నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నేటి ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయంగా “స్త్రీ” అన్ని రంగాల్లోనూ తన అభినివేశాన్ని, ఉనికిని, ప్రాముఖ్యతని చాటి చెబుతోంది. అందునా నాట్యకళల్లో మరింత ముఖ్యపాత్రను పోషిస్తున్నారని చెప్పవచ్చు. నాడు మనువు “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అన్నాడని చెప్పి స్త్రీలను అణగదొక్కడానికి ప్రయత్నించినా నాటి వేదకాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీ తన ప్రతిభను చాటుకుంటూనే ఉంది….

ప్రతిధ్వనించిన మువ్వల సవ్వడులు

ప్రతిధ్వనించిన మువ్వల సవ్వడులు

అంతర్జాతీయ నృత్యదినోత్సవం అంబరాన్నంటింది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, భారతీయ తంతి తపాల శాఖల ఆధ్వర్యంలో 29-04-19, సోమవారం విజయవాడ సంగీత కళాశాల లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ నృత్య రీతులు ఒక వేదికపై కను విందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఆంధ్రనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించిన కళాకారులు జాతీయ సమైక్యతను చాటారు. భారతీయ…

భరతనాట్య  ప్రతిభా సౌజ‌న్యం

భరతనాట్య ప్రతిభా సౌజ‌న్యం

శాస్త్రీయ నాట్యకళల్ని వంటబట్టించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందుకు చాలానే కృషి జరగాలి. ఏళ్ళ తరబడి సాధనలో మునిగితేలితేగానీ జీవితంలో నాలుగు పదనర్తనలు అబ్బవు. ఎందుకంటే భారతీయ నాట్యకళలకున్న బిగువు అలాంటిది. దక్షిణాదిన ప్రాచుర్యంగల భరతనాట్యం, కూచిపూడి నాట్యకళలూ అలాంటివే. అభిరుచికో, గుర్తింపుకోసమో.. కొంతకాలంపాటు ఏదైనా నాట్యకళను నేర్చుకోవాలనుకుంటే.. అందులో పెద్దగా పరిణత దక్కదు. మనసునిండా ఆ…

సంగీత, నృత్య కళాసవ్యసాచి – శ్రీమతిసంధ్యామూర్తి

సంగీత, నృత్య కళాసవ్యసాచి – శ్రీమతిసంధ్యామూర్తి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి యువత పదకోశం నుంచి క్రమేపి మాయమవుతున్న కాలం. పాశ్చాత్య నృత్య సంగీత హెూరులో శాస్త్రీయతకు విలువ తగ్గుతున్న సమయంలో కళల ఖిల్లా అనంతజిల్లా. అనంతపురం నగరంలో శాస్త్రీయ, సంగీతాలకు పెద్ద పీటవేస్తూ ఆవిర్భవించిన నిలయం శ్రీనృత్య కళానిలయం’. శ్రీమతి జి. సంధ్యామూర్తి గారు తన తల్లిగారు కీ.శే. సరస్వతమ్మ, తండ్రిగారు కీ.శే. పి.యస్.శర్మగార్ల…

అతివగా అభినయం… అజేయం…

అతివగా అభినయం… అజేయం…

భారతీయ సంప్రదాయం నృత్యరీతులలో కూచిపూడికి ప్రత్యేకస్థానం ఉంది. నృత్యనాటికలు, రూపకాలు, శాస్త్రీయనృత్య ప్రదర్శనలతో ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో పాటు, సమకాలీన అంశాలను కూడా ఇతివృత్తాలుగా తీసుకుని ప్రజల మనసుల్లోకి నవరసాల్ని చొప్పించగల మహత్తర సాధనం నాట్యం. ఆంధ్రరాష్ట్రానికి అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను అందించిన అపురూపమైన నాట్యకళా ప్రక్రియగా కూచిపూడి ఎంతగానో ప్రఖ్యాతి గాంచింది. అలనాటి కూచిపూడి నాట్య దిగ్గజాలు…

నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

నేటి ఆధునిక ప్రపంచంలో, ఒకే ఇంట్లో వుండే తల్లి, తండ్రి, ఇద్దరంటే ఇద్దరు పిల్లలు వారి వారి ఇష్టాలకు, అభీష్టాలకు భిన్నంగా ఆ నలుగురూ తలోదారిలో నడుస్తూ తల్లడిల్లుతున్న ఈ రోజుల్లో తమ తాతలు, తండ్రులు చూపినదారిలోనే పయనిస్తూ, నర్తిస్తూ, కూచిపూడి. కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో తననుతాను తీర్చిదిద్దుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను కనబరుస్తూ, శాస్త్రీయ…