చిత్రకారుడు లింగరాజుకి డాక్టరేట్ ప్రదానం

(ప్రమఖ చిత్రకారుడు గోనె లింగరాజుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ప్రదానం)
గోనె లింగరాజు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాద్యాలయఒలో 22వ స్నాతకోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (విద్యా మంత్రి మరియు భారత నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖమంత్రి), డా. తమిళసాయి సౌందరరాజన్ (తెలంగాణ గౌరవనీయ గవర్నర్) మరియు ప్రొఫెసర్.ఆర్. లింబాద్రి (TSCHE చైర్మన్) సమక్షంలో జస్టిస్ నర్సింహారెడ్డి (గౌరవనీయ ఛాన్సలర్, UOH) నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో కష్టపడి సూర్యాపేట జిల్లాలో, మారుమూల గ్రామం అయిన తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన గోనె ఎల్లయ్య వీరమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించిన లింగరాజు అంచెలంచెలుఇగా ఎదిగి నేడు తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు గోనె లింగరాజు.

5వ తంగతి నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివి చిత్రకళ పైన ఆసక్తి వున్న లింగరాజు JNTU హైదరాబాద్ కాలేజీలో BFA (painting) చదివి తరువాత ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ గారి సూచనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో M.F.A. (painting) తరువాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గడ్డం కృష్ణారెడ్డిగారి పర్యవేక్షణలో “ఆర్ట్ గ్యాలరీలు మరియు దళిత చిత్రకారులు” అనే అంశం పైన M.Phil పూర్తిచేసి తరువాత ప్రొఫెసర్ Y.A. సుధాకర్ రెడ్డి మరియు డా. జె. భీమయ్యగారి పర్యవేక్షణలో “టెక్స్ట్ టైల్ ఆర్ట్ : ట్రెడిషన్ అండ్ చేంజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్” అనే అంశం పైన తన Ph.D. పరిశోధన పూర్తి చేశారు.

LingaRaju with his parents

లింగరాజు చదువుకుంటూనే మలి దశ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కొన్ని పుస్తకాలకు కవర్ పేజీ కి బొమ్మలు చిత్రించినారు, తను చిత్రించిన “తెలంగాణ బతుకు చిత్రాలు” మరియు బతుకమ్మ సినిమాలో గీసిన “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చిత్రాలు” ఉద్యమం సమయంలో వీరికి చాలా పేరు చెచ్చినాయి. ఉద్యమ సమయంలో వీరి చిత్రాలు ఢిల్లీ మరియు తెలంగాణ పది జిల్లాలో ప్రదర్శించారు. వీరు గీసిన చిత్రాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం (2017లో కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత) ఉత్తమ చిత్రకారునిగా గుర్తించి యాబై వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డిగారి చేతుల మీదుగా ఉత్తమ చిత్రకారుడునిగా అవార్డు అందుకున్నారు. ఇదే కాకుండా దేశంలో వివిధ ఆర్ట్ గ్యాలరీలలో వీరి చిత్రాలు ప్రదర్శించారు.

తను ఆర్ట్ చదువుకునే రోజుల్లో బి.ఎఫ్.ఏ. ప్రవేశ పరీక్ష కఠినంగా వుండేది.. తన లాగ ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం గత 18 సంవత్సారాలు నుండి ఎంతో మందికి BFA ప్రవేశ పరీక్షకు కోచింగ్ ఇస్తున్నారు. వీరి దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు దేశంలోని వివిధ ఆర్ట్ కళాశాలలో చేరుతున్నారు. ఒక వైపు చదువుకుంటూనే, తెలంగాణ ఉద్యమంలో మరియు చిత్రకళారంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
తను ఈ స్థాయికి రావడానికి కారణమైన తన తల్లి తండ్రుల ఇచ్చిన ప్రోత్సాహం గొప్పదని అన్నారు లింగరాజు.

Lingaraju with his students.

ప్రస్తుతం తను చదువుకున్న గురుకులంలోనే (పెడ్డిముల్, వికారాబాద్ జిల్లా) ఆర్ట్ టీచర్ గా పనిచేస్తూ విద్యార్థులకు చిత్రకళా బోధన చేస్తున్నారు లింగరాజు. చదువులో మార్గనిర్దేశం చేసినందుకు తన గురువులకు, ప్రోతహించిన మిత్రులకు మరియు కుటుంబ సభ్యుల సహకారానికి రుణపడి వుంటానన్నారు. నా విజయ ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు లింగరాజు.
భవిష్యత్తులో లింగరాజు గారు మరిన్ని విజయాలు సాధించాలని, కళారంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ… అభినందనలు తెలియజేస్తుంది 64కళలు.కాం.

  • కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap