“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

కళాసాగర్ రూపొందించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు” (166 కార్టూనిస్టుల సెల్ఫీల పుస్తకం)
నవంబర్ 20 న శనివారం సాయత్రం గం. 5.20 ని.లకు ‘వెబెక్ష్’ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి గారు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారు, రచయిత, దర్శకులు ఎల్.బి. శ్రీరాం, “కొంటె బొమ్మల బ్రహ్మలు” పుస్తక సంపాదకులు కళాసాగర్, సీనియర్ కార్టూనిస్టులు సరసి, శంకు, బ్నిం, బొమ్మన్, అరుణ్, రాంప్రసాద్, శేఖర్, శంకర్, షేక్ సుభాని, డా. పూతేటి, వర్చస్వీ, రాజు, కృష్ణ, పద్మ, లాల్, సురేన్, కాజా ప్రసాద్, సంబంగి తదితర కార్టూనిస్టులు అనేక మంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జయదేవ్ గారు ప్రారంభోపన్యాసం చేస్తూ తెలుగు కార్టూన్ కు 90 వసంతాల పైబడిన చరిత్ర వుందని, దీని వెనుక తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావుగారి నుండి ఎందరో మహామహులైన కార్టూనిస్టుల కృషి వుందని, అలాంటి వారి జీవిత విశేషాలు, కార్టూన్లు నేటి-రేపటి తరాలకు అందించేందుకు చేసే ప్రయత్నమే ఈ ‘కొంటె బొమ్మల బ్రహ్మలు’ పుస్తకమన్నారు. మన దేశంలో అతి ఎక్కువమంది కార్టూనిస్టులున్న రాష్ట్రం మనదే నన్నారు. అందుకు సాక్ష్యం కళాసాగర్ రూపొందించిన పుస్తకమే అన్నారు.

“కొంటె బొమ్మల బ్రహ్మలు” పుస్తకాన్ని ఆవిష్కరించిన సీనియర్ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తిగారు మాట్లాడుతూ…
తెలుగు కార్టూన్ ప్రపంచంలో సమగ్రంగా వెలువడిన తొలి పుస్తకంగా ఈ”కొంటె బొమ్మల బ్రహ్మలు” అన్నారు. ఇంగ్లీష్ జర్నలిజం లో కార్టూన్ కు ఆద్యుడు శంకర్ పిళ్ళై అని, వారిని ఆ రోజుల్లో బెంగులూరు లో కలిసి కాసేపు ముచ్చటించే అవకాశం తనకొచ్చిందన్నారు. శంకర్… నెహ్రూ, ఇందిరా గాంధీ లాంటి ఉద్దండులయిన రాజకీయ నాయకులపై కార్టూన్లు గీసి పేరుపొందారని, ఎవకికీ బయపడేవారు కాదని అన్నారు. మన తెలుగు కార్టూనిస్టులతో చాలా మందితో కలిసి పనిచేసే అవకాశం తనకి కలిగిందని, అందులో గీతా సుబ్బారావు, మోహన్, సురేంద్ర, శంకర్ లాంటివారెందరో వున్నారన్నారు.
పుస్తకావిష్కరణ అనంతరం తొలిప్రతిని యువ కార్టూనిస్ట్ ఇళయరాజా స్వీకరించారు.

ముఖ్య అతిథి సినీ రచయిత, నటులు ఎల్.బి.శ్రీరాం మాట్లాడుతూ…
166 మంది గొప్ప-గొప్ప కార్టూనిస్టుల జీవన రేఖలతో కొలువైన, బరువైన, తియ్యనైన ఈ పుస్తకం పుల్లారెడ్డి మిఠాయి కొట్టులా నిండుగా వుందన్నారు. నాకు ప్రతీ కార్టూన్ ఒక సినిమాలా కనపడుతుందన్నారు. కార్టూన్ కు అతి ముఖ్యమైనవి రెండు రాత-గీత. సినిమా అయినా కార్టూన్ అయినా రెండూ బావున్నప్పుడే హిట్ అయ్యేది. ఈ పుస్తకంలో నాకు తెలిసిన, నేనెరిగిన కార్టూనిస్టులనేక మంది వుండడం సంతోషమన్నారు.

ఈ పుస్తక రూపకర్త, సంపాదకులు కళాసాగర్ మాట్లాడుతూ…
నేడు తన పదిహేనేళ్ళ కల సాకారం అయ్యిందని, తెలుగు కార్టూనిస్టుల గురించి సమగ్రంగా ఒక పుస్తకం తేవాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా వుందన్నారు. ఈ పుస్తకం కోసం చేసిన పరిశోధనలో ఎందరో అజ్ఞాత కార్టూనిస్టుల వివరాలు సంపాదించానని, అలాగే తొలి తెలుగు కార్టూన్ 1927 లోనే ప్రచురించిన అధారాలు దొరికాయన్నారు. ఈ పుస్తకానికి అన్ని విధాల సహకరించిన మిత్రులందరికీ పేరు-పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

క్రోక్విల్ హాస్యప్రియ వ్యవస్థాపకులు, కార్టూనిస్ట్ శంకు మాట్లాడుతూ… కళాసాగర్ కృషి వల్ల ఈ పుస్తకం భావితరాలకు ఒక మార్గదర్శిగా వుపయోగపడుతుందన్నారు.

రచయిత, కార్టూనిస్ట్ కళారత్న బ్నిం మాట్లాడుతూ…ఈ పుస్తకానికి ‘కొంటె బొమ్మల బ్రహ్మలు’ శీర్షికను సూచించినందులకు తనకు గర్వంగా ఉందని. అద్భుతమైన పుస్తకం ప్రచురించి, కార్టూనిస్టులకు ఊపును, రూపును ఇచ్చిన కళాసాగర్ గార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
రచయిత బి.ఎం.పి.సింగ్ మాట్లాడుతూ కార్టూనిస్ట్ సమాజాన్ని రిపేరు చేయగలడు.. కొత్త సమాజాన్ని ప్రిపేర్ చేయగలడన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ కార్టూనిస్టులు సరసి, శంకు, బొమ్మన్, అరుణ్, రాంప్రసాద్, శేఖర్, డా. పూతేటి, కృష్ణ ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం మహిళా కార్టూనిస్ట్ సునీల ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ ఆన్లైన్ కార్యక్రామాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు….
https://www.youtube.com/watch?v=JS52FPLOR60&t=585s

Konte Bommala Brahmalu

2 thoughts on ““కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

  1. బాగుంది మీ కల ఇన్నాళ్లకు సాకారం అయింది. మీరు కార్టూనిస్టులకు ఇతర కళాకారులకు చేస్తున్న సేవ అమోఘం.అనితర సాధ్యం కూడా. ఎందరో కార్టూనిస్టులని వెదికి వారి వివరాలు వారి చేతే రాయించటానికి మీరు పడిన శ్రమ అసాధ్యం ఇతరులకు. పుస్తకం కూడా బహుళ ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నా.

  2. *కొంటె బొమ్మల బ్రహ్మలు* 166మంది కార్టూనిస్టుల సమాచారాలతో ఎంతో వ్యయ ప్రయాసలతో తయారుచేయబడిన సమగ్ర విశేషఅద్భుతగ్రంధం. శ్రీ కళాసాగర్ గారి కల ద్వారా కార్టూనిస్ట్ ల అందరి కలానెరవేర్చిన కళాసాగర్ గార్కి కృతజ్ఞతలు –Bomman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap