బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ

రియలిస్టిక్ స్టోరీలకు టైమ్ పీరియడ్ కూడా తోడైతే.. అవి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. పలాసలో 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక రఘు కుంచే సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయిల బేబీ కలిసి ఈ పాటను పాడటం విశేషం. బాలు ఓ ముప్పైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెసను తీసుకువచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలను కోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయెట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. అంత పెద్ద లెజెండ్ తో పాడుతున్నా. ఎక్కడా తొణక్కుండా తన సహజమైన గాత్రంతో ఆకట్టుకున్నారు. లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు. దర్శకుడు కరుణ కుమార్ కు ఇది తొలి చిత్రం. కానీ ఆయన రచయితగా సాహిత్యలోకంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రకంగా ఇది కథగా ఎంతో బలంగా ఉండబోతోందో కూడా అర్థం చేసుకోవచ్చు. సుధ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. రఘు కుంచే, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్, శ్రుతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, బండి సత్యం, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీతం: రఘు కుంచే, పి.ఆర్.ఓ: జి. ఎస్.కె మీడియా, నిర్మాత: ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం: కరుణ కుమార్.

SA:

View Comments (1)