BSNL ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

(BSNL వారి 23వ వార్షికోత్సవ సందర్భంగా గుంటూరులో చిత్రలేఖన పోటీ నిర్వహణ)

శ్రీ చైతన్య స్కూల్ సి.బి.ఎస్.ఈ. వైట్ హౌస్ గుంటూరు నందు బిఎస్ఎన్ఎల్ వారిచే BSNL ఫైబర్ అనే అంశంపై డ్రాయింగ్ కలరింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు తమలోని సృజనాత్మకతను జోడిస్తూ రంగులతో వివిధ రకాలుగా చిత్రాలను చిత్రించారు. ఈ చిత్రించిన చిత్రాలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ రెండు కన్సిలేషన్ విజేతలుగా డ్రాయింగ్ మాస్టర్ వి. మల్లికార్జునాచారి ఎంపిక చేశారు.

అనంతరం పాఠశాల ఆవరణంలో విజేతలకు స్కూలు ప్రిన్సిపల్ నర్మద గారు, బిఎస్ఎన్ఎల్ జి.ఎం. ఎస్. శ్రీధర్ గారు, ప్రైమరీ ఇంచార్జ్ అనూష గారి చేతుల మీదుగా పిల్లలకు మొదటి బహుమతి వి ఆశ్రిత్ సంవత్సరం పాటు 8500 విలువగల ఫైబర్ నెట్, రెండవ బహుమతి జయపాల్ ఆరు నెలల పాటు 4250 విలువగల ఫైబర్ నెట్, మూడవ బహుమతి జి. కార్తికేయ మూడు నెలలపాటు 2100 విలువగల బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని, అలాగే కన్సిలేషన్ అమాన్ సమన్వి లకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జి.ఎం. శ్రీధర్ గారు మాట్లాడుతూ పిల్లలు తక్కువ టైంలో BSNL ఫైబర్ అనే అంశాన్ని రకరకాలుగా రంగురంగులతో చిత్రించారని… ఇలా వేయటం చాలా ఆనందంగా కలిగించిందని, విజేతల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతల తల్లిదండ్రులు వారి సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ రాజీవ్ గారు, స్కూల్ క్యాంపస్ ఇంచార్జ్ రమేష్ నాయక్, మరియు పి.టి. టీచర్ హరిత పర్యవేక్షించగ BSNL వారి బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగినది.

SA: