గుంటూరు, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో బాపు-రమణ-బాలు కళాపీఠం అధ్యర్యంలో బుధవారం 15వ తేదిన ఉదయం ఘనంగా బొమ్మర్షి బాపు జయంతి వేడుకలు. ఈ కార్యక్రమం చక్కని నాదస్వర వాయిద్యంతో ప్రారంభించారు. ఈ నాదస్వరం ప్రత్యేకత మహిళా కళాకారులుచే ఎలమందరావు కుమార్తెలు పార్వతి, అంజలి సన్నాయి, నాగమణి, నగేష్ డోలు వీరి వాయిద్యం అందరినీ ఆకట్టుకుంది. ఇది చూస్తే చాలు కళలపై రమణగారికి ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
అనంతరం మధుర కంఠంతో మహిళా వ్యాఖ్యాత అందరికీ అహ్వానం పలుకుతూ సభా కార్యక్రమానికి డా. దీవి నరసింహ దీక్షిత్ గారిని సభాద్యక్షులుగా, ముఖ్యఅథిదిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన ఉపసభాపతి కోన రఘుపతిగారితో పాటు పురస్కార గ్రహీతలను ఆత్మీయ అథిదులను వేదికపైకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కళారత్న రమణ యశస్విగారు రచించిన ‘మా గణపవరం కథలు’ పుస్తకావిష్కరణ కోన రఘుపతిగారి చేతులమీదుగా జరిగింది. తరువాత అబో విబో కంధాళం అధ్యక్షులు, ఆచార్య అప్పాజోష్యుల సత్యనారాయణగారికి, మొవ్వ వృషాద్రిపతిగారికి బొమ్మర్షి బాపు జీవితకాల సాధన పురస్కారాలను, బొమ్మర్షి బాపు ఆర్ట్ డైరెక్టర్ పురస్కారం కడలి సురేష్ గారికి, బాపు చిత్రకళా పురస్కారం కళాసాగర్ గారికి కోన రఘుపతిగారి చేతుల మీదుగా అందజేశారు. ఉపసభాపతి కోన రఘుపతిగారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రమణ యశస్వి గారు మరియు కళాపీఠం కార్యవర్గం ఘనంగా సన్మానించారు.
సభలో పురస్కార గ్రహీతలు అనుభూతితో మాట్లాడుతూ అప్పాజోస్యుల వారి మాటలలో చమత్కారంగా త్రివేణి సంఘమంలా ముగ్గరి మహానుభావుల పేరును ఎంచుకోవడం ఇందులో పాలుపంచుకోవడం చాలా సంతోషకరం అన్నారు. వృషాద్రిపతిగారు మాట్లాడుతూ రమణ యశస్విగారి దంపతుల గురించి ఒక పధ్యాన్ని చెప్పి అందరి హర్శద్వనులు రేకెత్తించారు. కాలం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ముగించారు. కడలి సురేష్ గారు మాట్లాతూ బాపుగారి దగ్గర శిష్యరికం చేయడం ఒక అదృష్టం ఇప్పుడు ఆయన పేరుమీద పురస్కారం అందుకోవడం మహా అదృష్టంగా భావించానన్నారు. కళాసాగర్ గారు మాట్లాడుతూ బాపుగారి పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, బాపు-రమణ-బాలు పురస్కారాలను ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని, ఇది కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. అలాగే కడలి సురేష్ గారి గురించి చెబుతూ బాపుగారి దగ్గర శిశ్యరికం చేసి ఆయన వారి నుండి ఏమీ ఆశించకుండా, ఆయన మరణానంతరం బాపుగారి పాదరక్షలను తెచ్చుకుని తన ఇంట్లో ఇప్పటికీ భద్రపరుచుకున్నారని. అది సురేష్ గారికి బాపుగారిపై ఉ న్న ప్రేమకు నిదర్శనం అన్నారు. అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ‘మా గణపవరం కథలు’ పుస్తక సమీక్ష చేశారు. ఇక చివరగా రమణ యశస్విగారు మాట్లాతూ వృత్తిరీత్యా వైద్యవృత్తిలో వున్నా కవిత్వంపట్ల, కళలపట్ల ఉన్న మక్కువతో ఈ కార్యక్రమం తలపెట్టానని, నా కుటుంబసభ్యులు సహకారం ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగానన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తానని తెలియపరుస్తూ వచ్చిన వారందరికి ధన్యవాదాలు చెబుతూ వందన సమర్పణ గావిచారు.
–వి. మల్లికార్జునాచారి.
Congratulations to all award receivers and all the best
64 కళలు శీర్షిక తో మీరు నిర్వహిస్తున్న వేదిక అర్థవంతంగా ఉంది. తత్సంబంధిత కళలకు దర్పణం పడుతున్నది. శ్రమకోర్చి మీరు చేస్తున్న ఈ కళాసేవను గూర్చి ఎంత చెప్పినా తక్కువే, ధన్యవాదాలు అందరికి.