లూయిస్ బ్రెయిలీ 211వ జయంతి జనవరి4
ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయ వాది, మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరానికి 20 మైళ్ళ దూరంలో నున్న మారుమూలలోఉన్న
రానక్రూవె గ్రామంలో మౌనిక్, సైమన్ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడిగా జనవరి 4, 1809లో జన్మించారు
మౌనిక్ సైమన్ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు. లెదర్ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ పోషణ సాగించే వారు.
లూయీస్ బ్రెయిలీ చాలా చురుకైనవాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు. తన తండ్రితో ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసుకునే వాళ్ళ షాపుకు వెళ్ళాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుక రిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో ఓ పదునైన కత్తి ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది.
స్థానిక హాస్పిటల్‌లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు. బీదరికం కారణంగా మంచి వైద్యం అందిచ లేకపోవడంతో కంటిచూపు మొత్తం పోయింది. మొదట ప్రమాదానికి గురైన కన్ను కొంత కాలానికే ఇన్‌ఫెక్షన్ అయి రెండవ కంటిచూపు తన 5వ ఏట పూర్తిగా కోల్పోయి అంధత్వానికి దారితీసింది.
అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశయంతో మౌనిక్ సైమన్ దంపతులు లూయీస్ బ్రెయిలిని అక్క అన్నతో పాటుగా వారి గ్రామంలో నున్న పాఠశాలకు పంపించారు. ఆ పాఠశాలలో బ్రెయిలీ కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తన తండ్రి చెక్కపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా బ్రెయిలీకి అక్షర జ్ఞానం కలిగించాడు. చదువుకోవాలనే పట్టుదలను తన తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.
ప్రపంచంలో మొదటగా 1784లో వాలంటీస్ హవే చేత ప్రారంభం అయిన అంధుల పాఠశాలలో పుస్తకాలు అన్నీ కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడిమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. ఈ పుస్తకాలు పెద్దగా బరువుగా ఖరీదైనవిగా ఉండడంవల్ల వీటి ద్వారా విద్యాభ్యాసం సాధ్యపడేది కాదు. దీనితో సంతృప్తి చెందనటువంటి లూయీస్ బ్రెయిలి 1821లో చార్లెస్ బార్ బెరియన్ అను సైన్యాధికారి రూపొందించినటువంటి పాఠశాలలో రహస్య డీకోడ్ భాష ద్వారా సైనికులకు 12 చుక్కలతో మాత్రమే ఇచ్చే పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంత కాలం చదువుకొనసాగించాడు. దానితో సంతృప్తి చెందకుండా దానిపై అనేక పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల పరిశోధనల అనంతరం 1832లో అభివృద్ధి చెందిన సరళ పద్ధతిలో చుక్కల లిపిని కనుగొన్నాడు. ఈ లిపికి బ్రెయిలి పేరు మీదగానే నామకరణం చేయడం మూలంగా బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది
లూయిస్ బ్రెయిలీ మేధాశక్తికి బహుమతిగా నేషనల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ నందు ప్రొఫెసర్ పోస్టుకు 1833లో ఎంపికయ్యారు. లూయీస్ బ్రెయిలి విద్యార్థులకు హిస్టరి, ఆల్‌జిబ్రా, చరిత్ర పాఠ్యాంశాలు బోధించేవారు. 1831లో 6 చుక్కల లిపిని కనుగొన్నప్పటికి కూడా ప్రశాంతంగా ఉండకుండా నిరంతరం శ్రమిస్తూ 1839 లో సున్నితమైన సులభ తరమైన డెకాపాయింట్ అను కొత్త పద్ధతిని ఉపయోగించి పేపరుపై రంధ్రాలు సులభంగా చేసే పద్ధతిని కనిపెట్టి బ్రెయిలీ లిపిని అభివృద్ధి పరిచాడు.
లూయీస్ మంచి సంగీత విధ్వాంసుడు. ఇతను 1834 – 1839 వరకు ఫ్రాన్స్ దేశంలోనున్న చర్చిల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడు. వాలంటీస్ హలే చనిపోయిన తర్వాత అనంతరం వచ్చిన అంధుల పాఠశాల ప్రిన్సిపల్‌గా వచ్చినటువంటి డాక్టర్ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్, లూయస్ ను చరిత్ర పుస్తకాన్ని మొత్తం బ్రెయిలి లిపిలోకి అనువాదం చేసినందుకు తన ఉద్యోగం నుంచి తీసేసాడు.
లూయీస్ బ్రెయిలీ కనిపెట్టిన లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించ బడిందంటేనే లూయీస్ బ్రెయిలీ ముందు చూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీ లిపి కనుగొనబడిన తర్వాత సమాచార రంగంలో అంధులకు విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. లూయీస్ బ్రెయిలీ చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు తన పేరు మీద పోస్టల్ స్టాంపులు, కరెన్సీ విద్యా సంస్థలకు, పట్టణాలకు పేర్లను పెట్టుకుంటున్నాయి. మన దేశంలో రెండు రూపాయల కాయిన్‌ను, యుఎ్‌సఎ ఒక డాలరును, ఫ్రాన్స్, జర్మనీ ప్రపంచ వ్యాపితంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
మానసిక సామర్థ్యానికి వైకల్యం అడ్డుకాదని ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అంధుడై అంధుల కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుకూలంగా చిన్ననాటి నుంచి అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న లూయీస్ గారిని ట్యుబరిక్యులోస్ మహమ్మారి వ్యాధి పట్టిపీడించడంతో 1852లో తన సొంత గ్రామం అయిన క్రూవెలో ప్రాణాలు విడిచాడు.
లూయీస్ బ్రెయిలీ చనిపోయిన రెండు సంవత్సరాల అనంతరం లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. యూరఫ్ లో 1873 అనంతరం ఈ లిపి విస్తరించింది. యుఎస్ లో 1883లో ఈ లిపిని వాడడం ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా ఇంగ్లీషు భాషలోకి లిపిని 1932లో ప్రవేశపెట్టారు. బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు