విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023
Awardee hari speech

మార్చి 25, 2023 శనివారంనాడు సాయంత్రం 5గంటలకు ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్టూన్ వాచ్ (ఏకైక జాతీయ కార్టూన్ మాసపత్రిక ) ఛీఫ్ ఎడిటర్ త్రయంబక్ శర్మగారి ఆధ్వర్యంలో జరిన కార్టూన్ ఫెస్టివల్-2023 విశాఖపట్నంలోని మేఘాలయా హొటల్ లో జయప్రదంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి గారు, ఛత్తీస్ ఘడ్ టూరిజం బోర్డు యం. డి. అనిల్ కుమార్ సాహుగారు మరియు ఆంధ్రాయూనివర్శిటీ డిపార్టుమెంట్ ఆఫ్ జర్నలిజం ఛైర్మన్ డి.వి.ఆర్. మూర్తిగారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కార్టూనిస్టులు బాలి గారిని, హరి వెంకట్ గారిని మరియు విజయవాడకు చెందిన టీ.వీ. గారిని జీవితసాఫల్య (Life time achievement) పురస్కారములతో సత్కరించారు. తదుపరి విశాఖపట్నం స్పెషల్ సంచికగా కార్టూన్ వాచ్ మార్చి 2023 సంచికను ఆవిష్కరించారు. ముఖ్య అతిథి నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ కార్టూనిస్టులు సమకాలీన సమాజాన్ని ప్రతిఫలింప జేస్తారని అన్నారు. కార్టూన్ వాచ్ సంపాదకుడు త్రయంబక్ శర్మ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ కార్టూన్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని అన్నారు.

తదుపరి నార్త్ కోస్టలాంధ్ర కార్టూనిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో త్రయంబక్ శర్మగారిని మెమెంటోని అందజేసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. బాలిగారు తన పెయింటింగును శర్మగారికి బహుమతిగా ఇచ్చారు. ఆరిశెట్టిసుధాకర్ దంపతులు శర్మగారిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి 21 మంది కార్టూనిస్టులు హాజరయిన వారిలో ఉన్నారు. వారు బాలి, టీవీ, హరివెంకట్, బాచి, నాగిశెట్టి, గౌతమ్, లాల్, రామశర్మ, టి.ఆర్. బాబు, జగన్నాధ్, బి.యస్. రాజు, దంతులూరి వర్మ, ఆరిశెట్టి సుధాకర్, యం. యం. మురళి, ప్రేమ్, శంబంగి, కొడాలి సీతారామారావ్, వందనశ్రీనివాస్, నల్లపాటి సురేంద్ర, కశ్యప్ మరియు ఓంకార్లు హాజరయారు. విజయవాడ నుండి కూడా కొద్ది మంది కార్టూనిస్టులు కార్యక్రమానికి హాజరయ్యారు.

లాల్
(సదాశివుని లక్ష్మణరావు)

1 thought on “విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023

  1. CartoonWatch వారి lifetime achievement అవార్డులు ప్రఖ్యాత కార్టూనిస్టులు,మరియూ ఆర్టిస్టులు శ్రీ బాలి, శ్రీ టీవీ, శ్రీ హరి గార్లలకు రావడం.మిక్కిలిసంతోషకరం. వారి కళాసేవ అందరికీ స్ఫూర్తి దాయకం. వారికి నా అభినందనలు. Bomman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap