సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

సాంస్కృతిక నిర్వహణ మూర్తి బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి 30-11-20 న విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.

అతను కట్టెను వత్తి చేసి కార్తీక దీపం వెలిగించుకున్నాడు….
కార్తీకంలో దీపం వెలిగిస్తే మోక్షమని గట్టిగా నమ్మాడు కాబోలు…
చిన్నదానికి పెద్ద దానికి ఆసోమనాధుడే ఉన్నాడు..
అంతా ఆయనే చూసుకుంటాడు…అని చిత్తం శివుని మీద పెట్టి దృష్టి సాంస్కృతికంగా వైపు సాగించాడు…
అడిగి అర్థాన్ని అర్థవంతంగా తీసుకోవటంమో… చక్కగా రూపుదిద్దాక కార్యంలో మిగుల్చుకోవటమే అతనికి తెలుసు…
మోసమో, నమ్మక ద్రోహామో.. తెలియని నిన్నటి మనిషి…
పరిచయం ఉన్న ప్రతి వాడు తనవాడే అనేలా పలకరించే పాతమనిషి…
అడిగిన ప్రతి వాడికి కాదులే..
అర్హత అంతో ఇంతో చూసి ఆసక్తి ఉన్నవారిని కళావేదికపై ప్రోత్సహించే పెద్ద మనిషి…
అందరినీ ఆప్యాయంగా పిలిచే ఆతను పెద్ద అనుకున్న అందరినీ సత్కరించుకుని గౌరవానికి సాంస్కృతిక కిరీటం తొడిగారు…
నిర్వహణలో తానోక యోధుడు…నిర్వహణలో అండగా నిలవమని అడిగితే అదిగినదే తడువు అంతా తానై శ్రమిస్తాడు …
ఆనాటి వెండి తెర జ్ఞాపకాలని నేటి బెజవాడకు పరిచయం చేసిన సాంస్కృతిక నిర్వహణ మూర్తి…
నమ్మిన శివునికి పౌర్ణమి నాట అవిరామధ్యానం చేశాడు…
కట్టెలలో తానో అయిదున్నర అడుగుల కట్టై కార్తీక జ్వాలా దీపమై వెలిగి కైలాసానికి పయనం సాగించాడు..

అతిపెద్ద కార్తీక జ్వాలా ద్వీపం వెలిగించాడుగా ముక్తి రాదా …! రాధా కృష్ణా…!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
లవకుశ లు ఇద్దరు కడు పేదరికంలో ఉన్నారని, అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియని తెలుగు ప్రేక్షకులకు వారి ఆచూకీ చెప్పి వారిని, వారితో పాటు సీతమ్మ పాత్ర వేసిన అంజలీదేవిని మద్రాస్ బ్రతిమాలి ఆహ్వానించి అలనాటి సినీ రాజధాని విజయవాడ నగరానికి పాత మధుర జ్ఞాపకాలను, వారి ముగ్గురు కు ఘన సత్కారం నిర్వహించారు. పేదరికంలో ఉన్న లవకుశల (నాగరాజు, నాగ సుబ్రహ్మణ్యం)లకు పెద్దలతో ఆర్థిక సహకారం అందించే లా చేసిన వ్యక్తి బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి. వారి ముగ్గురిని మాత్రమే కాదు జమున, పద్మనాభం,మాధవపెద్ది, సంగీతం కోటి, ఘంటసాల రత్నకుమార్, సుశీల, భక్త ప్రహ్లాద ఫేం రోజా రమణి, చంద్ర మోహన్, గిరిబాబు, లాంటి 50 మందికి పైగా పాత నటులను విజయవాడకి ఆహ్వానించి తన సోమనాథ నాట్యమండలి నుంచి బిరుదు ప్రదానం చేసేవారు. సన్మానం పొందే వ్యక్తి హైట్ లో సన్మాన ప్రశంసా పత్రం రాసి ఇచ్చేవారు. ఎవరినైనా అయ్యా బావున్నారా.. అమ్మా బావున్నారా.. అంటూ మనసారా పలకరించే వారు.. కల్మషం లేని మనిషి.

తాను కళ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఖర్చు అవుతుంది అని, నిర్మొహమాటం గా అడిగి స్పాన్సర్లు దగ్గర ఆర్థిక లావాదేవీలు జరిపేవారు. ఏదో గుడ్డిలో మెళ్ళ అన్నట్లు అన్ని ఖర్చులు పోయి ఓ మూడు నుంచి 5 వేలు మిగులుతాయి. అన్ని ఈవెంట్స్ లో అంత మిగలవు.. కొన్ని వెయ్యి మిగిలినా కార్యక్రమం చక్కగా నిర్వహించటంలో వెనక్కు తగ్గడు. పెద్ద కార్యక్రమాలలో 10నుంచి 15 మిగిలినా ప్రతి నెలా ఉండవు కదా.. అందుకే పాట కచేరిలు, సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కొత్తగా కళా సంస్థ ఏర్పాటు చేసేవారికి చక్కగా సహకరిస్తారు. ఒకే సారి ఒక వేదికపై 20 మందికి సన్మానం చేసే ప్రక్రియ ప్రారంభించింది రాధాకృష్ణ నే.. తనకు చేతైన స్థాయిలో గౌరవంగానే ఆ కార్యాలను రూపకల్పన చేస్తారు. ఎంత పడి వేలు మిగిలినా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మాటలు కాదు ఒక పెళ్లి చేసిన దానితో సమానం. పెళ్లిలో కట్నం ఉంటుంది. భోజనాలు ఉంటాయి. ఇక్కడ కట్నం అంటే సినిమా తాలూకు వచ్చిన పెద్దలకు కనీసం 50000 వరకు చదివించాలి. ఒక బోజనాలే ఉండవు. కానీ మిగాతా అంతా సేమ్. ఈ నిర్వహణలో పడి అన్నం వేళకు తినని సమయాలు కోకొల్లలు. చాలా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆ కష్టం చేసిన ప్రతి కళాకారునికి తెలుస్తుంది. ఏదైనా బెజవాడ లో ఆనాటి మధుర జ్ఞాపకాలని నేటి విజయవాడకి పరిచయం చేయటం లో రాధాకృష్ణ ఎంతో కృషిచేశారు. సాంస్కృతిక పరంగా రాధా కృష్ణ లేని లోటు తీర్చలేనిది. ఈ మధ్యే ఆయన సంస్థ పేరు సోమనాథ్ కల్చరల్ అకాడమీగామార్చారు. ఆయనతో కలిసి చాలా కార్యక్రమాలలో నిర్వహణ చేశాను. ఎప్పుడు మా సోమనాథుడు శివుడు ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు.. అని అనడం అలవాటు. అందుకేనేమో ఆశివుడు కార్తీక పౌర్ణమి రోజు ఆయనని తన వద్దకు తీసుకువెళ్ళారు..

ఈ మధ్యే నాకు కాల్ చేసి ఒక ప్రముఖుని కలవడం కోసం ఆరా అడిగారు. సింగం శెట్టి పెద బ్రహ్మం చనిపోయిన విషయం కాల్ చేసి చెప్పేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ…
శ్రీనివాస రెడ్డి
___________________________________________________________________________

మిత్రుడికి అశృతాంజలి

సహృదయుడు, మంచి నటుడు, “సంగీత విభావరి” కార్యక్రమాల నిర్వాహకుడు బొలిశెట్టి రాధాకృష్ణ మూర్తి తెల్లవారితే 30.11.2020 న హార్ట్ ఎటాక్ తో కార్తీక పౌర్ణమి రోజున శివసన్నిధికి చేరినట్లు తెలిసి, చాలా బాధ పడ్డాను.

Adivi Sankararao
  • మాకు నాటకరంగంలో మంచి మిత్రుడు. అనేక దశాబ్దాలుగా కలిసి ఉన్నాం.
  • అప్పుడు వృత్తి రీత్యా బీరువాల వ్యాపారం చేసేవాడు. మాకు కూడా సులభ వాయిదాలపై మంచి గట్టి బీరువా చేసి ఇచ్చాడు విజయవాడలో మేము ఉన్నప్పుడు.
  • మేకప్ చేసేవాణ్ణి నాటకాల్లో. ఒకసారి ఏదో ఎడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ కోసం ఒక ఋషి వేషం కూడా మేకప్ చేసి పెట్టాను.
  • ఆయన చేసిన కార్యక్రమాలకి చాలా ఫోటోలు తీసి పెట్టాను.
  • విజయవాడలో సంగీత కార్యక్రమాలు పెద్దలకు, సినీ ప్రముఖులకు చాలా కార్యక్రమాలు నిర్వహించి, మంచి దక్షత కలిగిన నిర్వాహకుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు అందరిలో.
  • పాత సినిమాల విషయంలో ఏది అడిగినా వెంటనే కరెక్ట్ సమాధానం చెప్పేవాడు.

ముఖ్యంగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే…
65 ఏళ్ళు నేను విజయవాడలో ఉండి, కుటుంబపరంగా నేను హైదరాబాద్ మకాం మారుస్తున్న సందర్భంలో… నాకు అత్యంత భారీ “వీడ్కోలు సన్మానం ” ఏర్పాటు చేశాడు. ఇది మరపురాని జ్ఞాపకం నాకు.

‘కళామిత్ర’ అడివి శంకరరావు
మేకప్ ఆర్టిస్టు, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap