స్వతంత్ర్య స్ఫూర్తి – తెలుగు దీప్తి

ఎ.పి.ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్, ఆంధ్రప్రదేశ్ ఇదివరలో ఎన్నో పర్వదినాలలోను, సామాజిక పరిస్థితులలోనూ మన చిత్రకారులు అందరమూ మన చిత్రాల ద్వారా స్పందించినాము.
నేడు మన జాతీయ పర్వదినమైన అజాది కా అమృతోత్సవము సందర్భంగా మరల మనము అంతా ముందుకు రావాలని కోరుతున్నాము.
భారత దేశ స్వతంత్రత కోసం కొదమ సింగాలై పోరాడినవారు, ఆంగ్లేయులను అదిలించిన వారు, అసువులు బాసిన తెలుగు వారు ఆంధ్ర నాట ఎందరో ఉన్నారు. వారిని మన చిత్రాలలో కృతజ్ఞతగా సజీవులను చేసే అవకాశం కలిగింది. కనుక “గిల్డ్” నేడు చిత్రకారులు అందరికీ పిలుపునిస్తూ మీ మీ ప్రాంత స్వాతంత్ర్య యోధులలో ఒకరు లేదా ఇద్దరిని కేవలం నలుపు తెలుపు రంగులలో portraits చిత్రించి, ఫోటోగ్రాఫ్స్ పంపించవలసిందిగా కోరడమైనది. ఆ మహనీయుల సూక్ష్మ పరిచయ వాక్యాలు కూడా రాసి పంపవలసియుంది.

చిత్రాలు 11″ X 14″ సైజ్ లో పెన్సిల్, పెన్, ఇంక్, ఎచ్చింగ్ వంటి ఏ మీడియాలలో నైనా చిత్రాలు చిత్రించవచ్చును.
చిత్రాలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30 వ తేదీ.
ఆ చిత్రాలన్నీ (చిత్రకారుని ఫోటోతో పాటు పేరు, ఉరు, ఫోన్ నంబర్ తో ) ఒక గ్రంథ రూపంగా మలచి నూరుమంది సమర వీరుల రూపాలను జాతికి అందించి తెలుగు పౌరుషాన్ని గుర్తుజేసినవారము అవుదాము. పాల్గొన్న చిత్రకారులందరికి ప్రశంసా పత్రం మరియు చిత్రాల గ్రంథం బహూకరించబడును. ఈ కార్యక్రమం ఏ ఆర్థిక ప్రయోజనములకు లోబడనిది అని తెలియజేయడమైనది.

ఇంకా ఈ విషయంలో మనము చేయగల కార్యాచరణ గురించి మీ అభిప్రాయములు కూడా కోరడమైనది.
ఈ గ్రంథంలో ప్రచురించిన చిత్రాలను ఒక వీడియో చేసి ప్రచారము చేయవచ్చును.
ఈ కార్యక్రమం లో పాల్గొనేవారు మీ సమ్మతిని, మీరు వేయదలచిన సమర వీరుని వివరాలు తెలుపగలరు. ఒకే చిత్రం మరెవరూ చిత్రించకుండా ఉండేందుకు ముందుగా తెలుపగలరు.

మీ వివరాలు, పోర్గెట్ ఫొటోగ్రాఫ్, మీ అభిప్రాయాలు artguild1992@gmail.com అనే చిరునామాకు పంపగలరు. ఈ కార్యక్రమం గురించి ఏమైనా సమాచారం కావలసిన 80084 63073 (DR. B.A.REDDY) నంబర్ కు ఫోన్ చేయగలరు.
ఆంధ్ర వీరుల వివరాలు ప్రాంతీయంగా వికీపీడియాలో లభిస్తాయి. గమనించగలరు.
మీ చిత్రమే ఈ దేశానికి అర్పించే ఒక భక్తి పుష్పం.

SA:

View Comments (3)

  • మంచి ప్రయత్నం..చేస్తున్న రూట్ అసోసియేషన్స్ గిల్డ్ నిర్వాహకులైన శ్రీ బి ఏ రెడ్డి గారికి అభినందనలు

  • మంచి ప్రయత్నం చేస్తున్న ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వాహకులైన శ్రీ బి ఏ రెడ్డి గారికి అభినందనలు