విశ్వ విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 9
మన భారతావనిలో ఉద్భవించిన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్ర ఖని సర్ చంద్రశేఖర్ వెంకట రామన్. ఆర్థిక విభాగంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్ గా చేరి, భౌతిక శాస్త్రవేత్త కావాలన్న ప్రవృత్తి వల్ల ఆ వృత్తితో రాజీపడలేక ఆ పదవికి రాజీనామా చేసి కలకత్తా విశ్వ విద్యాలయంలో భౌతికశాస్త్రాచార్యునిగా ఉంటూనే భారతీయ వ్యవసాయ శాస్త్రంలో పలు పరిశోధనలను చేసి ఉత్తమ ఫలితాలను సాధించాడు. తరువాత కాంతిపై స్కేటరింగ్ ఆఫ్ లైఫ్, క్వాంటం ఆఫ్ నేచురల్ లైట్ వంటి పరిశోధనలు చేసి ఆయన ఆసియా ఖండంలోనే నోబుల్ ప్రైజ్ దక్కించుకున్న మొదటి భారతీయునిగా నిలిచాడు. తబలా, హార్మోనియం వంటి మన భారతీయ సంగీత సాధనాలనుండి వెలువడే ధ్వని తరంగాలపై పరిశోధనలు చేసిన తొలి శాస్త్రవేత్త సి.వి.రామన్. తదుపరి వలపై, స్ఫటికాలపై మానవుని కంటి చూపుపై కూడా పరిశోధనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ శాస్త్రజ్ఞుడు. స్వతంత్ర్యానంతరం మన దేశ తొలి భారతీయ జాతీయ శాస్త్రవేత్తగా నియమింపబడిన ఘనుడు ఈ శాస్త్రజ్ఞుడు. ఈయన పరిశోధనా ఫలితాల గౌరవార్థం ఫిబ్రవరి 28 న “నేషనల్ సైన్స్ డే ” గా పరిగణిస్తున్నాం. పలు సంస్థల నుండి గౌరవ డాక్టరేట్లు, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ సభ్యత్వం, నైట్ వంటి బిరుదులెన్నింటినో సొంతం చేసుకున్న ఈ భౌతిక శాస్త్రవేత్త, భారతరత్న సి.వి. రామన్ నేటికీ మన ధృవతార!

(భారతరత్న సి.వి. రామన్ జన్మదినం నవంబర్ 7, 1888)

SA: