గురువే బ్రహ్మ

 గురువే బ్రహ్మ

 దాదాపు యాబై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయుడి గొప్ప తనాన్ని గురించి వర్ణిస్తూ డాక్టర్ D.S. కొటారి అనే విద్యావేత్త పలికిన పలుకులివి .చదవడం ,రాయడం లేదా విని అర్ధం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆమాటల్లో ఎంతటి అర్ధం,పరమార్ధాలు ఉన్నాయో అవగతమవుతుంది .             ఒక తరగతి గదిలో పిల్లాడికి ఓనమాలు తదితర పాటాలు చెప్పే ఒక సాధారణ ఉపాధ్యాయుడు…

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

September 12, 2018

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా… స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో…వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో… ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన అధ్యాయం భారత స్వరాజ్య సంగ్రామం. ఈ త్యాగధనులకు, ఈ కర్మధనులకు, ఈ పుణ్యపురుషులకు, ఈ సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి కర్తవ్యం. గురుతరమైన బాధ్యత, ఇది నిస్సందేహం.  ఈ 72వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా,ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి, ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. డా. దీర్దాసి విజయభాస్కర్. ఆంధ్రప్రదేశ్భా షా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ఓ గొప్ప కార్యక్రమానికి సంకల్పించారు. స్వరాజ్యవీరులకు ఘననివాళి సమర్పించాలని నిశ్చయించారు. అదిగో… అలా.. డా.విజయభాస్కర్ సంకల్పం నుండి ఉ ద్భవించింది. “స్వాతంత్ర భారతికి చిత్రకళాహారతి” అనే విశిష్టమైన కార్యక్రమం. అజ్ఞాతులైన ఎందరో స్వాతంత్ర్య వీరుల, దివ్య రూపాలకు ప్రాణప్రతిష్ఠ…