
పునఃసృష్టికి చిక్కిన ‘శ్రీకూర్మం’ కుడ్యచిత్రం
April 21, 2025శ్రీకాకుళం జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శివారు జిల్లా. అయినప్పటికీ, మాధ్యమాల పుణ్యమా అని యాత్రీకుల ఇష్టాలను మళ్ళించి, ఉల్లములను ఆకర్షించి తన వైపుకు లాగుకుంటున్న ప్రాచీన క్షేత్రం శ్రీకూర్మం. ప్రముఖ పర్యాటక(భక్తి) కేంద్రం. అతి ప్రాచీనమైనది. విష్ణు భగవానుని రెండవ అవతారం కూర్మావతారం. సాగరమథనం వేళ కూర్మరూపునిగా వెలసిన విష్ణువుని భూమండలంపై కూర్మనాథునిగా కొలిచే ఏకైక ఆలయం…