 24 నుండి 28 వరకు ) రవీంద్రభారతి ప్రాంగణం కళాభవన్లోని ఐసిసి ఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటుచేసిన ఉభయ తెలుగురాష్ట్రాల 144 మంది కార్టూనిస్టుల కార్టూన్లతోకూడిన ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. కార్టూనిస్టుల వృత్తి కత్తిమీద సాము లాంటిదని, కానీ…

శ్రమలో.. అత‌డు.. ఆమె

శ్రమలో.. అత‌డు.. ఆమె

ఒకతరాన వెండితెరపై శ్రమైకజీవన సౌందర్యానికి, కర్షక నేపథ్యగీతాలకు శ్రీశ్రీ పెట్టింది పేరు. ఈ తరంలో అలాంటి పాటలు రాస్తున్నదెవరూ అనగానే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ. ”టప..టప..టప.. టప టప టప చెమటబొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాలే.. నరాలే స్వరాలు కడుతుంటే పాట.. పనితోపాటే పుట్టింది పనీపాటతోనే జతకట్టింది.. ” అంటూ.. శ్రమలోంచే పాట పుట్టిందంటూ…

దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌

దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌

దాసరి నారాయణరావు. ఆ పేరే ఓ సంచలనం. దర్శకుడిగా కానే కాకుండా నిర్మాతగా, కథా రచయితగా, మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా ఇలా వెండితెరపై ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ అసామాన్యం, అనితర సాధ్యం. ఎందరెందరో కొత్తనటీనటులు, దర్శకులను వెండితెరకు పరిచయం చేసి, వారిని అగ్రపథాన నిలిపిన క్రెడిట్ ఆయనదే. ఆయన పరిచయం చేసిన నటులు, దర్శకులను వేళ్లమీద లెక్కించడం…

చంద్ర గారి ప్రోత్సాహం మరువలేనిది – గాలిశెట్టి

చంద్ర గారి ప్రోత్సాహం మరువలేనిది – గాలిశెట్టి

మూడున్నర దశాబ్దాల క్రితం కలం పట్టిన కార్టూనిస్ట్ గాలిశెట్టి. వీరి పూర్తి పేరు గాలిశెట్టి వేణుగోపాల్. పుట్టి పెరిగింది ఖమ్మం. తహశీల్దార్ గా పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో గుర్తింపుపొందారు. ఈ నెల వీరి గురించి తెలుసుకొందాం. నేను 8వ క్లాస్ చదువుతున్న సమయంలో మా ఖమ్మంలోని ఖమ్మం కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్…

మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్

మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్

“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న “మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ లో మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది” అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్. 25-04-2019, ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో “మయూఖా టాకీస్’ యాక్టింగ్ స్కూల్ ను జ్యోతి ప్రజ్వలన…

ప్రతిధ్వనించిన మువ్వల సవ్వడులు

ప్రతిధ్వనించిన మువ్వల సవ్వడులు

అంతర్జాతీయ నృత్యదినోత్సవం అంబరాన్నంటింది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, భారతీయ తంతి తపాల శాఖల ఆధ్వర్యంలో 29-04-19, సోమవారం విజయవాడ సంగీత కళాశాల లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ నృత్య రీతులు ఒక వేదికపై కను విందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఆంధ్రనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించిన కళాకారులు జాతీయ సమైక్యతను చాటారు. భారతీయ…