స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు

ఆస్తులు అంతస్థులు ఎవరి వెంటారావని, ప్రతి ఒక్కరు సేవా భావం పెంపొందించు కోవాలంటూ సమాజానికి కరోనా వైరస్ గొప్ప సందేశం అందించిందని తెలంగాణ శాసన మండలి సభ్యులు యెగ్గె మల్లేశం అన్నారు. శనివారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కెవిఎల్ ఫౌండేషన్, వాసు స్వరాంజలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహోన్నత వ్యక్తులను స్ఫూర్తి ప్రదాతల పురస్కారాలతో ఘనంగా సత్కరించి యువతకు సరికొత్త స్ఫూర్తిని అందించారు.
దేశ్ ముఖ్ గ్రామంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి 19 సార్లు షిరిడికి పాద యాత్ర చేసిన మహనీయులు నారాయణ స్వామి గారు, ఎల్బి నగర్ లో అనాథ గృహం నిర్వహిస్తూ ఎందరికో ఆసరా ఇచ్చిన మార్గం రాజేష్ గారు, నాచారంలో మానసిక దివ్యాoగుల సంస్థ సాధన ఆశ్రమం నిర్వహిస్తున్న శ్రీమతి పి.సురేఖా రెడ్డి గారు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి పురస్కారాలు స్వీకరించారు.
బండారు సుబ్బారావు,కె.సత్యనారాయణ గౌడ్ సౌజన్యంతో జరిగిన ఈ వేడుకలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, కె.బందయ్య గౌడ్, డాక్టర్ మహ్మద్ రఫీ, సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి, ప్రముఖ గాయని శ్రీమతి సురేఖా మూర్తి దివాకర్ల, ఆదాయపు పన్నుల అధికారి ఎల్.మోహన్, రైతు అంజయ్య, తెలుగు ప్రపంచం ఎడిటర్ ఎన్.పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తొలుత వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వాసు స్వరాంజలి స్టార్ మేకర్ గాయకులు వాసుపల్లి సురేష్, లావణ్య, స్వాతి రూప, నవీన్, శారద, ఎ.వాణి, జి.సరిత, పి.గౌతమి, ప్రియా పటేల్, దేవాన్ష్ తదితరులు సినీ మధురిమలతో అలరించారు. సీనియర్ గాయకులు ప్రవీణ్ కుమార్, శ్రీమతి సురేఖామూర్తి, చంద్రతేజ, సుజాత, ఇందు నయన, పసుల లక్ష్మణ్ తదితరులు అద్భుత పాటలతో ఉర్రూతలూగించారు. పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవీణ్ కుమార్ శ్రీమతి పారిజాత దంపతులు పర్యవేక్షించారు.
ఫోటోలు: కంచె శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap