మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు  కృష్ణారెడ్డి

మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు కృష్ణారెడ్డి

July 19, 2022

లలిత కళల్లో చిత్రకళ అనునది ఒక విశిష్టమైన ప్రక్రియ. సృజనాత్మకమైన ఈ కళలో మనిషి మస్తిష్కంలో కదిలే భావాలను వ్యక్తీకరించడానికి ఎన్నో ప్రక్రియలను కళాకారుడు అనుసరించడం జరుగుతుంది. ఒకరు కేవలం రేఖల్లో భావాలను వ్యక్తం చేస్తే, మరొకరు రంగుల్లో వ్యక్తం చేస్తాడు. ఇంకొకరు రంగు రేఖల కలయికతో తాననుకున్న భావాలను వ్యక్తం చేస్తాడు. వేరొకరు ఇంకా వినూత్నమైన లినోకట్,…

అంతర్జాతీయ పోటీకి విశాఖ చిత్రకారుడు ఎంపిక

అంతర్జాతీయ పోటీకి విశాఖ చిత్రకారుడు ఎంపిక

July 8, 2022

“విఘ్నహర్త” అనే మంచి ఆలోచనతో ArtsCrafts.com దుబాయ్ వేదికగా అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న పెయింటింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖకు చెందిన శ్రీనివాసరావు కనుమూరి చిత్రం ఎంపికయ్యింది. ఈ చిత్రంలో శ్రీ వినాయక స్వామి కథా సారాంశముతో, ఆంద్రప్రదేశ్ సంప్రదాయ చిత్రకళ అయిన కళంకారి చిత్రకళను జోడించి చిత్రించటం జరిగింది. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 మంది పాల్గొంటున్న…

అపురూప గ్రంథం “వపాకు వందనం”

అపురూప గ్రంథం “వపాకు వందనం”

July 7, 2022

లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని…

పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

July 6, 2022

కళ అనేది ఒక వరం. అది సహజంగాను, యత్నపూర్వకంగానూ రెండు రకాలుగా కూడా మనిషికి అలవడుతుంది. అయితే ప్రయత్నంవలన వచ్చిన దానికంటే సహజంగా వచ్చేడి కళలో ఒక స్వచ్చత, ప్రత్యేకతలు కనబడతాయి. అలాంటి స్వచ్చమైన కళకు మరింత సాధన తోడయితే ఏ వ్యక్తైనా తాననుకున్న రంగంలో మంచి కళాకారుడిగా రాణిస్తారు. తద్వారా సమాజంలో ఒక మంచి గుర్తింపును, ప్రత్యేకతను…

ఆత్మావిష్కరణకు రూపమే-అశోక్ చిత్రాలు

ఆత్మావిష్కరణకు రూపమే-అశోక్ చిత్రాలు

July 4, 2022

అశోక్ చిత్రాలలో వర్ణాలు, ఆ చిత్రాలలోని అంశాల అమరిక చూడగానే ఒక లయను స్ఫురింపచేస్తాయి. ప్రేక్షకుని ఒక విలక్షణమైన అనుభూతికి లోనుచేస్తాయి. ఈ చిత్రాలలో స్త్రీ పురుషులు ఇద్దరూ కనిపిస్తారు. వివిధ భంగిమల్లో ఆలోచనల్లో నిమగ్నమయి ఉంటారు. వారి ఆలోచనలు ఏమిటి? చిత్రకారుడు వ్యక్తం చేయదలచిన వారి అంతరంగం ఏమిటి? అని నిశితంగా పరిశీలించినపుడు మాత్రమే ప్రేక్షకునికి అవగతమవుతుంది….

సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

July 3, 2022

( జూలై 3 ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జన్మదినం సందర్భంగా) సాధారణంగా మనుషులు మధ్య ఏర్పడతాయి బంధాలు ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా, తెలియకుండా కూడా ఏర్పడతాయి బంధాలు ఒక్కోసారి, ఇరువ్యక్తుల మధ్య భిన్న విభిన్న కారణాలతో. తెలిసి ఏర్పడే బంధాలను ప్రత్యక్ష బంధాలు గా చెప్పుకుంటే, తెలియకుండా ఏర్పడే బంధాలను పరోక్ష బంధాలు…

శ్రీశ్రీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ బొమ్మల పోటీ

శ్రీశ్రీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ బొమ్మల పోటీ

July 1, 2022

(శ్రీశ్రీ సాహిత్యం – శ్రీశ్రీ పై సాహిత్యం ప్రచురణ ప్రచార ప్రణాళిక) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ కు ఆహ్వానం పలుకుతుంది. క్యారికేచర్ విభాగం బహుమతులు:ప్రథమ బహుమతి – రూ. 3000/ద్వితీయ బహుమతి – రూ. 2000/తృతీయ బహుమతి – రూ. 1000/ప్రోత్సాహక బహుమతులు 5 (ఒక్కొక్కరికి…

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

June 27, 2022

వ్యవసాయ కళాశాలలో ఆర్టిస్టు – ఫోటోగ్రాఫర్ గా, సినిమా రంగంలో కళాశాఖలోనూ పనిచేసిన సింగంపల్లి సత్యనారాయణ గారికి వపా తో వున్న అనుబంధం … చిత్రకళా రంగంలో నిష్ణాతులు, ఎంతో ప్రతిభావంతులైన వడ్డాది పాపయ్యగారి గురించి – వారితో నాకున్న ప్రత్యక్ష అనుబంధం గురించి సాగర్ గారు వ్రాయమనటం నా అదృష్టం. ఇది నేను ఊహించని పరిణామం. ఈ…

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

June 26, 2022

ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను….