నవరసాల పాఠశాల ..మన ఘంటసాల
అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీకి వున్న స్థానం అద్వితీయమైనదే,…