
‘బొమ్మన్ ‘ కలం పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు గారోజు బ్రహ్మం. గారోజు నారాయాణాచార్యులు, సరస్వతమ్మ దంపతులకు 7వ సంతానంగా 1958లో పచ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను లో పుట్టాను.
10వ తరగతి వరకు గుండుగొలనులో చదువుకొని, ఇంటర్, బి.ఏ., బి.ఈడి., ఎం.ఏ. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో పూర్తి చేసాను. 1977-80 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగాను 1980 నుండి జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేసి జిల్లా ప్రోబేషన్ అధికారిగా 2018 లో పదవీవిరమణ చేసాను.
చిన్నప్పటి నుండి మా నాన్న గారితో గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటై సాహిత్యంతో పరిచయం పెరిగింది. చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం నాకు సహజంగానే అబ్బింది. అలా చందమామ, యువ పత్రికలలో చిత్ర, శంకర్, బాపు, వ.పా.చిత్రాలు, మరియు బాపు, జయదేవ్, సత్యమూర్తి, మేరియో మిరాండా కార్టూన్లు చూసి ప్రేరణ పొంది, నేనూ కార్టూన్లు గీయాలన్న కోరిక కలిగింది.
నా మొదటి కార్టూన్ అనామిక మాసపత్రికలో ఆగస్ట్ 1977 లో ప్రచురించారు. తరువాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ,ఆంధ్ర సచిత్ర వారపత్రిక, జనసుధ, స్వాతి, పల్లకి లాంటి అనేక పత్రికలు నా కార్టూన్లు ప్రచురించి ప్రోత్సహించాయి.
నా కార్టూన్లను ఆదరించి విశేషంగా ప్రోత్సహించిన సంపాదకులలో పురాణం సుబ్రమణ్య శర్మ గారు (ఆంధ్రజ్యోతి) , స్వాతి బలరాం గారు, శంకు గారు(హాస్యప్రియ), మాధవరావు గారు(ఆంధ్ర సచిత్ర వార పత్రిక) ముఖ్యులు.
1996-2000 సంవత్సరంల మధ్య ప.గో. జిల్లా వయోజన విద్యాశాఖ వారిచే నడుపబడుతున్న ‘ఆక్షర దీక్ష’ పత్రికకు చిత్రకారుడిగా, కార్టూనిస్ట్గా సేవలందించాను. సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యతా ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం వంటి సంస్యలపై కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించి పలువురి ప్రశంసలు పొందాను. 1986లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో 14 వారాలు, 1988లో స్వాతి వీక్లీలో 36 వారాల పాటు స్ట్రిప్ కార్టూన్లు గీసాను.
బహుమతులు:
1985-స్వాతి వీక్లీ కార్టూన్ పోటీ లో తృతీయ బహుమతి
1986 – ఆంధ్రప్రభ వీక్లీ కార్టూన్ పోటీ లో ప్రథమ బహుమతి
1986- ఆంధ్రజ్యోతి వీక్లీ కార్టూన్ పోటీ లో ప్రథమ బహుమతి
ఇంకనూ అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన పోటీలలో ఎన్నో బహుమతులు అందుకున్నాను.
రిటైరయ్యాక 2018 నుండి కార్టూన్లు గీయడం మళ్ళీ ప్రారంభించి, చిరకాల మిత్రులు రవీంద్ర గారితో కలసి కొన్ని కార్టూన్లు గోతెలుగు, నవ్య వారపత్రికలో గీస్తున్నాను.
నాకు ఇద్దరబ్బాయిలు, లక్ష్మినారాయణ, శ్రీధర్ కుమార్. ఇద్దరూ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. నా భార్య సూర్య కుమారి నేను ప్రస్తుతం ఏలూరులో నివాసం.
64కళలు.కాం ద్వారా ఎంతో మంది కార్టూనిస్టులను పాటకులకు పరిచయం చేస్తున్న చిరకాల మిత్రులు కళాసాగర్ గారి కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను.
-బొమ్మన్
నా అభిమాన కార్టూనిస్ట్ లలో
బొమ్మన్ గారు కూడా ఒకరు.
వారి గురించి పరిచయం చేసిన
కళాసాగర్ గారికి థాంక్స్..
మిత్రులు శ్రీ రావెళ్ళ శ్రీనివాసరావు గార్కి… నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు –బొమ్మన్ 🙏
ప్రియమిత్రులు శ్రీ రావెళ్ల శ్రీనివాసరావు గార్కి.. మీ అభిమానం పొందినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ.. బొమ్మన్
చాలా బాగుంది సర్ ఆర్టికల్
మిత్రులు శ్రీ కిరణ్ గార్కి… కృతజ్ఞతలు –బొమ్మన్ కార్టూనిస్ట్.
I am very Happy to see veteran cartoonist Sri Bomman’s introduction to the public. I wish to see lots of Sri Bomman’s cartoons at present. Thank you Kalasagar garu.
ప్రియమిత్రులు శ్రీ NV రమణమూర్తి గార్కి.. మీ అభిమానానికి కృతజ్ఞతలు.. మీ బొమ్మన్
Congrats Bomman garu
ప్రియమిత్రులు శ్రీ గోపాలకృష్ణ గార్కి.. నాపై మీకు గల ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతలు. మీ.. బొమ్మన్
బొమ్మన్ గారి కార్టూన్లు చాలా పత్రికలలో చూసేవాళ్లo.. బొమ్మన్ గారి బొమ్మలు చాల బాగుంటాయి…! బొమ్మన్ గారి పరిచయం, వారు – వారి వ్యక్తిగత జీవితం గురించి తెలియపరిచారు… వారిగురించి తెలుసుకోవడం ఆనందంగా వుందండి.. కళాసాగర్ గారు…
ప్రియ మిత్రులు శ్రీ దేవులపల్లి, కార్టూనిస్ట్ గార్కి… నాపై మీకున్న ప్రేమాభిమానాలకు నా హృదయ పూర్వక ధన్యవాదములు… మీ –బొమ్మన్ .
ప్రియ మిత్రులు శ్రీ NV రమణమూర్తి.. నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు –బొమ్మన్ 🙏
Please share the cartoonist no.
చిరకాలమిత్రులు శ్రీ భగవాన్ గార్కి కృతజ్ఞతలు -మీ బొమ్మన్
Bomman cartoons baguntayi. I have so much enjoyed during 1980s.
మిత్రులు శ్రీ M శేఖర్ గార్కి మీ అభిమానానికి కృతజ్ఞతలు –మీ బొమ్మన్
చిన్ననాటి స్నేహితులు కలిసి చదువుకున్న మిత్రుడు శ్రీ గారోజు బ్రహ్మం గారు మంచి పట్టుదల, కృషి,నిరంతరం శ్రమ, అకుంఠిత దీక్ష కలిగి జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని బొమ్మన్ గా కార్టునిష్టు ఎన్నో,ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించిన నా మిత్రులకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
గోపరాజు వేంకట్రామయ్య
రిటైర్డు టీచరు
శాంతి నగర్
ఏలూరు.
చిన్ననాటి స్నేహితుడు శ్రీ GV రామయ్య గార్కి కృతజ్ఞతలు –మీ బొమ్మన్
బొమ్మన్ గారు..నమస్కారం. మీరు ఏలూరు లో వుంటారని తెలుసు కానీ మీ ఫోన్ నంబర్ కోసం చాలా సార్లు ప్రయత్నించి విఫలం అయినాను నే ను మీ ఏలూరు లొనే లా చదివాను 1983-1987 లో. Anyhow nice to see your details now
I like your Cartoons
Pls give your phone number. Mine 9848992433. Anyway Congratulations..!
ప్రియమైన బొమ్మన్ గారూ..
మీ గురించిన విశేషాలు చాలా ఆనందాన్ని కలిగించాయి.6-12/2/1987 (33 ఏళ్ళక్రితం) ఆంధ్ర సచిత్ర వారపత్రిక ప్రచురించిన నా ఉగాది కధలపోటీలో గెలుపొందిన కధ ‘ట్రంకు పెట్టె’కు మీరు బొమ్మ వేసారు.చాల సంతోషం.
నేను విజయవాడ వాసిని. ఫోన్ 85007 64529.మీరు మీ ఫోన్ నెంబరు ఇచ్చినా సంతోషమే.లేదా ఫోను చేసినా డిటో.
మాట్లాడుకుందాం.
శుభాకాంక్షలతో..
ఓలేటి వెంకట సుబ్బారావు.
ఈ పోస్ట్ చూసి బొమ్మన్ గారు స్పందించి ఒక శుభముహూర్తాన తాను నాకు ఫోను చేసి చాలసేపు ఆత్మీయంగా మాట్లాడడం..నిజమైన అందమైనకల.
మిరు. గీసిన. బొమ్మ లు. కాదు. అథబుదం.. మి. కలం.. లొనీ. వచ్చే. ప్రతీదీ. అథబుదం… మి. మనసులో. వుండే. అలొచనలె. అలా. అథబుదం గా. వున్నాయి. మీరు. ఇంకా. ఎన్నో. ఇలాంటి. అథబుదం. కావాలి… మీకు. భగవంతుడు. పూర్తి ఆరోగ్యం. ఇవ్వాలని. కొరుకొంటాను.
Excellent
మిత్రులు బొమ్మలు గారికి నమస్కారములు. మీ కార్టూన్లను నేను చాలా చూశాను. నీదైన శైలిలో మీ కార్టూన్లు ఉండటం చాలా గొప్ప విశేషం ఇప్పటికీ కూడా మీ కార్టూన్ లను గో తెలుగు డాట్ కాం లో చూస్తున్నాను 2022వ సంవత్సరం మహిళా కార్టూనిస్ట్ పద్మ గారు నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి మీరు కూడా హాజరయ్యారు నేను కూడా వచ్చాను ఆ సందర్భంగా మిమ్మల్ని కలిశాను కానీ మీతో చాలా మాట్లాడాలని అనుకున్నాను.కుదరలేదు.ఫోన్ ద్వారా కానీ, వీలైతే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీ కార్టూన్లు అన్ని ఎంతో బాగుంటాయి. మీ వద్ద నుంచి కార్టూన్లకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
మీరు ఇలాగే మీ కార్టూన్లను వేస్తూ మమ్మల్ని ఆనందింప చేయండి.
అభినందనలతో…
RAMU