భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ రాజమండ్రి 6 వ వార్షికోత్సవం మరియు భగీరధి గారి 125 వ జయంతి 27 జూలై 2025, వేదిక: శ్రీ చందా సత్రం, రాజమండ్రి.
భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ చిత్రకళ ప్రదర్శనలో భగీరథి గారి ప్రకృతి చిత్రాలతో పాటు బాలల, యువ, సీనియర్ చిత్రకారుల 220 చిత్రాల చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ASP మురళీకృష్ణ గారు, గౌరవ అతిథులుగా రాజమండ్రి శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కొరసాల గారు, రెప్లికా ఆర్టిస్ట్ డా. దార్ల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు సన్నిధానం శాస్త్రి గారు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి మురళీకృష్ణ గారు భగీరధి గారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించి చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. భగీరధి గారి చిత్రాలను సందర్శించి, ప్రకృతి చిత్ర రచనలో భగీరధి గారు చేసిన కృషిని ప్రశంసించారు.
గౌరవ అతిథులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ ప్రదర్శనను సందర్శించి చిన్నారులను ప్రతిభను ప్రశంసించారు. విజేతలను అభినందించారు.
అలనాటి ప్రఖ్యాత చిత్రకారుడు గాంధీ నెహ్రూలచే ప్రశంసింపబడిన శ్రీ భగీరధి గారి 125 వ జయంతిని నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు మద్దూరి శివ సుబ్బారావు గారిని, ఉపాధ్యక్షులు సన్నిధానం శాస్త్రి గారిని, వ్యవస్థాపక కార్యదర్శి ఎన్.వి.పి.ఎస్.ఎస్. లక్ష్మీని సభ్యులను చిత్రకళ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా మాదేటి రవి ప్రకాష్, తారా నగేష్, రవికాంత్, రామ్మోహన్లు వ్యవహరించారు. విజేతలకు 65 వేల రూపాయల నగదు బహుమతులు, 150 గోల్డ్ మెడల్స్,సర్టిఫికెట్స్ బహూకరించడం జరిగింది. చెన్నై, హైదరాబాద్, వరంగల్, భూపాల్, భువనేశ్వర్, మొదలైన ప్రాంతాల నుండి పలువురు ప్రముఖ చిత్రకారులు పాల్గొనడం జరిగింది.
ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న బాలల చిత్రకళా పోటీలు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ మూడు విభాగాలకు ఒక్కొక్క విభాగానికి ఫస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నగదు బహుమతి (500రూపాయలు + గోల్డ్ మెడల్ + సర్టిఫికెట్) సెకండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్(300 + గోల్డ్ మెడల్ + సర్టిఫికెట్) రూపాయలు + గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్) థర్డ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ (200 రూపాయిలు,+గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అవార్డులతో పాటు ఒక్కొక్క విభాగానికి 50 చొప్పున గోల్డ్ మెడల్స్ బహూకరించడం జరిగింది.

సబ్ జూనియర్స్ నుండి విశాఖపట్నానికి చెందిన A. లక్ష్మీ సాన్విక ~ఫస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును, హైదరాబాదు నుండి వచ్చిన A. విక్రాంత్ ~ సెకండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును, బోనం విహాన్ థర్డ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును గెలుపొందారు.
అలాగే యువ చిత్రకళా విభాగంలో ప్రకృతి చిత్ర రచనలో “యంగ్ భగీరధి” అవార్డ్ (2000 రూపాయలు + మెమెంటో+ సర్టిఫికెట్)ను రాజోలు కు చెందిన ఈ సత్య వర్ధన్ గెలుచుకోగా “టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డ్స్” (5000 రూపాయలు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్) రెండు బహుమతులను పార్వతీపురం మన్యానికి చెందిన ఏ. సాయి శ్రీజ, హైదరాబాద్ కు చెందిన సాయి వైష్ణవి గెలుపొందారు, అలాగే మరో ఐదు బెస్ట్ అవార్డ్స్ (గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అవార్డులను మరో ఐదుగురు యువ చిత్రకారులకు ప్రదానం చేసారు.

సీనియర్ చిత్రకారుల విభాగము నుండి ప్రథమ బహుమతిగా “వన్ అండ్ ఓన్లీ సుప్రిమసి అవార్డు ఇన్ ల్యాండ్ స్కేప్ పెయింటింగ్” బహుమతి (5000 రూపాయలు నగదు బహుమతి, మెమొంటో సర్టిఫికెట్) గెలుచుకున్న తారా నగేష్, రాజమండ్రి వారిని సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐదుగురు స్మారక బహుమతులుగా (2000 రూపాయల చొప్పున నగదు బహుమతి, మెమెంటో, సర్టిఫికెట్) అందించగా వాటిలో ఆచార్య మాదేటి రాజాజీ స్మారక అవార్డును నెల్లూరుకు చెందిన దోర్నాదుల శేషయ్య గారు గెలుపొందారు. మద్దూరి శివానంద్ కుమార్ గారి స్మారక అవార్డును చోడవరానికి చెందిన బొడ్డేటి సూర్యనారాయణ గారు గెలుపొందారు. నేలకంటి గంగావతారం, సక్కుబాయి దంపతుల స్మారక అవార్డును హైదరాబాద్ కు చెందిన చింతా వేంకటేశ్వర్లు గారు గెలుపొందారు. కూచిభొట్ల రామకృష్ణ శాస్త్రి, కమల దంపతుల స్మారక అవార్డును పార్వతీపురానికి చెందిన అడ్డాల కుమార్ గారు గెలుపొందారు. మాస్టర్ కూచిభొట్ల వంశీకృష్ణ స్మారక అవార్డును ఏలేశ్వరానికి చెందిన చక్రపాణి గారు గెలుపొందారు.
ప్రజాపత్రిక సంపాదకులు సుదర్శన్ గారు భగీరధి గారి గురించి వ్యాసం ప్రకటించి సభలో అందించారు.
సంస్థ అధ్యక్షులు మద్దూరి శివ సుబ్బారావు గారు చిన్నారులకు ఆసక్తి కలిగించేలా చిత్రకళా కార్యక్రమాలను చేపడతామని ప్రసంగించారు. మాదేటి రవిప్రకాష్, తారా నగేష్, రవికాంత్, మోహన్, భగీరధి గారి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి ఎన్.వి.పి.ఎస్.ఎస్. లక్ష్మి (పద్మ,) త్వరలో భగీరథి గారి జీవిత చరిత్రను ఆవిష్కరించనున్నామని తెలియ జేసి వందన సమర్పణ చేసారు.

న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమతి రాధారాణి గారిని, గౌరవ అతిథులు కొరసాల గారిని, దార్ల నాగేశ్వరరావు గారిని సత్కరించారు.
