మొదటి కార్టూన్ ‘ఈనాడు’లో – శ్రీనివాస్

కళ్యాణం శ్రీనివాస్ అనే నేను కార్టూనిస్టుగా, క్యారికేచర్ ఆర్టిస్టుగా, చిత్రకారుడిగా, యానిమేషన్ డైరెక్టర్ గా మరియు కవిగా కొనసాగుతూ వస్తున్నాను. పుట్టింది జూన్ 2 న 1971, తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల్ ఆర్నకొండ గ్రామమంలో.

1993లో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా చేరాను. ఒక వైపు జర్నలిస్టుగా కొనసాగుతూనే కరీంనగర్ యూనిట్ అంటే, అప్పటి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ప్రచురితం అయ్యే ఈనాడు దినపత్రికలో పొలిటికల్ కార్టూనులు వేయడం జరిగింది. అంతే కాకుండా అక్కడి స్థానిక జీవగడ్డ అనే పత్రికలో కూడా కార్టూనులు వేసాను. కార్టూను బొమ్మకు కథ రాయండి అనే శీర్షికను కొనసాగించాను. అంతే కాకుండా మహిళలపై వేసిన నా పెయింటింగ్స్ తో ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తో పాటు ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సమయంలో ప్రస్తుతం ఈనాడు డైరెక్టర్, అప్పటి మా యూనిట్ మేనేజర్ అయిన డీ.ఎన్. ప్రసాద్ గారి సలహా మేరకు నేను హార్ట్ యానిమేషన్ లో కోర్సు చేయడానికి వెళ్ళాను. కానీ సంవత్సరానికి లక్ష రూపాయల ఫీజు చెల్లించుకునే స్థాయి లేదని వివరిస్తే, అప్పటి నా కార్టూనులు చూసి మీలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం అంటూ లక్ష రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. దాంతో ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారు ప్రిన్సిపాల్ గా ఉన్న హార్ట్ యానిమేషన్ ఇనిస్టిట్యూట్ లో ఈ కోర్సు చేస్తూనే హైదరాబాద్ లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్టుగా కొనసాగుతూ వస్తూ ఆర్ధిక ఇబ్బందులనుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేసాను.

ఆ తరువాత యానిమేషన్ ప్రరిశ్రమలో నాకు యానిమేషన్ డైరెక్టర్ గా అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం మరవలేనిది. కెనెడా లోని ప్రముఖ కంపెనీ అయిన అంబరువుడ్ ప్రతిష్టాత్మకమైన అవార్డునిచ్చి గౌరవించిన తీరు మరువలేనిది.అంతే కాకుండా ప్రతి నెల నాకు ప్రత్యేక అవార్డు కింద అదనపు మొత్తాన్ని యాజమాన్యం ఇస్తూ నా శ్రమను, నా నైపుణ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేసేది. ఈ సందర్భం లో నాతో పాటు పనిచేసిన సీనియర్ కార్టూనిస్టు, సీనియర్ యానిమేటర్ రామశేషు గారు నన్నెప్పుడూ అభినందిస్తూ ఉండేవారు.

Voter awareness Cartoon by Kalyanam Srinivas

ఇప్పటి వరకు 500 లకు పైగా కార్టూనులు, వందకు పైగా సాహిత్య పుస్తకాలను ముఖ చిత్రాలు, పది పుస్తకాలకు పైగా కవితలకు బొమ్మలు వేయడం జరిగింది. ఇప్పటికే నేను రాసిన రెండు పుస్తకాలు ఒకటి ‘హృదయం‘ అనే గేయ సంపుటి, (ఇందులోని కొన్న్ని గేయాలు రేడియోలో ప్రసారం కూడా అయినవి) మరోటి ‘పిడికిలి’ అనే మరో కవితా సంకలనం 1996-97 ప్రాంతంలోనే ప్రచురించాను. ప్రస్తుతము తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ కు రాష్ట్ర ఆర్గనైసింగ్ కార్యదర్శిగా, తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాను. ప్రస్తుతం భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహా రావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యారికేచర్ కాంపిటీషన్ కు సంబందించిన పుస్తకాన్ని రూపొందించడం లో నిమగ్నం అవడం సంతోషాన్నిస్తుంది.

కళ్యాణం శ్రీనివాస్

Youtube channel effect
Corona warriors

Political cartoon
Corona effect on human life
Corona
Kalyanam Srinivas
Reading and writing
SA:

View Comments (24)

  • కల్యాణం శ్రీనివాస్ గారి పరిచయం బాగుంది. వారి గురించి ఇంతకు ముందు తెలియని చాలా విషయాలు తెలిశాయి.

  • కార్టున్లన్నీ బాగున్నాయి. కాని కాలాతీత కార్టూన్లు అయితే బాగుండేవి. ఇందులో చాలా వరకు ఒకానొక సందర్భానికి సంబంధించినవి. ఉదా. విమానం మీద కూచుని కరోనా వైరస్, వ్యక్తిని తరుముతున్న కార్టూన్, మొదటి వేవ్ సమయం లో వ్యాధి విమాన ప్రయాణాల వల్ల విశ్వ వ్యాప్తమవుతున్నదని తెలుసుకున్న రోజులది. ఆ రోజుల్లో ఇది చక్కని కార్టూన్ గా పేలివుండొచ్చు. కాని ఈరోజే దాన్ని చూస్తే అంత ప్రభావవంతంగా ఉండదు.
    ఏమైనా, చొప్పదండి వ్యక్తి అంతర్జాతీయ స్తాయికెదగడం తెలంగాణ వ్యక్తిగా చాలా గర్వించాను

  • కళ్యాణం శ్రీనివాస్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ మధ్యే ఆయనతో పరిచయం కూడా జరగడం చాలా సంతోషం కలిగస్తోంది.
    All the best Sir, I wish you more achievements come on your way.

  • మీ పరిచయం...సూపర్ కళ్యాణం సార్.👌👏👏🌱🌺

  • అత్యంత ప్రతిభ కలిగిన కల్యాణం గారి అనుభవాలు అందరికి ఉపయోగ పడాలి.

  • Kalyanam srinagar sir tho kalisi DQ animation company lo panicheyyatam na adrushtam ga bavisthunnanu.
    Bharath.

  • I am glad to read the inner story of Sri Kalyanam Srinivas. The introduction of the Cartoonist Srinivas is so short but depicts his successful in the cartoon and animation platform.
    Sekhar babu, Cartoonist / Journalist (Sakshi) Odisha.

  • కల్యాణం శ్రీనివాసగారి పరిచయ భాగ్యం ఈ మధ్యే కలిగింది.మంచి మనిషి.అనేక కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.వారి కార్టూన్లు చాలా బాగుంటాయి. వారి వృత్తి ప్రయాణం చాలా బాగుంది. విజయోస్తు.