కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

కేశవ శంకర్ పిళ్ళై భారతీయ కార్టూనిష్టు. ఆయన “శంకర్”గా సుపరిచితులు. ఆయన 1948 లో “శంకర్ వీక్లీ”, “పంచ్ (పత్రిక) ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ, కుట్టీ వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఆయన జూన్ 25 1975న ఎమర్జెన్సీ కాలంలో పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా తన శేష జీవితాన్ని గడిపారు.

శంకర్ పిళ్ళై కార్టూనిస్టుగా దేశంలో అన్నీ అతున్నత పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి. ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్లు అనే ప్రక్రియకు ప్రాచుర్యాన్ని, రాజకీయ నాయకులను, దేశ సమస్యలను చాలా ప్రతిభావంతంగా వ్యంగంతో ఎలా విమర్శ చేయవచ్చో నాంది పలికి జర్నలిజం లో కార్టూన్ ప్రాముఖ్యతను, ఆవిష్కతను బలంగా నిరూపించిన మార్గదర్శకుడు.

శంకర్ జూలై 31, 1902లో కేరళ లోని కాయంకుళంలో జన్మించారు. ఆయన ప్రారంభ విద్యను కాయంకుళం మైర్యు మాలెలిక్కర ప్రాంతాలలో చేసారు. ఆయన వేసిన మొదటి కార్టూన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు నిద్రిస్తున్న భంగిమలో కలది. ఆ చిత్రాన్ని ఆ తరగతి గదిలోనే వేసారు. ఆ సంఘటన ప్రధానోపాధ్యాయుని ఆగ్రహానికి గురిచేసింది. కానీ ఆయన పినతండ్రి ప్రోత్సాహం మేరకు ప్రసిద్ధ కార్టూనిస్టుగా ఎదిగారు పాఠశాల విద్య అనంతరం “మావెలికర”లో రవివర్మ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ లో చదివారు.

పట్టభద్రుడైన తరువాత ఆయన 1927 లో త్రివేండ్రం లోని మహారాజా కాలేజి ఆఫ్ సైన్స్ (ప్రస్తుతం యూనివర్శిటీ కళాశాల)లో చేరారు. ఆయన ఉన్నత విద్యకోసం ముంబై విడిచి వెళ్ళి న్యాయ కళాశాలలో చేరారు. కానీ న్యాయశాస్త్ర విద్యను మధ్యంతరంగా విడిచిపెట్టారు.

ఆయన చదువుకునే రోజుల్లోనే కార్టూన్లు వేసేవాడు. తన కార్టూన్లతో గాంధీ, జిన్నా, నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలగు ఎందరో నాయకుల వ్యంగ్య చిత్రాలు గీసి వారి చేత ‘సెహబాష్‌ శంకర్‌’ అనిపించుకున్న అద్భుత ప్రజ్ఞాశాలి ఆయన. శంకర్‌ ఎందరో నాయకుల తప్పులను వ్యంగ్య చిత్రాలుగా గీసి వారి తప్పును బయటపెట్టాడు. 1948 లో శంకర్స్‌ వీక్లిని ప్రారంభించి తన విజయకేతన మెగుర వేశాడు. అప్పట్లో ‘శంకర్స్‌ వీక్లి’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఒకవైపు పెద్దల అభిమానాన్ని పొందుతూనే మరోవైపు తన కిష్టమైన పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. పిల్లలకోసం అతడు 1965లో దేశ విదేశాల నుండి బొమ్మలను సేకరించి ఢిల్లీలో ఒక డాల్స్‌ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ మ్యూజియంలో దేశ దేశాలకు చెందిన దాదాపు అయిదువేల బొమ్మలు మనకు కనువిందు చేస్తాయి. అలాగే బాలల కోసం బాలల పుస్తకసంస్థ (సిబిటి), చిల్డ్రన్స్‌ వరల్డ్‌ అనే పిల్లల గ్రంథాలయాన్ని నెహ్రూ నివాసంలో ఈయన నెలకొల్పారు.

1931లో హిందూస్తాన్ టైమ్స్ లో ప్రతి దినం కార్టూన్లేయడం ప్రారంభించారు.అతని కార్టూన్లు ప్రతి చోటా చర్చనీయాంశంగా వుండేవి. సాధారణంగా కార్టూనిస్ట్ కార్టున్ చూసి ఎడిటర్ అనుమతి పొందాకే ప్రచురించ బడుతుంది.కాని, శంకర్ విషయంలో ఆ నియమం ఉండేది కాదట. 1941 హిందూస్తాన్ టైమ్స్ లో శంకర్ అప్పటి భారత దేశ వైస్రాయి లార్డ్ విన్త్ గో కాళికాదేవిలా పుర్రెలు మెళ్ళోవేసుకొని శ్మశానంలో కరాళ నృత్యం చేస్తున్నట్లు బొమ్మ వేసారు. ఉదయాన్నే ఆ బొమ్మ చూసిన ఎడిటర్ బ్రిటిష్ ప్రభుత్వం తన పత్రికను నిషేధించడం తప్పదనుకున్నాడట. అనుకున్నట్లుగానే వైస్రాయి ఆఫీసు నుంచి మీ కార్టూనిస్ట్ ను మా ఆఫీస్ కు పంపించండి అంటూ ఫోనొచ్చింది. భయపడూతూ శంకర్ వైస్రాయి గదిలోకి అడుగుపెట్టాడు. వైస్రాయి లార్డ్ విన్త్ గో తన సీటులోంచి లేఛి కరచాలనంచేసి “నీ కార్టూన్ అద్భుతంగా వుంది. కీప్ ఇట్ అప్. ఆ కార్టూన్ ఒరిజినల్ నాకివ్వగలవా? దాచుకొంటాను” అన్నాడట. అలా తన కార్టూన్లను భారతీయ నాయకుల్లో అభిమానించినది, గాంధీ, నెహ్రూలని శంకర్ అనేవారు. 1948 లో “శంకర్స్ వీక్లీ”ని ప్రారంభించి నప్పుడు నెహ్రూ “నా మీద కూడా నువ్వు కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా” అని నెహ్రూ కోరారు.
కెరీర్: ఆయన కార్టూన్లు “ద ఫ్రీ ప్రెస్ జర్నల్”, “బాంబే క్రానికల్” లలో ప్రచురితమయ్యాయి. 1932లో “ద హిందూస్థాన్ టైమ్స్” పత్రిక సంపాదకుడు పోథన్ జోసెఫ్ ఈయనను ధిల్లీకి తీసుకొనివచ్చి స్టాప్ కార్టూనిస్టును చేసారు. ఆయన 1946 వరకు స్టాఫ్ కార్టూనిస్టుగానే ఉన్నారు. తరువాత ఆయన కుటుంబం న్యూఢిల్లీలో స్థిరపడింది.
హిందుస్తాన్ టైమ్స్ నుండి వైదొలిగిన వైనం : ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సి. రాజగోపాలాచారిని విమర్శించే కార్టూన్ల ప్రచురణను నిలిపివేయాలని టైమ్స్ ఎడిటర్ దేవదాస్ గాంధీ ఒత్తిడి మేరకు పిళ్లై హిందుస్తాన్ టైమ్స్ నుండి వైదొలిగిన తర్వాత 1948లో వారపత్రిక తన మొదటి సంచికను ముద్రించింది . ఈ పత్రికను భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు , పిళ్లై ఈ పత్రికను “ప్రాథమికంగా రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం”గా అభివర్ణించినప్పటికీ, పిళ్లై రాజకీయ నాయకులతో సన్నిహిత స్నేహాన్ని పంచుకున్నారు.


దేశవ్యాప్తంగా ఔత్సాహిక కార్టూనిస్టులకు శంకర్స్ వీక్లీ వేదికగా మారింది :

Cartoonist Shankar

శంకర్స్ వీక్లీ వారపత్రికలో ప్రచురించిన ప్రముఖ కార్టూనిస్టులలో ఆర్‌కె లక్ష్మణ్, రాజిందర్ పూరి, కెవి, కుట్టి, బాల్ థాకరే మరియు యేసుదాసన్ ఉన్నారు. పత్రిక నిర్దేశిత స్థలంలో పాఠకుల నుండి రచనలను ఆహ్వానించింది. EP ఉన్నీ వంటి చాలా మంది కార్టూనిస్టులు పాఠకుల కాలమ్ ద్వారా ప్రచురించారు. ఉన్ని ప్రకారం, శంకర్స్ వీక్లీ “రెండవ తరం భారతీయ రాజకీయ కార్టూన్‌లకు నిలయం”. శంకర్ క్రాఫ్ట్ కోసం నిశ్చయతతో చాలా శక్తివంతమైన నాయకుడిగా ఉన్నప్పటికీ, విభిన్న శైలులను కలిసి పనిచేయడానికి అనుమతించాడు. సాధారణ ఇంటి శైలి లేదు; వివిధ రకాల వ్యక్తిగత శైలులను కార్టూనిస్టులు సృష్టించారు.
1975లో, ది ఎమర్జెన్సీకి రెండు వారాలు, పత్రిక 27 సంవత్సరాలు నడిచిన తర్వాత మూసివేయబడింది. వ్యవస్థాపకుడి ప్రకారం, మూసివేతకు ఎమర్జెన్సీ కారణం కాదు. మూసివేత గురించి విన్న ప్రధాని ఇందిరాగాంధీ పిళ్లైకి ఒక లేఖ రాశారు, ఆమె “జర్నల్‌ను కోల్పోతాను” అని పేర్కొంది.

మరణం : శంకర్ డిసెంబరు 26, 1989న కన్నుమూశారు. ప్రపంచం అతనిని మళ్లీ చూడదు, కానీ అతని వారసత్వం కొనసాగుతుంది. మన రాజకీయ నాయకులు మరియు జాతీయ కార్యక్రమాలలో తప్పులను స్వేచ్ఛగా చిత్రీకరించడంలో తన ధైర్యం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క చక్కటి దృక్పథాన్ని చూపిస్తూ సాహిత్య పీఠానికి నవ్వుల బహుమతిని ఇచ్చాడు. అతను తన వద్దకు వచ్చిన వ్యక్తులలో సృజనాత్మకతను ప్రోత్సహించాడు మరియు వర్ధమాన ప్రతిభకు విస్టాలను తెరవడంలో భవిష్యత్తును పెంపొందించాడు. అతను సార్వత్రిక స్నేహం కోసం ప్రయత్నించాడు మరియు ప్రపంచ జ్ఞాపకం అయ్యాడు.
అవార్డులు : 1) పద్మశ్రీ- 1956, 2) పద్మభూషణ- 1966, 3) పద్మవిభూషణ- 1976, 4) ఆర్డర్ ఆఫ్ ద స్మైల్ (1977), పాలిష్ బాలల కమిటీ నుండి పురస్కారం, 5) డి.లిట్ (Honoris causa). డిల్లీ విశ్వవిద్యాలయం నుండి.

1 thought on “కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

  1. చాలా చక్కని వ్యాఖ్యానం రాశారు కళా సాగర్ గారూ. Sankar గారి గురించి. అటువంటి వారిని చూస్తూ ఉంటే గర్వంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap