కాకినాడలో కుమార్ పుస్తకావిష్కరణ

ఇటీవల (జూన్ 23న) కాకినాడలో ప్రముఖ ఆధునికాంతర కవి శ్రీ బి.ఎస్.ఎం. కుమార్ గారి నాలుగు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య ప్రపంచంలో ఆవిష్కరణ సభలు కొత్త కాదు. కానీ ఒకే కవి రచించిన 4 పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించబడడమే విశేషం. కాకినాడ గాంధీ భవన్ లో డా. అద్దేపల్లి రాంమోహనరావు గారి ప్రేమాస్పద స్మితిలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

‘బ్రోకెన్ లేండ్స్స్ సిల్హౌటెడ్ డైలాగ్స్’ నవలను ఏం.యూ. విశ్రాంత ఆచార్యులు టి. విశ్వనాధరావు ఆవిష్కరించారు. మోదుకూరి శ్రీనివాస్ సమీక్షించారు. ‘ఆర్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ’ పుస్తకాన్ని ప్రఖ్యాత కథకులు లెనిన్ అనిశెట్టి ఆవిష్కరించారు. ప్రముఖ కవులు శ్రీరామకవచం సాగర్ గారు, డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారు సమీక్షించారు. ‘లాంగ్వేజ్ ఆఫ్ ఆబ్సర్డ్ లైఫ్’ ను ఎం. కమలకుమారి గారు ఆవిష్కరించారు. జె.వి.ఎల్. నరసింహారావు, మాకినీడి గార్లు సమీక్షించారు. తెలుగు నవలా సమయకాన్పు వర్తమాన సంక్షోభ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. స్త్రీవాదం, హింసాత్మక ధోరణికి అద్దం పడుతుందని ఆవిష్కరించిన మందరపుహైమవతి అన్నారు. టి. సత్యనారాయణగారు, అవధానుల మణిబాబు గారు సమీక్షించారు. మాకినీడి సూర్య భాస్కర్ గారు రచించిన ‘రూట్స్ సెగ్మెంటల్ బ్రీఫ్స్’ ను సాగర్ గారు ఆవిష్కరించగా, కుమార్ గారు సమీక్షించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సభలో అద్దేపల్లి ప్రభు, మధునాపంతుల, బొల్లోజు బాబా, పద్మజవాణి, అద్దేపల్లి జ్యోతి, పుప్పాల సూర్యకుమారి, గరికపాటి మాస్టారు మొదలైన కవులు, సాహితీ వేత్తలు పాల్గొని విజయవంతం చేసారు. సభా నిర్వహణ పున్నమరాజు ఉమామహేశ్వర రావు చేశారు.

-మందరపు హైమవతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap