బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

కోనసీమ కార్టూనిస్ట్ ఎం.రాము గురించి ఈ నెల ‘మన కార్టూనిస్టులు ‘.

గత మూడు దశాబ్దాలుగా ఎం. రాము కలంపేరుతో కార్టూన్స్ గీస్తున్న నా పూర్తి పేరు మాడా వెంకట రామలింగేశ్వరరావు. జన్మనిచ్చిన తల్లి దండ్రులు మాడా సుబ్రహ్మణ్యేశ్వర సిద్ధాంతి, శ్రీమతి వెంకట సూర్యావతి. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం గ్రామమైన బండారులంక లో. చిన్నతనం నుండే చిత్రలేఖనం పై మక్కువ ఎక్కువ. హై స్కూల్ వరకు బండారులంక లో చదివి, ఎస్.కె.బి.ఆర్. కాలేజీలో బి.ఏ., ఆంధ్రాయూనివర్సిటి నుండి ఎం.ఏ. పట్టా అందుకున్నాను. పాఠశాల స్థాయిలలో డ్రాయింగ్ పోటీలలో అనేక బహుమతులు గెలుపొందాను. అప్పటి బండారులంక హై స్కూల్ డ్రాయింగ్ టీచర్ ప్రముఖ చిత్రకారులు సీతారామస్వామి గారి శిష్యరికంలో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ టి.టి.సి. పూర్తిచేశాను. కాలేజ్ రోజుల్లో కార్టూనిస్త్ శ్రీవల్లి గారి సలహాలు, సూచనలు పాటించి గీయటం ప్రారంభించాను. నా మొదటి కార్టూన్ కాలేజి మేగజైన్లో ప్రచురణ కావడం, 1991 లో ఇంటర్ యూనివర్సిటీ ‘యూత్ ఫెస్టివల్’ కి ఆంధ్రాయూనివర్సిటి స్థాయిలో నిర్వహించిన విద్యార్థి కార్టూన్స్ పోటీలో ప్రథమ బహుమతి సాధించి, అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో ‘చిత్రకళా రంగం’లో ఆంధ్రాయూనివర్సిటీ ప్రతినిధిగా ‘కాలికట్’ యూనివర్సిటీ కి వెళ్లడం మరచిపోలేని జ్ఞాపకాలు.

ఇప్పటి వరకు కు కొన్ని ఆయిల్ పెయింటింగులు, నాలుగు వేల కార్టూన్స్, సుమారు 50 వరకు ప్రముఖుల క్యారికేచర్లు గీసాను. పలు సంస్థలు, పత్రికలు నిర్వహించిన కార్టూన్ పోటీలలో అనేక బహుమతులు అందుకున్నారు. రాసి కన్నా, వాసికి ప్రాధాన్యత నిచ్చి, సామాజిక స్పృహతో సున్నిత హాస్యం, స్పష్టమైన చిత్రాలతో కార్టూన్లు గీయడమే నాకు ఇష్టం. 1987 లో స్వాతి సపరివార పత్రిక, నాగార్జున సిమెంట్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీల్లో ప్రధమ బహుమతి అందుకున్నాను. 2002లో మా కాలేజీ స్వర్ణోత్సవాల భాగంగా మా కోనసీమ కార్టూనిస్టులు శ్రీవల్లి, శ్యాంమోహన్, కళాధర్ బాపు లతో కలిసి కార్టూన్ ప్రదర్శనలో పాల్గొని ఆనాటి ముఖ్య అతిథి అక్కినేని నాగేశ్వరరావు గారి అభినందన అనుకున్నాను. 2007లో అమలాపురం మహిళా కళాశాల లో ప్రముఖ సినీహాస్య నటుడు బ్రహ్మానందం గారు నా కార్టూన్ ప్రదర్శన ప్రారంభించడం కార్టూనిస్టుగా నేను మర్చిపోలేని అనుభూతులు. ఆర్కే లక్ష్మణ్, శ్రీధర్, బాబు, జయదేవ్ అభిమాన కార్టూనిస్టులు. పుస్తక పఠనం మంచి సంగీతం వినడం ఇతర హాబీలు.

అమలాపురం ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా  పనిచేస్తున్నాను. తెలుగు కార్టూనిస్ట్ గా నన్ను ప్రోత్సహించి, ప్రోత్సాహం అందించిన పత్రికా సంపాదకులకు, సాహితీ మిత్రులకు, వెబ్ మీడియా ద్వారా నన్ను పరిచయం చేస్తున్న 64 కళలు.కాం ఎడిటర్ కళాసాగర్ గారికి ధన్యవాదాలు.

-రాము

10 thoughts on “బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

  1. రాము గారి పరిచయం అంతా బాగుంది. వారికి అభినందనలు.

  2. ప్రియమిత్రులు రాము గారి పరిచయ భాగ్యం 64 కళలు.కామ్ ద్వారా కలిగించిన ఆప్తమిత్రులు కళాసాగర్ గారికి , కార్టూనిస్ట్ రాము గారికి అభినందనలు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap