కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల
Late. Kandikatla Sambaiah

సోలాపూర్ నుండి గత 40 సంవత్సరాలుగా కార్టూన్స్ గీస్తూ…ఇంటిపేరుతో పాపులరయి … తెలుగు నేలపై ఎందరో అభిమానులను సంపాదిచుకున్న కందికట్ల సాంబయ్య గారు తన 65 వ యేట 17-05-2021 న, సోమవారం సోలాపూర్ లో కన్నుమూసారు. 64కళలు.కాం వారికి నివాళులర్పిస్తూ… వారి జీవన ప్రస్థానం తెలుసుకుందాం…

కందికట్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కందికట్ల సాంబయ్య. నేను పుట్టింది ఆగస్టు 6న 1956లో నాగారం, వరంగల్ జిల్లా. నాగారంలో ఎస్.ఎస్.సి. వరకు చదువుకున్నాను.

1973లో బతకాడానికి సోలాపూర్ (మహారాష్ట్ర)కు వలస వచ్చాను. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. మొదట  కొన్ని రోజులపాటు చీరల షాప్ లో సేల్స్ మెన్ గా,  తర్వాత కంపౌండ్ర్గా, అటుపిమ్మట ఓ చిన్న ఫ్యాక్టరీలో గుమస్తాగా అతి తక్కువ జీతానికి పనిచేశాను. ఆ తర్వాత ఓ నూలుమిల్లు లో 25 యేళ్ళపాటు పనిచేశాను. గత 40 సంవత్సరాల నుండి కార్టూన్స్ గీస్తున్నా, 15 యేళ్ళనుండి ఫుల్ టైం కార్టూన్స్ గీస్తున్నాను. 2వ తరగతి నుండి బొమ్మలంటే ఇష్టంతో రాముడు, కృష్ణుడు లాంటివి బొమ్మలు గీస్తుండేవాడిని. 5వ తరగతి కొచ్చేటప్పటికి సినీమా నటుల బొమ్మలు గీసేవాడిని. అలా 1976లో ఆంధ్రజ్యోతి పత్రికలో కార్టూనిస్ట్స్ పరిచయాలు చూసి నేనూ కార్టూన్స్ గీయాలన్న కోరిక కలిగింది. నా మొదటి కార్టూన్ ప్రగతి వార పత్రికలో (1976) ప్రచురించబడింది. నా కార్టూన్లు తెలుగు, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ పత్రికల్లో సుమారు 20 వేలకు పైగా ప్రచురించబడ్డాయి. నా కార్టూన్ కు తొలి పారితోషకం అప్పట్లో ‘7’ రూపాయలు, ఇప్పట్లో స్వాతి మంత్లీ కి 400 రూపాయలు అందుకున్నాను. అప్పట్లో నాకు నెలకు నాలుగయిదు వేల రూపాయలు కార్టూన్స్ గీయడం ద్వారా ఆదాయం వచ్చేది. ఆంధ్రజ్యోతి వీక్లీ, తానా (అమెరికా) వారి కార్టూన్ (1995) పోటీలో నా కార్టూన్ కి రెండవ బహుమతి వచ్చింది. ఒకసారి వెంకట్ కార్టూన్ పోటీల్లో ప్రోత్సాహక బహుమతి లభించింది.

నా అభిమాన కార్టూనిస్టులు బాపు, ఆర్కే.లక్ష్మణ్, బాల్థాకరే, జయదేవ్ గార్లు. అప్పట్లో రెండేళ్లు కార్టూన్స్ వేయగా వచ్చిన డబ్బులతో నా పెళ్లి చేసుకున్నాను. మా అబ్బాయిలు చదువుకు కూడా నా కార్టూన్ పారితోషికాలు చాలా ఉపయోగపడ్డాయి. మా శ్రీమతి సువర్ణ 50 ఏళ్ళ నుండి బీడీలు చుడుతూనే ఉంది. మాకు ముగ్గురు అబ్బాయిలు. మొదటివాడు కిరణ్ బీ.కాం. పూర్తి చేసి అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. రెండోవాడు రవి బీ.టెక్. చదివి రిలయన్స్ రిటైల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. మూడోవాడు బి.ఈ. (మెకానికల్) చదివి వండర్ ల్యాండ్ (పూనే) కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ముగ్గురుకూ పెళ్లిళ్లు అయ్యాయి.

కార్టూనిస్టుల సమావేశాలకు, ప్రదర్శనలకు వెళ్ళాలని, మిత్రులను కలుసుకోవాలని వున్నా తెలుగు ప్రాంతాలకు దూరంగా వుండడం వల్ల వెళ్ళలేక పోయానన్న బాధ మనసులో ఇప్పటికీ వుంది. నన్ను ప్రోత్సహిస్తున్న కార్టూనిస్ట్ మిత్రులు శ్రీ వడ్డేపల్లి వెంకటేష్, శ్రీనివాస్. ఫేస్బుక్ మిత్రుడు శ్రీ ఏ.ఆర్. సుధాకర్ గారికి నా వందనాలు.  నాకు పలుమార్లు గుర్తు చేసి, నాచే ఈ నాలుగుమాటలు రాయించి మీ ముందుకు తీసుకొచ్చిన కళాసాగర్ గారికి ధన్యవాదాలు.

-కందికట్ల

Kandikatla working

14 thoughts on “కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల

  1. కందికట్ల గారి పరిచయం బాగుంది. కార్టూన్ల పారితోషికంతో పెళ్ళి చేసుకున్నానని వారు తెలపడం ఆశ్చర్యం కలిగించింది.

    1. మీ కార్టూన్లని, మిమ్మల్నీ అభిమానించేవాళ్ళో నేనూ ఒకడ్ని కందికట్లగారూ. చిన్న కాప్షన్లతో పొందికగా, నిర్విరామంగా మాకోసం కార్టూన్లు విరివిగా అందిస్తారు..చాపకింద నీరులాగా మీకార్టూన్లు నిరంతరం, నిర్విరామంగా ప్రవహిస్తూనే ఉంటాయి. మీగొప్ప మనసులో నాకు చోటుదక్కినందుకు అనేకానేక ధన్యవాదాలు మీకు.

  2. చాలా సంతోషంగా ఉంది.కందికట్ల గారు చాలా సీనియర్
    ఆయనకి ఇంకా గుర్తింపు కావాల్సినంత రాలేదు.వేలాది కార్టూన్లు వివిధ.భాషల్లో గీశారు.64 కళలు కి ధన్యవాదాలు

  3. కందికట్ల గారు మీతో ఫోన్ లో మాట్లాడటమే కానీ , ఫేస్ బుక్ లో మొదటి సారి మీ గురించి చాలా విషయాలు 64 కళలు ద్వారా తెలిశాయి
    నిజంగానే మీరు చాలా సింపుల్ (అన్నీ ఉన్న విస్తరి లాగా ) . congrats ..

  4. కందికట్ల గారు మీతో ఫోన్ లో మాట్లాడటమే కానీ , ఫేస్ బుక్ లో మొదటి సారి మీ గురించి చాలా విషయాలు 64 కళలు ద్వారా తెలిశాయి
    నిజంగానే మీరు చాలా సింపుల్ (అన్నీ ఉన్న విస్తరి లాగా ) . congrats ..

  5. మిత్రులు కందికట్ల పరిచయం ఆనందం కలిగించింది.

  6. కందికటల వారు చాలా చకకని కారుటూన్లు వేసుతునానరు. చాలా thanks.

  7. స్పూర్తి కలిగించేలా వుంది సార్ మీ జర్నీ…ఇక ముందు మీ ప్రయాణం ఆనందకరంగా సాగాలని మీ కార్టూన్లతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.

  8. నమస్తే సర్ మీ జీవితం చాలామందికి ఆదర్శంగా ఉంది.మీ కార్టూన్స్బాగుంటాయ్.గీత లు ప్రత్యేకంగా ఉంటాయి.మరిన్ని కార్టూన్స్ గీస్తూ మాబోటివారికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ…నమస్తే. మీ శ్రేయోభిలాషి.శేషగిరి.కలం పేరు. శేషు/గిరి.

  9. కందికట్ల గారు వెళ్ళిపోవడం నాకు చాలా విచారం కలుగజేసింది.
    వారి నిర్యాణం, జీవన ప్రస్థానం గురించి ఈ వ్యాసం ద్వారా తెలియజేసిన సాగర్ గారికి
    కృతఙ్ఞతలు.
    – శ్రీధర్ అక్కినేని.

  10. కందికట్ల గారు వెళ్ళిపోవడం నాకు చాలా విచారం కలుగజేసింది.
    వారి నిర్యాణం, జీవన ప్రస్థానం గురించి ఈ వ్యాసం ద్వారా తెలియజేసిన సాగర్ గారికి
    కృతఙ్ఞతలు.
    – శ్రీధర్ అక్కినేని.

  11. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

    మిత్రులు శ్రీ కందికట్ల గారి ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరం. ఒక అలుపెరుగనికార్టూనిస్ట్ ని కోల్పాయాం. వారి ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు తగు ధైర్యం ఇవ్వాలని దేవుడు ని కోరుకుంటున్నాను. –బొమ్మన్, ఆర్టిస్ట్ &కార్టూనిస్ట్, విజయవాడ.

  12. I ENJOYED HIS CARTOONS IN SO MANY MAGAZINES IN THOSE DAYS. ALL ARE SO GOOD AND PARTICULARLY HIS SIGNATURE IS VERY PECULIAR AND ATTRACTIVE. SORRY. WE MISSED YOU.

  13. కందికట్ల గారు నాకు కలం స్నేహితులు. ఉత్తరాలు రాసుకోవడమేకాని ఎప్పుడూ మాట్ళాడుకోలేదు. ఆయన రాసిన ఉత్తరాలలోని అక్షరాలు ముత్యాలవలే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఆయన లేరని ఇప్పుడే తెలిసింది. చాల బాధగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap