ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వైజాగ్ లో థాంక్ యు మీట్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో ‘భీష్మ’ డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ మెంబర్లకు వరుణ్ తేజ్, నితిన్, రష్మిక, వెంకీ జ్ఞాపికలను అందజేశారు. వరుణ్ తేజ్ నుంచి నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ జ్ఞాపికలను అందుకున్నారు.
ఈ సందర్భంగా గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను రాసిన ‘వాటే బ్యూటీ’ పాటను హిట్ చేశారు, సినిమానీ హిట్ చేశారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘ఛలో’లో రెండు పాటలు రాస్తే.. వాటిని ఆదరించారు, ఆ సినిమానీ హిట్ చేశారు. నితిన్ హీరోగా మణిశర్మ సంగీతం అందించిన ‘లై’ సినిమాకు పాట రాసిన నేను, ఇప్పుడు మణిశర్మ వాళ్లబ్బాయి మహతి స్వరసాగర్ సంగీతానికి పాట రాయడం ఆనందంగా ఉంది” అన్నారు.
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ... “ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి థాంక్స్” అని చెప్పారు.
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ… ‘భీష్మ’ మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.”నితిన్ గారు, వెంకీ గారు వాళ్లిద్దరంటే నాకు బాగా ఇష్టం. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ గారు వచ్చినందుకు థాంక్స్. నిర్మాత నాగవంశీ గారు మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నా. ‘భీష్మ’ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్” అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ …
హీరో నితిన్ మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్ గారు ఆరడుగుల బుల్లెట్ అయితే, మా వరుణ్ ఆరడుగుల నాలుగంగుళాల బుల్లెట్. ఆయన రాలేకపోయినా మా వరుణ్ గారు వచ్చారు. ఈ ప్రొడ్యూసర్ తో నా మొదటి సినిమా ‘అ ఆ’ పెద్ద హిట్టయింది. ఇది మా రెండో సినిమా. కల్యాణ్ గార్ని మొన్ననే కలిశాను. సినిమా హిట్టయినందుకు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ వారంలో సినిమా చూస్తానని చెప్పారు. ఆయన సినిమా చూశాక మళ్లీ కలుస్తాను. ‘భీష్మ’ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నాకు హిట్ వచ్చింది. ఈ హిట్ ను నాకిచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్ వెంకీకి థాంక్స్ చెప్పుకుంటున్నా. రష్మిక గారు చాలా చాలా బాగా చేశారు. మా ఫస్ట్ కాంబినేషన్ మంచి హిట్టయింది అన్నారు.
‘వరుణ్ తేజ్’ మాట్లాడుతూ…
ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “పది రోజుల నుంచీ నా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వైజాగ్ లోనే ఉంటున్నాను. ఇక్కడి గాలి, అవీ వంటపట్టాయి. నేనిక్కడకు ఒక చీఫ్ గెస్టులా కాకుండా నా ఫ్రెండ్ నితిన్ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాను. ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ, ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, నేను కలిసి ట్రావెల్ చేశాం. ఈ సినిమా స్టోరీ నాకు ముందే చెప్పాడు. సాంగ్స్ ముందే చూపించాడు. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. వెంకీ కుడుముల ఇదివరకు తీసిన ‘ఛలో’ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను అన్నారు.