కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని, సామాన్యులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో తన వంతు సహాయం అందించేందుకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ముందుకు వచ్చారు. సామాన్యులను కూడా భాగం చేస్తూ ఓ వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
“ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ విపత్కర సమయంలో నేను నా వంతు సహాయం చేయాలనుకుంటున్నా. పోలీస్, పారిశుధ్య, వైద్యులకు సహాయం అందిస్తా. నాతోపాటు శ్రోతలకు కూడా అవకాశం ఇస్తున్నా, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగవచ్చు. ఎవరు ముందు అడుగుతారో వారికే అవకాశం ఉంటుంది. వచ్చే శనివారం(April 4), సోమవారం(April 6), బుధవారం(April 8), గురువారాల్లో(April 9) రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు మీరు కోరిన పాటలు నేను పాడతా. ఇందుకు సాధారణ రుసుము రూ. 100 చెల్లించాలి. ఇలా సేకరించిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంపై మీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటా. నా అకౌంట్ నెంబరు నా ఫేస్బుక్ ఖాతాలో ఉంచుతా. మొత్తం పాట పాడితే అరగంటలో ఎక్కువ పాటలు రావు. కాబట్టి పల్లవి, ఒక చరణం మాత్రం పాడతా. అందరూ సహకరించాలని కోరుతున్నా” అంటూ బాలు విజ్ఞప్తి చేశారు.

https://www.facebook.com/SP Balu Singer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap