నా పేరు షేక్ సుభాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాలవంచలో ఉంటాను. పుట్టింది ఆగస్ట్ 8న 1962 లో. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ ని – ప్రవృత్తి జర్నలిజం, కార్టూనింగ్. 1981లో ఇంటర్ చదివేరోజుల్లో పత్రికల్లో నా పేరు చూసుకోవాలన్న ఉత్సాహంతో చిన్న, చిన్న జోక్స్ పత్రికలకు పంపేవాడిని. సుభాని (డక్కన్ క్రానికల్) గారి సలహాతో కార్టూన్లు గీయటం ప్రారంభించా, 1982-84 వరకు విజయవాడలో ఫొటోగ్రఫీ నేర్చుకునే సమయంలో శేఖర్, అరుణ్, ప్రసాద్ కాజా, ఏపూరి రాజు తదితర కార్టూనిస్ట్ పరిచయంతో కార్టూన్లు గీయడంలో మెళుకువలు నేర్చుకున్నాను. ఆంధ్రజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రభూమి, పల్లకి, తరంగిణి, స్రవంతి తదితర పత్రికల్లో కార్టూన్లు ప్రింటయ్యాయి. తొలికార్టూన్ ఆంధ్రజ్యోతిలో ప్రింటయింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమిలలో బాలీవుడ్ సినిమా విశేషాలు రాసేవాడిని. 2000 సంవత్సరం నుండి జర్నలిజం ప్రింట్ మీడియాలో బిజీ కావటంతో కార్టూన్లు గీయటం తగ్గించాను.
క్రిక్విల్ హస్యప్రియలో ప్రముఖ చిత్రకారుడు టి.వి.ప్రసాద్ తో కలిసి ఏడాదిపాటు హఫ్ పేజీ కార్టూన్లు గీసాను. కొందరు మిత్రులతో కలిసి ఫుల్ పేజీ కార్టూన్లు వివిధ పత్రికల్లో గీసాను. పాలవంచ కేంద్రంగా “సంఘమిత్ర” ఖమ్మంజిల్లా వారపత్రికలో ఫ్రంట్ పేజీ కార్టూతో పాటు సినిమా వ్యాసాలు రెండున్నర సంవత్సరాలు రాసాను.
2019లో బెంగుళూరులో జరిగిన కార్టూన్ ప్రదర్శనలో చాలామంది పాతమిత్రులు మళ్ళీ కార్టూన్లు గీయమని సలహా ఇచ్చారు. అప్పటినుండి రెండో ఇన్సింగ్స్ ప్రారంభమైంది. నెలకు నాలుగైదు కార్టూన్లు వివిధ వాట్సప్ గ్రూపుల్లో అప్పుడప్పుడు హాస్యానందం, ‘హస్యపు హరివిల్లు’లో వస్తుంటాయి. పదేళ్ళ నుండి నావద్ద కంప్యూటర్ ఉన్నా, గత మూడు సంవత్సరాల నుండే కార్టూన్లకు కంప్యూటర్ లో కలర్స్ వేస్తున్నాను. జకీర్ సర్ ఒకసారి పాల్వంచ వచ్చినపుడు పదినిమిషాల్లో తేలిక పద్ధతిలో సిస్టమ్ ద్వారా కలర్స్ వేయటం నేర్పారు. కార్టూన్లు వేయడంలో ఇప్పటికి నాకొక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాను. నా కార్టూన్లలో నా పాత్ర తప్పని సరిగా ఉంటుంది. రంగులు వేయటంలో నా ప్రత్యేకత చూపిస్తున్నాను. పలువురు సీనియర్ కార్టూనిస్టులు ” కార్టూన్లలో నా పాత్ర గీయటాన్ని, కార్టూన్లకు వేసే రంగులను ప్రశంసించారు.
గతంలో పత్రికల్లో కార్టూన్ ప్రింటయితే కాంప్లిమెంటరీ కాపీతో పాటు, పారితోషికం వచ్చేది. ఇవి మరిన్ని కార్టూన్లు గీసేందుకు ప్రోత్సాహకాలుగా ఉండేది. కార్టూనిస్ట సంఖ్య తక్కువగా ఉండేది. అన్ని పత్రికల్లో కార్టూన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పత్రికలు మూతపడుతున్నాయి. కార్టూనిస్టు పత్రికల నుండి ప్రోత్సాహం కరువైంది.
కార్టూన్ కళ అందరికి సొంతం కాదు. కార్టూనిస్ట్ గా పేరు సంపాదించడం గొప్ప విషయం. పారితోషికం గురించి ఆలోచించకుండా కార్టూనిస్టు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని ప్రముఖ కార్టూనిస్టుగా పేరు పొందాలి. తమదైన ప్రత్యేకత నిలుపుకోవాలి. నిరంతర సాధన చేస్తూ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. ప్రముఖులు గీసిన కార్టూన్ సంకలనాలు పరిశీలించాలి. కొత్త విషయాలు గ్రహించాలి. బహుమతులు రాకపోయినా పోటీల్లో పాల్గొనాలి. నేను ఫొటోగ్రఫీ జర్నలిజం (నమస్తే తెలంగాణా పాలవంచ రూరల్ విలేఖరి) లో నిత్యం బిజీగా ఉంటాను.
కానీ కార్టూన్ గీసే గంట, గంటన్నర సమయంలో అన్ని మర్చిపోతాను. మానసికంగా ఉల్లాసాన్ని పొందుతాను.
-షేక్ సుభాని
చాలాకాలం తరువాత నిన్ను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది సుభానీ.
నీ ఫొటోగ్రఫీ, జర్నలిజం గురించి తెలుసుగాని కార్టూనిస్ట్ తెలియదు నాకు వండర్ అయ్యాను.
జి.రాములు వాళ్ళ చెల్లెలు పాలవంచలోనే ఉంటోందట. రాములు ఎప్పుడైనా కలుస్తున్నాడా??
గోల్డెన్ స్టార్స్ 3 ఇంక్లైన్ గుర్తుందా?!?!
నేను గుర్తున్నానా??
వీలయితే ఓ సారి ఫోన్ చెయ్యి. నా నంబరు 7670985485 , 7702181090
జి. నర్సింగ రావు
షేక్ సుభాని గారి పరిచయం బాగుంది.
సుభాని గారు మీ ప్రస్తానం బాగుంది. మీ బొమ్మలు ,వ్యాఖ్య సున్నిత హాస్యం ,వ్యంగ్యం టో వుంటాయి.