తెలుగు నేలకు దూరంగా ఒరిస్సా రాష్ట్రం వున్నా తెలుగు భాషపై వున్న మమకారంతో, కార్టూన్ కళపై వున్న మక్కువతో కార్టూన్లు గీస్తున్న రవిశర్మ గారు ” మన కార్టూనిస్టులు ” ఫీచర్లో మీ ముందుకొచ్చారు.
రవిశర్మ పేరుతో కార్టూన్లు గీస్తున నా పూర్తి పేరు బులుసు వేంకట సుబ్రమణ్య రవి ప్రసాద్ శర్మ. పుట్టింది ఒరిస్సా రాష్ట్రం బరంపురంలో 18 సెప్టెంబర్ 1965 లో. చదివింది ఎం.టెక్.(సివిల్ ఇంజనీరింగ్). ఒరిస్సా ప్రభుత్వం ప్రజా పనుల శాఖలో సీనియర్ ఇంజనీర్ గా నా ఉద్యోగం. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీలో ఏం.ఎస్. చేస్తున్నాడు. రెండోవాడు +2 కామర్సు లో మొన్నే స్టేట్ ర్యాంక్ సాధించి సీ.ఏ. చేద్దామనుకుంటున్నాడు. నా శ్రీమతి డబల్ ఏం.ఏ. చేసిన గృహిణి.
చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం ఇష్టం. చిన్నప్పుడు చందమామలో శ్రీ వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసి మురిసి పోయేవాడిని. ఒడియా మాధ్యమంలో చదువుకున్న నాకు తెలుగు అంటేప్రాణం. అలా కూడబలుక్కొని చందమామ చదవడం నుండి, నాన్నగారి ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ, తిలక్, రావిశాస్త్రీ ఇంకా రష్యన్ సాహిత్యం చదివి తెలుగులో కథలు కవితలు రాసే స్థాయికి వచ్చాను. తెలుగు పత్రికలలో శ్రీ జయదేవ్ గారి కార్టూన్లు విరివిగా వచ్చేవి. ఆ బొమ్మలు చూసి ప్రాక్టీసు చేసేవాడిని.
మా ఊళ్ళో “వికాసం” సాహితీ సంస్థ సాహితీ పరంగా నా ఎదుగుదలకి సాయం చేస్తే, శ్రీ బాపు మరియు జయదేవ్ గారి కార్టూన్లు, నాలో కార్టూన్లు గీయాడానికి స్ఫూర్తినిచ్చాయి. నా తొలి కార్టూన్ ఆంధ్రజ్యోతిలో (1984) అచ్చయింది. ఆ తరువాత కొన్ని కార్టూన్లు నవ్య, ఉదయం, ఆదివారం వార్త లో అచ్చయ్యాయి. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం అవి నా దగ్గర ఒక్క కాపీ కూడా లేవు. ఒడిసాలో మారుమూల పల్లెటూర్లలో ఎక్కువ రోజులు పని చెయ్యడం వలన అక్కడ పోస్టల్ సదుపాయం లేకపోవడం, పంపిన కార్టూన్లు తరచూ తిరిగి వస్తూ ఉండడం కారణంగా కార్టూన్లు వేద్దామన్న ఆసక్తి కొంతకాలం సన్నగిల్లిపోయింది.
కానీ తెలుగు పత్రికలు చూసినప్పుడలా మళ్ళీ వేయాలనిపించేది. అలా కొంతకాలం గ్యాప్ తో అటు ఒడియా ఇంకా తెలుగు పత్రికల్లో కార్టూన్లు వేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 500 కార్టూన్లు వెలుగు చూశాయి.
కానీ మద్యలో వచ్చిన టెక్నాలజీ మార్పు వలన, ప్రస్తుతం కార్టూన్లు ఈ మెయిల్ లో పంపించే సదుపాయం రావడంతో కొన్ని కార్టూన్లు వెబ్ మ్యాగజిన్లలో వచ్చాయి. ఉద్యోగరీత్యా తెలుగు వారికి దూరంగా వుండడం వలన సభలు సమావేశాలలో పాల్గొన లేక పోవడంతో, కార్టూనిస్ట్ మిత్రులు కూడా లేని తరుణంలో వాట్సాప్, ఫేస్ బుక్ లే నాకు శరణ్యం అయ్యాయి.
ఇప్పుడు చక్కగా నా అభిమాన కార్టూనిస్టులు శ్రీ జయదేవ్ గారి తో ఒకే కార్టూనిస్ట్ గ్రూప్లో వుండి, ఆయన సలహాలు తీసుకోవడం మరిచిపోలేని అనుభూతి. అలాగే శ్రీ సరసి గారికి, శ్రీ బాచి గారికి ఎంతో ఋణపడి ఉన్నాను.
వృత్తి రీత్యా నాకు ఐ పాడ్(i pad) అవసరం అయింది. ఆఫీసు పనులకు సైట్లు విజిట్ చెయ్యడంవలన, ఐ పాడ్లో బొమ్మలు వేయడానికి కావాల్సిన యాప్ లు కొనుక్కొని, ఒక సంవత్సరం పాటు ప్రాక్టీసు చేసి, ఇప్పుడు ఐ పాడ్ తో కార్టూన్లు వేస్తున్నాను. కానీ మన గీతలు, మన రాతలు వుంటేనే కార్టూన్ కి అందం అని నమ్మిన వాడిని నేను. అదే ఆచరిస్తాను కూడా.
ఏ కళ అయినా సమాజాన్ని మారుస్తుందని నా నమ్మకం.
కార్టూన్లతో పాటు, గత 30 సవత్సరాలుగా ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నా ఛాయాచిత్రాలు కొన్ని అంతర్జాతీయ పత్రికలలో వచ్చాయి. కొన్ని అవార్డులు కూడా పొందాయి.
కార్టూన్ కేవలం నవ్వుకోవడానికే కాక సమాజానికి ఒక చురక అంటించాలి అని భావిస్తాను. తెలుగు కార్టూనినిస్ట్లు మీద ఒక డాక్యుమెంటరీ తియ్యాలని అభిలాష వుంది నాకు. ( గతంలో సహాయ దర్శకుడిగా పని చేసిన అనుభవం వుంది)
64కళలు పత్రికలో నన్ను నేను పరిచయం చేసుకోవడానికి సూత్రధారి శ్రీ కళాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
రవిశర్మ పరిచయం యిక్కడ చదివి చాలా ఆనందించాను. శర్మ నాకు ఆత్మీయుడు. ఎన్నో ఏళ్లుగా స్నేహం. నేనుకూడా ఒడిసా బరంపురం వాడినే. వికాసం సభ్యుణ్ణి. శర్మ తీసే black&white photos కి నేను వీరాభిమానిని. రైతుల ఆత్మహత్య మీద తను తీసిన ఫోటో Screenplay of an Indian Love Story అన్న నా సినిమాలో ప్రముఖంగా కనపడి, నా సినిమా స్థాయిని పెంచింది. సామాజిక స్ప్రుహ వున్న గొప్ప కళాకారుడు రవిశర్మ. కొన్ని వందల ఫోటోలు తీశాడు. ఒకటి రెండు మినహా అన్నీ నిరుపేదల, కష్టజీవుల చిత్రాలే. అంతర్జాతీయ స్థాయి ఛాయాచిత్రకారుడు. మా వూరు పేరుని ఏదో రోజున తన ఫోటోలతో మార్మోగేట్లు చేస్తాడని నా నమ్మకం.
KLPrasad Film writer & Director
Ravi Sharma ji…namasthe.. మీకు శుభాకాంక్షలు.. మీ యొక్క పరిచయం చదివాను చాలా బాగుంది . మీ cartoon ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది ..తెలుగు మీద ….కార్టూన్ మీద ..మీ ప్రేమ, ఆసక్తి చాలా ముచ్చటేసింది …ఈ మధ్యనే నేను కార్టూన్లు చూస్తూ ఉన్నాను …మీ కార్టూన్లు చూశాను good…మీకు శుభాకాంక్షలు . మీ నుంచి మరెన్నో good and wonderful cartoons ఆశిస్తూ …..గోపాలకృష్ణ, Cartoonist, Hyderabad
Very nice cartoons.
Such a wonderful lining Ravi Sharma garu…. So happy see here. Thanks Kala sagar garu.
Congrats Ravi Garu. First time seeing your cartoons. I like your coloring style in tab.
రవి శర్మ నాకు సాహితీ మిత్రుడు. మంచి మనసున్న, మానవత్వం మూర్తీభవించిన మనిషి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కధా రచయిత, గొప్ప ఫొటోగ్రాఫరు, అంతే గొప్ప కార్టూనిస్ట్.
మొదట రవిశర్మ గారి ఒక ఛాయాచిత్రం శ్రీ KL Prasad గారి “స్క్రీన్ ప్లే” చిత్రం ప్రివ్యూ లో చూశాను. నేనూ 32 ఏళ్లుగా బ్యాంకు మేనేజర్ గా వృత్తిరీత్యా రైతులతో సన్నిహితంగా మెలిగి వారి జీవితాలలో కష్టనష్టాలను దగ్గరగా చూశాను. ఆ ఛాయాచిత్రం రైతుల కష్టాల గురించి చాలా బలమైన సందేశం అందిస్తుంది. తర్వాత రెండు వాట్సాప్ గ్రూపులలో వారి కార్టూన్లు, ఫోటోలు, కవితలు గత ఆరేడు నెలలుగా చూస్తున్నా. ప్రతి ప్రక్రియలో వారి ముద్ర స్పష్టంగా
కనబడుతుంది. ఎప్పుడూ బడుగుల ఉన్నతికి సంబంధించి ఆలోచనలు, రచనలు లోతైన భావాలతో అందిస్తుంటారు. కార్టూన్లు , సాహితీ రంగంలో ఇంకా ఉన్నత స్థితిలో చూస్తానని నమ్మకం
రవి శర్మ నాకు సాహితీ మిత్రుడు. మంచి మనసున్న, మానవత్వం వున్న బహు ముఖ కళాకారుడు. కవి, కధా రచయిత, మంచి ఫొటోగ్రాఫరు మంచి కార్టూనిస్ట్.
నమస్కారం..నేను కూడా ఒడిస్సా లో పని చేసి రిటైర్ అయ్యాను. మీ పరిచయం చాలా ఆనందాన్ని కలిగించింది. అడపా దడపా కార్టూన్లు వేస్తుంటాను.
రవిశర్మ గారు మీ పరిచయం బాగుంది.మీ కార్టూన్లు బాగుంటాయి. చిన్న వ్యాఖ్య,అందమైన బొమ్మ .నాకెంతో ఇష్టం మీ కార్టూన్లు