రేఖా చిత్రకళలో బాపు అనే వట వృక్షం కింద మొలకెత్తి, పత్రికా రంగంలో 80 వ దశకంలో వెల్లువలా విస్తరించిన రెండాక్షరాల సంతకం.. గోపీ. తెలుగు పాఠకులకు నేటికీ గుర్తుండే రేఖా చిత్రాలు, ప్రకటనల చిత్రాలు, లోగోలు ఎన్నో గీసారు. పుట్టింది జూన్ 6, 1952, మొహబూబ్ నగర్ జిల్లా లో. వీరి పూర్తి పేరు లగుసాని గోపాల్ గౌడ్. JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బి.ఎఫ్.ఏ. పట్టబద్రులయ్యారు. ప్రతిష్టాత్మక బాపు-రమణ అకాడమీ ఆత్రేయపురం- హైదరాబాద్ వారు ప్రతి ఏడాది అందిస్తున్న శ్రీ బాపు గారి అవార్డు 2020 సంవత్సరానికి అందుకుంటున్న ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీ గోపీ గారికి అభినందనలు తెలియజేస్తుంది 64కళలు.కాం పత్రిక.
డిశంబర్ 15 న బాపు గారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్, తెలంగాణ సార్వస్వత పరిషత్ హాల్ లో అందజేయనున్నారు. రమణ గారి అవార్డ్ సినీ రచయిత ఎల్.బీ. శ్రీరాం అందుకోనున్నారు. గత ఐదేళ్ళుగా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు బాపు-రమణ అకాడమీ వారు. ఈ అవార్డు రూపేనా ఒక్కొక్కరికి రూ. 12500/-లు నగదు, ప్రశంసా పత్రం బహుకరిస్తారు.
-కళాసాగర్
Congrats Gopi garu…