పల్లకిలో నా మొదటి కార్టూన్-అంతోటి ప్రభాకర్

కొత్తగూడెం కాలనీలో నవంబర్ 12, 1970 సం.లో పుట్టిన నేను చిన్నతనం నుండే చిత్రకళపై మక్కువతో చిన్న చిన్న చిత్రాలను స్కూల్లో చిత్రించి పలువురు ఉపాధ్యాయుల, విధ్యార్థుల మన్ననలు పొందుతుంటే గాల్లో తేలినట్లుండేది.
చదువుతోపాటు చిత్రకళ నాలో భాగమైంది. ఓవైపు కమర్శియల్ గా సైన్‌బోర్డ్స్, బ్యానర్స్, పోర్ట్రైట్ వేస్తూ ఎక్కడా శిక్షణ తీసుకోకుండా డ్రాయింగ్ లోయర్, హయ్యర్ హైదరాబాద్ లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది.

టి.టి.సి. హైదరాబాద్ లో మా సెక్షన్ గురువుగారు శేషయ్యగారు ఇక్కడే వుండిపో నీలో మంచి నైపుణ్యముంది ఇక్కడ డ్రాయింగ్ టీచర్ జాబ్ వుంది చేస్తావా అంటే లేదని సున్నితంగా చెప్పి కొత్తగూడెం వచ్చాను. అప్పుడు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, పల్లకి, స్వాతి, స్రవంతి మొదలగు వారపత్రికల్లో కార్టున్లు విరివిగా వచ్చేవి. అవి చూసి నేను కూడ పలు పత్రికలకు వచ్చిరాని కార్టూన్లు పంపేవాడిని చాలాసార్లు తిరుగుటపాలో అందుకునేవాడిని కొద్ది రోజులకు పల్లకిలో ఓ కార్టూన్ అచ్చులో చూసుకొని ఆకాశానికి భూమికి మధ్య నడిచాను.

విధ్యాపరంగా MA (HRM), డ్రాయింగ్ టి.టి.సి., టైపు హయ్యర్ పూర్తి చేసి ఆ తర్వాత సింగరేణిలో ఉద్యోగంలో చేరినా నా మనసంతా బొమ్మలే… సంస్థలోని తోటి ఉద్యోగులు ప్రోత్సహించి “రక్షణ సూత్రాలు” సామాజిక అంశాలపై గోడలపై, బోర్డులపై విరివిగా కార్టూన్లు గీసి భూగర్భంలోపల వెలుపల ప్రదర్శితమయ్యేవి. రక్షణ సూత్రాలపై పోస్టర్లు కార్టూన్లు, బ్రోచర్లపై ప్రింట్ చేసేవారు. మధ్యపానం, ఎయిడ్స్, ధూమపానం, ఇలా పలు అంశాల్లో స్వంతంగా 2000 కార్టూన్లు పలుపత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో కలిపి 1000 కార్టూన్లు వేసి వుంటాను.
ఒకప్పుడు పత్రికల్లో పెద్ద పెద్ద కార్టూనిస్టులను చూసి అబ్బో వారి పరిచయం దొరికితే బావుండు అనుకునే వాళ్ళం సోషల్ మీడియా పుణ్యమా అని వారందరి పరిచయ భాగ్యం దొరికింది. వారి సలహాలు, సూచనలు, ప్రోత్సాహాలు మరువలేనివి. మోహన్ గారి ప్రోత్సాహం అపూర్వం.

Antoti

2006లో అనుకుంటూ ‘ఈనాడు’ సంస్థ అన్ని జిల్లాలకు విడివిడిగా కార్టూన్ పోటీ పెట్టినపుడు అప్పుడు ఖమ్మంజిల్లా నుండి నేను ప్రథమస్థానంలో రావడం, సోమాజిగూడ ఈనాడు ఆఫీలో గ్రేట్ శ్రీధర్ (కార్టూనిస్ట్) గారితో ఇంటర్వ్యూ వారి ప్రశంస, నాలో కార్టూన్ల పట్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. నా ఉద్యోగరీత్యా జిల్లా ఎడిషను చేయమన్నప్పుడు కుదరకపోవడం, తిరిగి మండల ఎలక్షన్స్ కి
నెలరోజులు ఖమ్మంజిల్లాకు కార్టూన్స్ వేసే అవకాశాన్ని శ్రీధర్ గారు కల్పించడం మరువలేనిది. మధ్యపానం, ధూమపానంపై గురువుగారు జయదేవ్ గారు పెట్టిన పోటీలో నా చిత్రానికి ప్రధమ బహుమతినిచ్చి 2000/- రూ. విలువైన కార్టూన్ పెన్స్ పంపడం మధురానుభూతినిచ్చింది. ఆంధ్రభూమి సుభానిగారు, సాక్షి శంకర్ గారు, మొదటినుండి ప్రతిభను ప్రోత్సహించే కళాసాగర్ గారు, మధ్యలో చిత్రకళను కొద్దికాలం ఆపినపుడు పునఃప్రారంభించాలని ప్రోత్సహించిన ప్రియమిత్రుడు శ్రేయోభిలాషి బీర నివాస్ గారు దేశ విదేశాల్లో కార్టూన్స్ కారికేచర్ విభాగాల్లో ప్రశంసలు, ప్రోత్సాహాలు అధ్భుతం. ఇండియా టూన్స్ కిరణ్ గారు, కార్టూన్ వాచ్ త్రయంబక్ శర్మగారు, పాల్వంచ సుభాని, అర్జున్ అశ్వక్, జకీర్ గార్లు.

సమస్యలపై, సామాజిక అంశాలపై కార్టూన్లు గీయడం నాకిష్టం. కొత్తగూడెం కాలరీస్ నుండి ప్రపంచదేశాల కార్టూన్ క్యారికేచర్ పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ గుర్తింపుకు నోచుకోవడం నా అదృష్టం.

Anthoti Prabhakar

బహుమతులు :
1999.2000 సం.లో ఉత్తమ చిత్రకారుడిగా ఉగాది పురస్కారం.
2006 : ఈనాడు కార్టూన్ పోటీలో ప్రథమ బహుమతి
2020 : కరోనా కార్టూన్ పోటీల్లో ప్రత్యేక బహుమతి
2019 : పర్యావరణంపై జిల్లాస్థాయి, ద్వితీయ బహుమతి
2020 : అంతర్జాతీయ పత్రిక కార్టూన్ వాచ్ (బుక్ రీడింగ్) ప్రత్యేక బహుమతి జన్మదిన
2020 : తెలంగాణా ముఖ్యమంత్రి, KCR గార్గి జన్మదిన క్యారికేచర్ విభాగంలో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి
2020 : డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డ్ ఢిల్లీలో.
-అంతోటి ప్రభాకర్

Caricatures by Anthoti Prabhakar
Mamidi Harikrishna and RK Laxman
SA:

View Comments (2)

  • మంచి ఆర్టికల్..మిత్రులు అంతోటి ప్రభాకర్ గారికి
    అభినందనలు. మీరు మరింత అభివృద్ధి వైపుకి పయనించాలని కోరుకుంటూ.....

    నీ నేస్తం....శ్రీనివాస్ బీర, ఆర్టిస్ట్.

  • మీ కార్టూన్లు బాగుంటాయి.స్వయం శిక్షణతో మంచి స్థాయికి ఎదిగారు.అభినందనలు.