కార్టూన్లకు కాలం చెల్లిందా?

ఒకప్పుడు తెలుగులో దినపత్రికలే కాకుండా వార, మాస పత్రికలు ఎన్నో ఉండేవని చెబితే ఔనా అనిపించే రోజులివిని అన్ని వయసులవారికి సరిపడే శీర్షికలతో ఇంటిల్లిపాదికి అని అబరించేవి వాటి రాక కోసం పాదకులు ఎదురుచూసేవారు. ఊరూరా గ్రంథాలయాల్లోపత్రికల విభాగం ఎప్పుడూ కిక్కిరిసి ఉండేది. పత్రిక చివరి పేజీకి వచ్చినవాడు పక్కన పెట్టగానే అందుకోడానికి సిద్ధంగా నలుగురు ఉండేవారు. కథలు, నవలలు, భిన్న శీర్షికలకు అదనంగా ప్రతి సంచికలో ఎన్నో కార్టూన్లు అండేవి. హాస్యాన్ని పండిస్తూ అవి పాఠకలోకానికి ప్రత్యేక్ష ఆకర్షణగా నిలిచేవి. పత్రికలో కార్టూన్లు లేకపోతే పేజీ అందమే కొరత పడేది.
ఆఫ్ సెట్ ముద్రణ రాక ముందు కథకు వేసే బొమ్మలను గాని, కార్టూన్లను గాని బ్లాకులుగా చేయించేవారు. ఇండియన్ ఇంకుతో వేసిన బొమ్మలు ఇస్తే ఫోటోగ్రఫీ లాంటి ప్రక్రియతో సీనపు బ్లాకులు చేసే చిన్న పరిశ్రమలు ఉండేవి. బ్లాకుల తయారీ కోసం విడిగా ఖర్చు అయ్యేది. అందుకు పత్రికలు వెనుకాడేవి కాదు, కార్టూన్ల కోసం పత్రికలను తిరగేసేవారిని దృష్టిలో పెట్టుకొని ఆ ఖర్చును భరించేవి. ఇంకా చెప్పాలంటే రచనలు చదివేవారి కన్నా, కార్టూను చూసే వారి సంఖ్యే ఎక్కువ. కంటపడగానే చేతిలోకి తీసుకొని కార్టూన్ల కోసం ఎక్కువ మంది తిరిగేయడంతో వారం చివర ఆ పత్రిక పాతబడిపోయేది. రచయితలతో పాటు కార్టూనిస్టులు కూడా సమానంగా ఆదరణను పొందేవారు. రచయితల పేర్ల మధ్య కార్టూనిస్టుల పేర్లు కూడా గుర్తుండేవి. సీనియర్ కార్టూనిస్టులు రేఖలు కొత్తవారికి పాఠాలు నేర్పేవి అభిమాన కార్టూనిస్టు బొమ్మలను కత్తిరించి ఆల్బమ్ తయారు చేసుకొనేవారు ఉండేవారు. చిత్రంలో హాస్యం, వ్యంగం ఏమాత్రమున్నా కొత్త, పాత అనే భేదం లేకుండా పత్రికలు అందరి కార్టూన్లు వేసేవి. ఆ కారణంగా చాలా మంది కొత్త కార్టూనిస్టులు పుట్టుకొచ్చారు. పండుగలకు వచ్చే విశేష సంచికల సందడే వేరు. ఆయా పండుగలకు చెందిన విశేషాలతో కూడిన కామాన్లతో పేజీలు నిండిపోయేవి. వినాయక చవితి ప్రత్యేక సంచికలో వినాయకుడు. మూషికానికి సంబంధించిన కార్టూన్లే ఎక్కువ. సంక్రాంతి సంచికలో అల్లుళ్ళ రాకపై వ్యంగ్యాలు నవ్వులు కురిపిందేవి దీపావళి టపాసుల పేలుడుపై కూడా హాస్యం పండించే ఎన్నో కార్టూన్లు వచ్చేవి. అలా తెలుగింటి సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన ప్రతి సందర్భంపై కార్టూన్లు ప్రతిస్పందించేవి. ఒకరు చదివిన కార్టూన్ మరొకరి చూయించి మళ్ళీ పడీ పడీ నవ్వేవారు. మన ఇళ్లలో మారి వంట చేసే భర్తల బాధలు, తాగుబోతుల భార్యల ఇబ్బందులు, పేకాట తెచ్చే అగచాట్లులాంటి ఎన్నో గుట్టు ముచ్చట్లు కార్టూన్లలోకి వచ్చి నవ్వించేవి, బాదిందేవి. మనుషులు తమ తప్పును తెలుసుకొని బుద్ధిగా ఉండే దారి చూపేవి.

తమ వ్యంగ్య చిత్రాల ద్వారా పాటకుల అభిమానానికి పాత్రులైనవారు ఎందరో ఉన్నారు. దర్శకుడు బాపు గొప్ప చిత్రకారుడైనా వందలాది కార్టూన్లు వేశారు. బాపు బొమ్మకు ఇచ్చే గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన కార్టూనుకు కూడా లభించేది. పిల్లల కోసం ‘బుడుగు’ను ఎన్నో సంధులు చెప్పారు. ఆయన కార్టూన్లతో వచ్చిన పుస్తకాలకు డిమాండ్ ఏనాటికి తగ్గదు. చిత్రకారులైన చంద్ర, బాలి, గోపి తదితరులు కూడా కార్టూన్లు కేవలం కార్టూనిస్టులుగా పాఠకులకు చేరువైన ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. మద్రాసులో ఉండే జయదేవ్ తన సన్నని గీతాలతో అద్భుతమైన కారూనం వేశారు. పరిపక్వమైన సామాజిక విమర్శ ఆయన బొమ్మల్లో ఉండేది. ఆయన దారాలకు అన్ని పత్రికలు ఎంతో విలువనిచ్చేవి. అందమైన అక్షరాలతో చక్కగా బొమ్మలుంచే కార్టూను రామకృష్ణ పేరిట వచ్చేవి. శంకు కార్టూన్లు చూడముచ్చటగా ఉండేవి, మల్లిక్ కార్టూన్లకు కింగ్ అంతటివారు ఆంధ్రభూమిలో తన కార్టూన్లను ప్రవాహంలా పాలించారు. ఆ పత్రిక విశేష పాఠకాదరణ పొందుతున్న సమయంలో ఆయన సెలబ్రిటీ హోదా అందుకున్నారు. వీరిలో ఒక్కొక్కరి సంతకం ఒక్కో స్టైలు జాజి తీగలాంటివి జయదేవ్ సంతకం. నిలువుగా ఉండే రామకృష్ణ అక్షరాలు ముగ్గును తలపిస్తాయి. నీటి ధారలా మల్లిక్ పేరు ఉంటుంది. కార్టూన్ మూలన పేరు ఉన్నా, లేకున్నా ఇది ఎవరి కార్టూనో చెప్పగలిగే స్థాయిలో పాఠకులు ఉండేవారు…

పొలిటికల్ కార్టూనిస్టు: దినపత్రికలకు ఒక ఆస్థాన పొలిటికల్ కార్టూనిస్ట్లు ఉండడం తప్పనిసరి దినపత్రిక ముందు పేజిలో ప్రముఖంగా రోజు ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం దర్శనమిచ్చేది. దీటైన విమర్శతో పాలకులకు చురకలు పెట్టే ఆ బొమ్మలు చినమంతా మాట్లాడుకొనే టాపిక్ అయ్యేవి. ఈనాడు లో పాప పేరిట వచ్చిన వ్యంగ్య చిత్రాలు ఎంతటివారినైనా వదిలిపెట్టేవి కావు. పత్రికలో ఆ ఒక్క బొమ్మ చూడగానే ఆనాటి రాజకీయ ముఖచిత్రం అర్థమయ్యేది. ఆయన తర్వాత ఆ పత్రికలో శ్రీధర్ చాలాకాలం కార్టూన్లు వేశారు. ఎందుకోగానీ, కాలక్రమంగా పెద్ద కార్టూన్ పోయి పేజీలో ఎడమ కొసకు వచ్చే పాకెట్ కార్టూన్ మాత్రమే మిగిలింది. ఆ మాత్రం పాకెట్ కార్టూన్ ను కూడా చాలా పత్రికలు వదిలేశాయి. శంకర్, మృత్యుంజయం, నర్సిం లాంటి ఘనాపాటి పొలిటికల్ కార్టూనిస్టుల స్పేస్ కూడా కుంచించుకు పోతోంది.

తెలుగు పత్రికల్లో కార్టూన్ల విశేషాలను గత చరిత్రలా రాయడానికి కారణం ఆనాటి వైభవం ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పడానికే తప్ప కార్టూనిస్టుల గౌరవానికి భంగం కలిగించాలని కాదు. పరిస్థితులు మారినా ఎందరో కార్టూనిస్టులు తమ కళను కొనసాగిస్తూనే ఉన్నారు. మల్లిక్, సరసి, వర్చస్వి, రాజు, జకీర్, లేపాక్షి, సుభాని, ప్రసాద్ కాజా, బాచి, అరుణ్, బొమ్మన్, సాయికృష్ణ, నాగిశెట్టి, నారు, ప్రసిద్ధ, బాలినేని వరప్రసాద్, గోపాలకృష్ణ, నాగ్రాజ్, గాంధీ….ఇంకా ఎందరో వివిధ మాధ్యమాల్లో తమ చిత్రాలను పాఠకులకు అందిస్తున్నారు. ఫెస్ బుక్ లో తెలుగు కార్టూనిస్టులు ఉన్నారు. వారి గ్రూపులు ఉన్నాయి. వాటి ద్వారా కార్టూన్లు చూడడమే కాకుండా కార్టూనిస్టులతో పరిచయాలు ఏర్పరచుకోవచ్చు. పత్రికలు తగ్గినా కార్టూన్ల ద్వారా తెలుగు జీవిత చిత్రణకు నవ్వులు అద్దుతూ ఆ కళను కొనసాగిస్తున్న కళాకారులకు జేజేలు.

-బద్రి నర్సన్

Share via
Copy link
Powered by Social Snap