నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

March 27, 2021

ప్రపంచ రంగస్థల సంస్థ ఈ సంవత్సరం (మార్చ్ 27 2021) ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని హెలెన్ మిర్రేన్ ద్వారా ఇప్పించారు. ఆ సందేశం తెలుగులో…. “రంగస్థల ప్రదర్శన కళలకు ఇది ఒక గడ్డు సమయం. ప్రస్తుత క్లీష్ట సమయంలో కళాకారులు, సాంకేతిక వర్గం, నిర్మాణ వర్గం ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. కొత్తగా సృజన చేయాలన్న తపన కలిగిన…

జీవితాన్ని జీవితంలా చూపించేది ‘నాటకం’

జీవితాన్ని జీవితంలా చూపించేది ‘నాటకం’

March 24, 2021

‘ఈ కాలంలో నాటకాలా… అబ్బె ఎవడు చూస్తడండి,ఒకవేళ చూద్దామన్నా… మంచి నాటకాలు ఎక్కడున్నయ్ చెప్పండి’అనే మాటలు మనం వింటుంటం. పారిశ్రామీకరణ ప్రారంభమై, క్యాపిటలిజం వేళ్లూనుకునే సమాజంలో మనిషి ఏవిధంగా యంత్రం కాబోతున్నాడో, మానవ సంబంధాలూ ఏ విధంగా యాంత్రికం కాబోతున్నాయో ఆనాడే, చార్లీ చాప్లిన్ మోడ్రన్ టైమ్స్ లో చూపిస్తే, చూసి మర్చిపోయాం. కమ్యూనిస్టు రాజ్యాలు కుప్పకూలడం, ప్రజాస్వామ్యాలు…

లక్కరాజు విజయగోపాలరావు

లక్కరాజు విజయగోపాలరావు

March 9, 2021

రంగస్థల దర్పణం – 4 ఓ వ్యక్తి తన సమకాలీన సమాజంచే అందునా తానున్న రంగంలోని వ్యక్తులచే కీర్తింపబడుట చాలా అరుదగా జరిగే సంఘటన. కళారంగాన అట్టి స్థితి దాదాపు మృగ్యం. అట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అరుదైన ప్రతిభాశాలి ‘లక్కరాజు విజయగోపాలరావు’. కళారంగంలో కొనసాగింది కొలదికాలమే ఐనా ఓ ‘జీవిత కాలపు’ ఎదుగుదలను ఆ కొద్దికాలంలోనే సాధించిన…

వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది…

వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది…

February 26, 2021

నాటకరంగం… నేటి యువతరం లో అంతగా ఆదరణలేని రంగం. సినిమాలకు ఉండే క్రేజ్ ఈ నాటక రంగానికి ఉండదు. బుల్లితెరకు ఉండే ఆదరణ కూడా ప్రజల నుండి ఈ నాటక రంగానికి ఉండదు. కానీ బుల్లితెర, వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది. ప్రజల్ని చైతన్యపరుస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు సంఘసంస్కర్తలు ఎంచుకున్న మహోన్నత ఆయుధం నాటకం….

శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

February 23, 2021

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగువారి శౌర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అయితే.. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు..గొప్ప నటుడు కూడా.స్త్రీ పురుష పాత్రల్ని ఎంతో సమర్ధవంతంగా పోషించిన నటుడు.గత రెండు నెలలుగా నేను శ్రీ రామరాజు జీవితంపై…

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

February 13, 2021

రంగస్థల దర్పణం – 3 కన్యాశుల్కం నాటకసాహిత్యములోను, ప్రయోగములోను వివాదాస్పద విషయాలలో “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!” అనేదొక అతిముఖ్యమైన విషయం. కథానాయకుడన్నవారూ వున్నారు. ప్రతినాయకుడన్న వారూ వున్నారు. ఐతే దీనికిగల ప్రధాన కారణం – ‘గిరీశం కథానాయకుడనో లేక ప్రతినాయకుడనో’ అని రచయిత ఆధారాలు స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా గత శతాబ్దకాలముగ పలువురు…

స్త్రీ పాత్ర పోషణలో దిట్ట బుర్రా

స్త్రీ పాత్ర పోషణలో దిట్ట బుర్రా

February 9, 2021

(ఈరోజు వారి జయంతి -9-2-1937) బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు,స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకొన్న నటరత్నం. కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ లో పద్మనాభ సోమయాజి, సీతామహాలక్ష్మి దంపతులకు1937, ఫిబ్రవరి 9 న జన్మించారు. శాస్త్రి గారిమేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసుఉత్తమ గాయకుడు కావడంతోమేనమామ పర్యవేక్షణలో పద్యాలు, పాటలు శ్రావ్యముగా ఆలపించడం నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద…

విలక్షణ దర్శకుడు “ కోడూరిపాటి”

విలక్షణ దర్శకుడు “ కోడూరిపాటి”

January 28, 2021

(నటుడు, దర్శకుడు, రచయిత, కోడూరి పాటి సరస్వతి రామారావుగారి వర్ధంతి 28-1-2021) తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్ కోడూరిపాటి సరస్వతి రామారావుగారు ఈనాటి కళాకారులికి ఆదర్శప్రాయుడు. ఆయన నాటకరచయిత, నటుడు, దర్శకుడు. ఆయన ఎన్నో విప్లవాత్మకమయిన రచనలు చేసారు. ఆయన రాసిన నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శిస్తే ప్రేక్షకులు ఉత్తేజితులయ్యేవారు.స్వీయ దర్శకత్వం చేసి, ఎక్కువ నాటకాల్లో తానే…

కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి

కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి

January 17, 2021

రంగస్థల దర్పణం – 2 ‘గుంటూరు హిందూ నాటక సమాజము’ అనేది తెలుగుదేశమందు స్థాపించబడ్డ నాటక సమాజాలలో మూడవది, తెలుగు నాటక సమాజాలలో రెండవది, విద్యార్ణేతరులు సభ్యులుగాగల తెలుగు నాటకసమాజాల్లో మొదటిది. దీనినే ఉత్తరకాలములో ‘గుంటూరు ఫస్ట్ కంపెనీ’ పేరుతో వ్యవహరించినారు. స్థానికంగానే కాక మిగిలిన ప్రాంతాలలోనూ ప్రదర్శనలిచ్చిన ‘తొలి సమాజం’గా ఘనచరిత్ర ఈ కంపెనీ సొంతం. అట్టి…

తొలి తెలుగు సాంఘిక నాటక రచయిత వావిలాల

తొలి తెలుగు సాంఘిక నాటక రచయిత వావిలాల

January 1, 2021

రంగస్థల దర్పణం – 1 వావిలాల వాసుదేవశాస్త్రి (1851-1897)భాషాత్రయం(సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం)యందు మహా పండితులు. అటు కావ్య సాహిత్యము లోను ఇటు నాటక సాహిత్యములోను వీరిది అందె వేసిన చేయి. ఆధునిక ఆంధ్ర నాటకసాహిత్యాన అనేకానేక ప్రక్రియలకు నాంది పలికిన సాహిత్య వైతాళికులు వావిలాలవారు. తెలుగులో తొలి ఆంగ్లానువాద నాటకం, తొలి విషాదాంత నాటకం, తొలి స్వతంత్ర సాంఘికనాటకం,…