రంగాచారి అనే సంతకంతో కార్టూన్లు వేసే నా పేరు కాటూరు రంగాచారి. కార్టూన్ అంటే ఆలోచింపజేస్తూ,నవ్వుకూడా వచ్చేటట్లుండాలని నా ఉద్దేశ్యం.
నేను డిసెంబర్ 1955లో కాటూరు వెంకటాచార్యులు, ఆండాళమ్మ గార్లకు వరంగల్ జిల్లాలోని ఏడునూతుల’ గ్రామంలో జన్మించాను. నా విద్యాభ్యాసం అంతా వరంగల్ జిల్లాలోనే జరిగింది. వరంగల్ లోని CKM కాలేజీలో B.Com., గవర్నమెంట్ లా కాలేజీలో L.L.B., చేసాను. తర్వాత హైద్రాబాద్ లో Advocate గా నాలుగయిదు నెలలు ప్రాక్టీసు చేసాక State Excise Department లో Job వస్తే హన్మకొండ, D.C. Office లో జాయిన్ అయి మొత్తం Job వరంగల్ జిల్లాలోనే చేసి Prohibition & Excise Sub inspector గా 2012 లో రిటైరయ్యాను. నేను వేసే సగం కార్టూన్ల ఐడియాలకు కారణమైన మా శ్రీమతి పద్మ గృహిణి. మా అబ్బాయి కార్తీక్, అమ్మాయిలు కీర్తన, కావ్య, కోడలు వందన, అల్టుడు అరవింద్, మనవళ్లు అధర్వ, సాత్విక్.
నాకు చిన్నప్పటినుండి కార్టూన్లు అన్నా, పెయింటింగ్స్ అన్నా చాలా ఇష్టం చిన్నప్పుడు అన్ని పెయింటింగ్స్ వేసి ఇంట్లో గోడలకు బీరువాలకు అతికించేవాడిని. నేను తొర్రూరులో స్కూల్లో చదువుకునేటప్పుడు మా నాన్న వారానికోసారి అక్కడికి వెళ్ళిరావడానికి బస్ కిరాయి ఇస్తే నిక్కర్ వేసుకుని బలో వెళ్లి, ఏదో మానేజ్ చేసి హాఫ్ టికెట్ తీసుకొని మిగిలిన డబ్బులతో వీక్లీలు కొనుక్కునేవాడిని.
నా మొదటి కార్టూన్ 1977వ సం.లో ఆంధ్రభూమి వీక్లీలో పడింది. అచ్చులో నా కార్టూన్ చూసుకున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 1500 కార్టూన్ల వరకు పబ్లిష్ అయ్యాయి. వాటిలో చాలావరకు చాలా రోజులు భద్రంగా దాచుకున్నా.. ఎక్కడో పోయాయి. మిగిలిన కొన్ని కార్టూన్లను భద్రంగా ఒక పుస్తకంలో అంటించి ఉంచా. నా కార్టూన్లు అప్పట్లో స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, హాసం, క్రోక్విల్ హాస్యప్రియ మొదలైన దాదాపు అన్ని పత్రికలలో ప్రచురించబడ్డాయి.
అప్పట్లో ఉద్యోగరీత్యా ఎక్కువ తీరికలేక పోయినా ఐడియా రాగానే కార్టూన్ వేసి పంపేవాడిని. కాని కార్టూన్ పోటీలలో ఎక్కువగా పాల్గొనలేదు. మొదట్లో ‘తెలివితేటలు’ అనే పత్రికలో మొదటి బహుమతి, ‘ఈనాడు ‘ వారి పోటీలో ద్వితీయ బహుమతి వచ్చాయి. రిటైరయ్యాక మా అబ్బాయి US నుండి పంపిన I Pad Pro లో కార్టూన్లు వేస్తూ ఈ మధ్య కొన్ని పోటీలలో పాల్గొన్నాను. హాస్యానందం, గోతెలుగువారు నిర్వహించిన పోటీలలో ప్రత్యేక బహుమతి, జ్యూరీ బహుమతి వచ్చాయి. 20 సెప్టెంబర్ 2020 నాడు బహుమతిని తనికెళ్లభరణిగారి చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉంది.
అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు, కవితలు కూడా రాస్తుంటాను. 2007లో హాస్యానందం వారు ‘మళ్ళ జగన్నాథం, స్మారక మినీ హాస్య కథల పోటీ నిర్వహిస్తే అందులో ‘ఛాలెంజ్’ అనే నా కథకు ప్రథమ బహుమతి వచ్చింది. శ్రీ బాపు గారు, జయదేవ్ బాబు గార్లు నా అభిమాన కార్టూనిస్టులు. సరసిగారు, శంకు గారు, సుభాని గార్ల కార్టూన్లు నాకెంతో ఇష్టం.
-రంగాచారి
ఆల్ ది బెస్ట్ రంగాచారిగారు.
మీ ఐడియాలు బాగుంటాయి.
మీరు చిన్న కార్టూనిస్ట్ కాదు.
మరిన్ని కార్టూన్స్ మీనుంది రావాలని కోరుకుంటూ…
మీ అడ్డూరి.
Thank you Adduri garu. 20 years back First na cartoons migatha cartoonists mithrulatho kalisi book ga thechindi meeregada .thank you once again .
రంగాచారిగారి గురించి చక్కటి పరిచయం, వారిగురించి తెలియనివిశేషాలు తెలిపారు కళాసాగర్ గారు.
రంగాచారిగారి కార్టూన్లు చక్కట్టి కలర్స్ తో మనసును ఆహ్లాదపరిచేవిధంగా ఉంటాయి.
💐 అభినందనలు రంగాచారిగారు.🎊
రంగాచారి గారి కార్టూన్లు బాగుంటాయి. మీకు అభినందనలు.నేను వరంగల్ లో 7వ తరగతి చదివాను. S v v b s పాఠశాల లో 1963-64