ఆంధ్ర సారస్వత పరిషత్తు – కార్టూన్ పోటీలు

కార్టూన్ల ద్వారా తెలుగు వికాసం – అంతర్జాతీయ స్థాయి కార్టూన్ పోటీలు

3 వ ప్రపంచ తెలుగు మహా సభలు-2026 సన్నాహాలలో భాగంగా ఆంధ్ర సారస్వత పరషత్తు ఆధ్వర్యంలో కార్టూన్ల ద్వారా తెలుగు వికాసం – అంతర్జాతీయ కార్టూన్ పోటీలు. (ఏ వయసు వారైనా పాల్గొనవచ్చు) నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ప్రథమ బహుమతి – 5116/-
ద్వితీయ బహుమతి – 3116/-
తృతీయ బహుమతి – 2116/-

మూడు ప్రత్యేక బహుమతులు ఒక్కొకరికి – 516/- ప్రశంసా పత్రాలు. అందజేయబడతాయని తెలిపారు.
ఒక్కొక్కరు రెండు కార్టూన్స్ పంపవచ్చు. కార్టూన్స్ A4 సైజ్ లో వుండాలని, ఇంతకు ముందు ప్రచురితమైనవి పంపరాదని ఆంధ్ర సారస్వత పరిషత్తు,అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ కోరారు.

చివరి తేదీ: కార్టూన్స్ అక్టోబర్ 10 వ తారీఖు లోపున నిర్వాహకులకు అందాలని. విజేతలను అక్టోబర్ 29 వ తారీఖున ప్రకటిస్తామని తెలిపారు. విజేతలకు తెలుగు మహాసభల్లో బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు.

ఎంపిక అయిన కార్టూన్లను 3 వ ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రత్యేక వేదికపైన ప్రదర్శిస్తామని, కార్టూన్స్ పంపవలసిన ఈమెయిల్, cartoonisthari2013@gmail.com
వాట్సాప్ నెంబర్ . 9866084124 .. ఈ పోటీలకు సమన్వయకర్త గా ప్రముఖ కార్టూనిస్ట్ బి. హరి వెంకట రమణ వ్యవహరిస్తారని సంస్థ కార్యదర్శి శ్రీ ధవేజీ, పి. రామచంద్రరాజు, ముఖ్య సమన్వయ కర్త, శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్, సహ సమన్వయ కర్త తెలుగు మహాసభలు తెలిపారు.

Share via
Copy link
Powered by Social Snap