
వి.వి. భగీరధి గారి 125వ జయంతి ఉత్సవం, జూలై 2025
అంతర్జాతీయ సీనియర్ చిత్రకారుల, యువ మరియు బాలల చిత్రకళ పోటీ మరియు ప్రదర్శన
బహుమతులవివరాలు :
- Supramacy AWARD: ప్రకృతి చిత్ర రచనలో ఒకే ఒక్క ప్రముఖ చిత్రానికి ఇచ్చే బహుమతి.
ఈ బహుమతికి 5000 రూపాయలు, మొమొంటో, సర్టిఫికెట్, భగీరధి గారి జీవిత చరిత్ర పుస్తకం, మరియు సత్కారం. - ఆచార్య మాదేటి రాజాజీ,
శ్రీ మద్దూరి శివానంద కుమార్,
శ్రీ నేలకంటి గంగావతారం మరియు సక్కుబాయి దంపతులు, శ్రీ కూచిభొట్ల రామకృష్ణ శాస్త్రి మరియు కమల దంపతులు,
శ్రీ కూచిభొట్ల వంశీకృష్ణ ఈ ఐదుగురు ప్రముఖ వ్యక్తుల స్మారక బహుమతులు. ఒక్కొక్క బహుమతికి 2000 రూపాయలు నగదు బహుమతి, మెమెంటో, సర్టిఫికెట్, భగీరధి గారి జీవిత చరిత్ర పుస్తకం మరియు సత్కారం. - చిత్ర రచనలో తమకంటూ ప్రత్యేక శైలిని సాధించగలిగిన ఐదుగురు ప్రముఖ చిత్రకారులకు ఎక్స్ లెన్సీ అవార్డ్స్ .
ఈ బహుమతికి ఒక్కొక్కరికి 1500 రూపాయల నగదు బహుమతి, మెమెంటో సర్టిఫికెట్ ఇవ్వబడును. - ల్యాండ్ స్కేప్, స్టిల్ లైఫ్ కాంపొజిషన్స్, ఇంక్, పెన్సిల్ మరియు అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ మొదలైన చిత్ర రచనా శైలులలో ప్రముఖమైన 20 చిత్రాలకు ఆర్ట్ ఎక్స్ పర్ట్ అవార్డ్స్.
ఈ బహుమతి 20 మందికి ఒక్కొక్కరికి ₹1000 రూపాయలు నగదు బహుమతి, మొమెంటు సర్టిఫికెట్ ఇవ్వబడును.
5. 20 మందికి టాలెంటెడ్ అవార్డ్స్ ఇవ్వబడును. ఈ బహుమతికి ఒక్కొక్కరికి Easel (painting stand), మెమెంటో, సర్టిఫికెట్ బహుకరించబడును.
* యువ చిత్రకారుల విభాగానికి చిత్రాలు పంపడానికి ఆఖరు తేదీ: జూన్ 5 వ తేదీ.
* బాలల చిత్రకళా పోటీకి చిత్రాలు పంపడానికి ఆఖరు తేదీ: జూన్ 25 వ తేదీ.
నియమ నిబంధనలు:
- 25 సంవత్సరాల నిండిన వారు ఈ పోటీకి అర్హులు.
- చిత్రకారులు వారికి నచ్చిన అంశము వేసుకొ వచ్చును.
- చిత్రాల సైజు 30/40 అంగుళాలు సైజు మించరాదు.
- కాపీ చిత్రములు తిరస్కరించబడును.
- పోటీలో పాల్గొనేవారు జూన్ 5 తేదీ లోపల తమ చిత్రాలకు ఫోటో తీసి 8/10 అంగుళాలు సైజు ఫోటోగ్రాఫ్స్ పంపవలెను. గెలుపొందిన విజేతలు కార్యక్రమం నాడు తమ చిత్రాలను ప్రదర్శన కోసం తీసుకురావలసి ఉంటుంది. అలా చిత్రాలను తీసుకురావడం కుదరనిచో బహుమతి రద్దు చేయబడును.
- స్వీయ శైలిలో చిత్రాలు చిత్రించే చిత్రకారులు తమ స్వీయ శైలిని తెలపడం కోసం తమ పోటీ చేసే చిత్రంతో పాటు మరో ఆరు చిత్రాల ఫోటోగ్రాఫ్ లను విధిగా పంపించవలసి ఉంటుంది.
- ఎంట్రీ ఫీజు 500 రూపాయలు.
- ప్రకృతి చిత్రాలను పంపేవారు ఇంటర్నెట్ ద్వారా ఆ చిత్రాన్ని స్వీకరించకూడదు ఒరిజినల్ చిత్రాలు మాత్రమే పంపవలెను.
- విజేతలు ప్రదర్శన కోసం చిత్రాలు పంపి తాము రాలేని పక్షంలో ఒక వారం లోపల తమ బహుమతులను మరియు చిత్రాలను వ్యక్తిగతంగా తీసుకువెళ్లడానికి రావలెను. తరువాత ఆ చిత్రాలకు సంస్థ బాధ్యత వహించదు.
- చిత్రకారులు తమ చిత్రాల వెనుక తమ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, వాట్సప్ ఫోన్ నెంబర్, చిత్రం పేరు, చిత్రం యొక్క వెల, చిత్రం యొక్క సైజు, మీడియం ఆఫ్ ఎగ్జిబిట్, నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ ఇన్ పాక్, ఎంట్రీ ఫీస్ చెల్లించిన వివరాలు: (ఫోన్ పే లోని పేరు, డేట్) బయోడేటా, సిగ్నేచర్ ఆఫ్ ది ఆర్టిస్ట్ మొదలైన వివరాలను రాసి పంపవలెను.)
11. చిత్రాల photographs చేరవలసిన ఆఖరి తేదీ జూన్ 5వ తేదీ 2025.
మిగిలిన వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్: NVPL Lakshmi (9866851781)
కళాసాగర్ గారు.. మా సంస్థను ప్రోత్సహిస్తూ మీరు ప్రచురించిన వార్త సవివరంగా ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..! నమస్కారములు..!