500 సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగు ప్రబంధం పూలబాల “భారతవర్ష ప్రబంధం” ప్రాచీన కవితా శిల్పం.
రోజుకి 20 గంటలు, 8 నెలల రేయింబవళ్ల కష్టానికి, తెలుగు పై ప్రేమకు అక్షర రూపం భారతవర్ష గ్రంథం. ప్రపంచంలో అతిపెద్ద తెలుగు నవల భారతవర్ష తెలుగు ప్రబంధం. తెలుగులో 500 సంవత్సరాల తరువాత వచ్చిన ప్రబంధం.
విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాల ఒక్క ఆంగ్ల పదం లేకుండా 2 లక్షల 50 వేల అచ్చ తెలుగు పదాలతో 1265 పేజీలలో, 200 వృత్త పద్యాలు, 2000 ఉపమానాలు గల నవల వ్రాసి “భారత వర్ష” అని మన దేశం పేరు పెట్టుకున్నాడు. భారతీయ సంస్కృతి తెలుగు సంప్రదాయాలకు పెద్దపీటవేసి తెలుగు మాధుర్యాన్ని రుచి చూపించే “భారత వర్ష” తెలుగులోనే అతి తక్కువ కాలంలో వ్రాయబడిన అతిపెద్ద నవలగా ప్రపంచ రికార్డ్ పొందిన ఈ భారతవర్ష గ్రంధం పై ఈ-టీవీ వారు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు.
నాగార్జునా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య కృష్ణారావు గారు భారత వర్ష సరళ గ్రాంధిక ప్రబంధం అని చెప్పి తన ముందు మాటలో “భారతవర్ష – భారతీయ ఆత్మకి ప్రతీక” అని పేర్కొన్నారు.
15 వ శతాబ్దికి చెందిన ప్రౌఢ కవి శ్రీనాథుడు శృంగారనైషధం అనే ప్రబంధాన్ని రచించారు. ఆ తరువాత ప్రబంధ రచన ఆగిపోయింది. 500 సంవత్సరాలు తరువాత మళ్ళీ తెలుగు ప్రబంధం ప్రాచీన కవితా శిల్పం “భారతవర్ష ప్రబంధం.” వచ్చింది.
1265 పేజీల పెద్ద పుస్తకం భారతవర్షతో పోలిస్తే 145 పేజీల చదవడం భారతవర్ష ప్రబంధం చదవడం చాలా సులభం. 100 పాత్రల పేర్లు, టూకీగా మొత్తం కథ, ప్రాచీన కవితా ధోరణులు, వృత్త పద్యాలు, నవరసాల పద్యాలు. హృద్యమైన కవితా సౌరభాన్ని కలిగిన గద్య శైలి గల ఈ పుస్తకం చదువుతుంటే వీనుల విందుగా ఉంటుంది. భారతీయ సంస్కృతి ని తెలుగు మాధుర్యాన్ని రంగరించిన గ్రంధం భారతవర్ష అని తప్పక అనిపిస్తుంది. సంక్రుత కీర్తనలతో సాహిత్య సరదాలతో తెలుగు ని బంగారు పల్లకిలో ఊరేగించే గ్రంధం “భారతవర్ష ప్రబంధం”. పూలబాల విరచితం. శంకరాభరణం, సిరివెన్నెల గీతాలను, జయదేవుని అష్టపదులని గుర్తుకుతెచ్చే కీర్తనలతో భారతవర్ష మనోల్లాసాన్ని కలిగించే శాస్త్రీయ సాహిత్యం.
మనం ఎటువంటి సాహిత్యాన్ని ఆదరిస్తే అటువంటి ప్రపంచం మన కళ్ళ ముందు ఉంటుంది. అప్పట్లో ఉన్నత విలువలతో కూడిన సాహిత్యాన్నే సృష్టించేవారు. దాన్నే ఆదరించే వారు. అటువంటి ఉన్నత సాహిత్యం నేటికాలానికి ఎంతో అవసరం.
“భారతవర్ష ప్రబంధం” ప్రాచీన కవితా శిల్పం గ్రంథాన్ని రచించిన వెంకట్ పూలబాల గారు అభినందనీయులు.