నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

నా పేరు చీపురు కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ఏప్రిల్ 30వ తేదీన 1979 వసంవత్సరంలో జన్మించాను. నాన్న గారు పేరు అప్పారావు గారు BSNL శ్రీకాకుళం జిల్లాలో TSO గా పనిచేసి 2003లో పదవీ విరమణ చేసారు. అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మీ. ‘రావు గారు ‘ పేరుతో కార్టూన్లు గీస్తాను.

2007వ సంవత్సరంలో వివాహం జరిగింది, భార్య పేరు జ్యోతి, ఇద్దరు పిల్లలు 2008వ సంవత్సరంలో బాబు లోకేష్, 2009లో పాప భావన.
MBA పూర్తి చేసాను, చిన్నప్పుడు నుండి బొమ్మలు అంటే చాలా ఇష్టం, అసలు బొమ్మలు ఇష్టపడని వారు అసలు ఉంటారా? ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది, అవి ఏదో ఒక సందర్భంలో బయటపడతాయి, చిన్నప్పుడు కార్టూన్లు చూడటం కోసం గ్రంధాలయం వెళ్ళేవాడిని, ఈనాడు ఆదివారం పుస్తకంలో శ్రీధర్ గారి కార్టూన్లు చాలా ఆకర్షించేవి, ప్రతి గురువారం డెక్కన్ క్రానికల్ లో జాబ్ కాలమ్స్ కోసం చూసేటప్పుడు సుభాని గారి కార్టూన్స్ అబ్బురపరిచేవి, చాలా కాలం తరువాత సోషల్ మీడియా ద్వారా చాలా మంది తెలుగు కార్టూనిస్టులుతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పరిచయాలు ఏర్పడ్డాయి, ఫేస్ బుక్ లో సిరిమల్లె పువ్వుల్లే నవ్వు గ్రూపులో చాలా మంది కార్టూనిస్టులు కార్టూన్లు చూసేవాడిని, అలా అంబటి చంటిబాబు గారు పరిచయం అయ్యారు, వీరు నర్సీపట్నంలో ఉపాద్యాయులు, ఒకసారి చంటిబాబు గారితో మాట్లాడినప్పుడు కార్టూన్లు ఎలా వేయాలో, ఎంత సైజ్ తదితర వివరాలు వివరంగా ఒక పేపర్ పై వ్రాసి అవి ఫోటోలు తీసి వాట్సాప్ చేశారు, తరువాత బొమ్మలు వేయడంలో పావీణ్యం రాలేదు కానీ దేశ విదేశీల యందు చాలా మంది కార్టూనిస్టులుతో పరిచయాలు కలిగాయి, అలా అయిన వారిలో కొండ రవిప్రసాద్ మరియు కొల్లి ప్రభాకర్ గార్ల ద్వారా కార్టూన్లకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాను.

kiran cartoons

మొదటిసారిగా నా కార్టూన్ 64కళలు.కామ్ లోనే పబ్లిష్ అయ్యింది, 2017వ సంవత్సరంలో హార్టూనిస్టు గ్రూప్ వారు డాక్టర్ జయదేవ్ బాబు గారు సారథ్యంలో బెంగళూరు IIC గ్యాలరీలో నిర్వహించిన తెలుగు కార్టూనిస్టులు కార్టూన్ల ప్రదర్శనలో చాలా మంది కార్టూనిస్టులను ప్రత్యేకంగా కలుసుకోవడం చాలా ఆనందం కలిగింది, 2017 నవంబర్ లో గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా మచిలీపట్నం గ్రంధాలయంలో నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శనకు చాలా మంది తెలుగు కార్టూనిస్టులు తోపాటు నవ్య సంపాదకులు శ్రీ జగన్నాధ శర్మ గారు హాజరై ప్రదర్శనను విజయవంతం చేశారు. 2018లో ద్వితీయ విఘ్నం లేకుండా మచిలీపట్నంలో నిర్వహిస్తే 2019లో విజయవాడలో తెలుగు కార్టూనిస్టులు సహాయంతో ఘనంగా నిర్వహించాము. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు లో కూడా కార్టూన్ల ప్రదర్శనలో నా కార్టూన్ కూడా అవకాశం దొరికింది. 2018వ సంవత్సరంలో మా తండ్రి చీపురు అప్పారావు గారు పేరుతో మల్లెతీగ పత్రికతో సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం సందర్భంగా సాక్షి చీఫ్ కార్టూనిస్ట్ శంకర్ గారితో పరిచయం చాలా సంతోషం కలిగింది.

2019 డిసెంబర్ 14 వ తేదీన బెంగళూర్ IIC గ్యాలరీలో ప్రారంభమైన కార్టూనిస్ట్ కుట్టి ఎగ్జిబిషన్ కు నేను ప్రారంభించే అవకాశం కలిగించిన IIC మేనేజింగ్ ట్రస్టీ వెంకటేష్ జి నరేంద్ర గారిని జీవితంలో మర్చిపోలేను.
కార్టూన్ల కోసం ఒక ద్విబాషా పత్రిక మొదలు పెట్టాలి అని ప్రయత్నం చేయగా రెండు మార్లు టైటిల్ నిరాకరణ గురికాగా హాస్యపుహరివిల్లు అనే పేరు ఖరారు అయ్యింది, కరోనా సమయంలో IndiaToons అనే వెబ్సైట్ ప్రారంభించాను.

100 మంది విదేశీ కార్టూనిస్టులుతో IndiaToons మరియు 150 తెలుగు కార్టూనిస్టులుతో హాస్యపుహరివిల్లు అనే వాట్సప్ గ్రూపులను నిర్వహిస్తున్నాను. పది ఐదు మార్లు విదేశాలలో నేను పంపిన కార్టూన్లు ఎగ్జిబిషన్ లో స్థానాన్ని పొందాయి. అమెజాన్ అడవులు కొంత భాగం అగ్నికి ఆహుతి అయినప్పుడు నేను వేసిన కార్టూన్ ఫ్రాన్స్ 24 టీవీ ఛానెల్లో చర్చించటం ఒక మంచి జ్ఞాపకం, బాపు గారి సోదరులు శంకర్ గారి పెన్సిల్ పోర్టురైట్స్ పుస్తకంలో నా పెన్సిల్ పోర్ట్రైట్ కూడా ఉండటం చాలా సంతోషం, నార్వే దేశం నుండి నిర్వహించిన స్టాప్ బుల్లియింగ్ కాంటెస్ట్ కు జ్యూరీ గా ఎంపిక అయ్యాను. 2021 లో indiatoons ఇంకా మరెన్నో మైలురాయలను దాటాలీ అని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
64కళలు. కామ్ వారు చేపట్టిన 111 మంది తెలుగు కార్టూనిస్టులు పరిచయాలతో “మన కార్టూనిస్టులు” అనే పుస్తకంలో నాకు కూడా స్థానం కల్పించినందుకు ముందుగా కళాసాగర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
-కిరణ్

Kiran cartoons

3 thoughts on “నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

  1. బాగుంది రావుగారు మీ పరిచయం .బొమ్మలు రావంటూనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. మీ బొమ్మలు బాగుంటాయి అర్ధవంతంగా ఉంటాయి . మరిన్ని విజయాల్ని సాధించాలని ఆశిస్తున్నా.

  2. Nice…Kiran gaaru Congratulations for such a beautuful and intresting article pubished in 64 kalalu.com .i am happy to say that eventhough you may drawn cartoons a few in number that was in very standard and also selecting national and international level contests.my hearty congratulations for selecting a jury member in Norway cartoon contest .Iwish ypu all the best for your magazine Hasyapu Harivillu .once again congratulationsto you and kalasaagar garu for publishing this article abou you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap