విజయవాడ జాషువా సాంస్కృతిక వేదిక – 64 కళల డాట్ కామ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ” నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో విజేతలకు ఆదివారం మార్చి 21 విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విప్లవ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి చేతుల మీదుగా అమరావతి బాలోత్సవం గౌరవ అధ్యక్షుడు, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నపనేని మురళికృష్ణ, నిర్వాహకులు సుబ్బారెడ్డి, నారాయణ గుండు, 64 కళల డాట్ కామ్ ఎడిటర్ కళాసాగర్, సునీల్ కుమార్, గిరిధర్ ల సమక్షంలో నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను విజేతలకు అందజేసారు.
బహుమతులు అందుకున్న వారి వివరాలు – మొదటి బహుమతి కార్టూనిస్ట్ శ్రీవల్లి (హైదరాబాద్), రెండవ బహుమతి అంతోటి ప్రభాకర్, (కొత్తగూడెం), మూడవ బహుమతి ప్రసిద్ధ(హైదరాబాద్), ప్రోత్సాహక బహుమతులు 1). జెన్నా (విశాఖపట్నం) 2). ప్రసాద్ కాజా(హైదరాబాద్) 3). ప్రేం (విశాఖపట్నం) 4). మాడా రాము (అమలాపురం) 5) ఆదినారాయణ (విజయవాడ) కార్టూనిస్టులు అందుకున్నారు. ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 50 మంది కార్టూనిస్టులు పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికి అభినందన పత్రం మెయిల్ ద్వారా పంపడం జరిగింది. చిత్రకళా విభాగంలో విజేతలకు కూడా బహుమతులు అందజేసారు.
3 వ అంతస్థు లో కార్టూనిస్ట్ బాచి సారధ్యంలో ‘హాస్యానందం’ మాసపత్రిక నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 70 మంది కార్టూనిస్టుల సమ్మేళనం మరియు ప్రదర్శనలో జరిగింది.