“భారత్ హమారా”  బాలల చిత్రకళా ప్రదర్శన
presented Samskruthi Puraskaram

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం

ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు పంచి సావనీరును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిణి కుమార్ గారిని సంస్కృతి పురస్కారముతో సన్మానిచారు. మన దేశానికి చెందిన బాలల చిత్రాలతో పాటు ఏడు దేశాలకు చెందిన బహుమతులు పొందిన బాలల చిత్రాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రదర్శింపబడినవి. ఈ ప్రదర్శన ఈనెల 30 తేదీ వరకు కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ బి. సుధా రెడ్డి, ప్రముఖ చిత్రకారులు, జ్యూరీ చైర్మేన్ బి.ఏ. రెడ్డి గార్లు తదితరులు పాలొగొన్నారు.

Bharath Hamara Art exhibition

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap