‘మల్లెతీగ’ కార్టూన్ల పోటీ విజేతలు

మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ-జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోటీకి అనూహ్యంగా కార్టూన్లు అందడం వల్ల మొదట అనుకున్న 10 బెస్ట్ కార్టూన్లతో పాటు మరో మూడు ప్రత్యేక బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కమిటీ నిర్ణయించడంతో అనుమతితో 3 మంచి కార్టూన్లకు ఒక్కొక్క కార్టూన్ కు రూ.750/- చొప్పున ముగ్గురు కార్టూనిస్టులకు బహుమతులు ప్రకటిస్తున్నాం.

రూ.2,500/-ల చొప్పున 10 కార్టూన్లు

  1. తాడి బలరామకృష్ణ (బలరాం), హైదరాబాద్
  2. వల్లూరి కృష్ణ కిషోర్ (కృష్ణ), హైదరాబాద్
  3. వి.గోపాలకృష్ణ, పెనుగొండ
  4. యస్.వి. రమణ (అరుణ్), హైదరాబాద్
  5. బొమ్మన్, కంకిపాడు, కృష్ణాజిల్లా
  6. నాగిశెట్టి, విజయవాడ
  7. ప్రసాద్ కాజా, హైదరాబాద్
  8. పద్మనాభుని పద్మావతి (పద్మ), విజయవాడ
  9. కాజులూరి ఆదినారాయణరావు, విజయవాడ
  10. సిహెచ్. సిహెచ్. వినోద్ కుమార్ (వినోద్), సఖినేటిపల్లి

    ఒక్కొక్క కార్టూన్ కు రూ.750/- చొప్పున ముగ్గురు
  11. సిరంశెట్టి ఆనందరావు, (ఆనంద్), సూర్యాపేట
  12. ప్రేమ రామచంద్రరావు (ప్రేమ్), విశాఖపట్నం
  13. శ్రీనాథ్ గుర్రం, నెల్లూరు

కార్టూన్ల పోటీ ప్రకటనలో తెలిపిన విధంగా బహుమతి పొందిన కార్టూనిస్టులు పంపిన ఇతర కార్టూన్లను, బహుమతి పొందని కార్టూనిస్టులు పంపిన ప్రచురణార్హమైన కార్టూన్లను వీలైతే ప్రత్యేక సంచికలో-లేకపోతే నవమల్లెతీగ మాసపత్రికలో తప్పనిసరిగా ముద్రిస్తాం. ఈ విషయంలో మీ అంగీకారాన్ని ముందే తెలియజేశారు. అయినా సాధారణ ప్రచురణకు ఇష్టపడని పక్షంలో 9246415150 నెంబరుకు మెసేజ్ పంపండి!
బహుమతి పొందిన కార్టూనిస్టులందరికీ శుభాకాంక్షలు.. అభినందనలు.

విజేతలైన కార్టూనిస్టులకు ప్రత్యేక విన్నపం.
మీ కార్టూన్ కు బహుమతి వచ్చినట్టుగా ప్రచారం చేసుకోవడం చాలా ముఖ్యమే. కానీ ఈ కార్టూన్లను అప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. వీటిని ప్రత్యేక సంచికలో ముద్రిస్తున్నాం. ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది మల్లెతీగ నిర్వహణే అయినప్పటికీ ఆ పైన మరో ‘అజమాయిషీ’ వుందన్న విషయం గుర్తుంచుకుంటారని నమ్ముతూ…

మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ-జాతీయ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ.

Share via
Copy link
Powered by Social Snap