సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

November 3, 2023

(నవంబర్ 6 వ తేదీన, హైదరాబాద్ లో 14 పుస్తకాల ఆవిష్కరణ) చరిత్ర మనుషుల్ని సృష్టించదు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. వాళ్ళు సామాన్యంగా కనబడే అసామాన్యులు. ఒక అశోకుడు దారికిరువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించాడు. అక్కడక్కడ విశ్రాంతి కోసం విశ్రాంతి గృహాలు కట్టించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు!అయితే ఎలా? ఎందుకూ? అని ప్రశ్నిస్తే, జవాబు…

అజో-విభొ-కందాళం సంస్థ-2024 పురస్కారాలు

అజో-విభొ-కందాళం సంస్థ-2024 పురస్కారాలు

November 2, 2023

ప్రతిభామూర్తి జీవితకాల సాధన, విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన, సరిలేరు నీకెవ్వరు పురస్కారం, 2024 సం. పురస్కారాలు అజో-విభొ-కందాళం సంస్థ ప్రకటించింది.అజో-విభొ-కందాళం సంస్థ 1994లో ఏర్పడింది. గత 30 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ పట్టణాలలో సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. “ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారం – యల్లపు ముకుంద రామారావు“విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన” పురస్కారం…

(ర)సాలూరు సంగీత సారస్వతం… రాజే(శ్వ)స్వరరావు

(ర)సాలూరు సంగీత సారస్వతం… రాజే(శ్వ)స్వరరావు

October 12, 2023

(తెలుగు చలనచిత్ర స్వర మాంత్రికుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం….) అందరి సంగీత దర్శకుల వ్యవహార శైలి ఒకటిగా వుంటే రాజేశ్వరరావు శైలి తద్భిన్నంగా, వినూత్నంగా వుండి, అందరి దృష్టిని ఆకర్షించేది. ఆత్మాభిమానానికి రాజేశ్వరరావు ఇచ్చిన విలువ ధనార్జనకు ఇవ్వలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ సడలించని మనస్తత్వం రాజేశ్వరరావుకు…

సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

September 7, 2023

(సెప్టెంబరు 7న, భానుమతి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) యాభైసంవత్సరాల క్రితం కొలంబియా రికార్డింగ్ కంపెనీ వాళ్లు భానుమతి పాటల ఆల్బం విడుదలచేస్తూ రికార్డు స్లీవ్ మీద ముద్రించిన పరిచయ వాక్యాలను చదివితే భానుమతి ప్రజ్ఞ ఎలాంటిదో విదితమౌతుంది. ఆ రికార్డు కవరు మీద “స్వరవాహిని, స్వరమోహిని, స్వరారోహ స్వరవర్ణిని, చలనచిత్ర ధరణినేలు భరణి…

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

September 6, 2023

పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కాళోజీ నారాయణరావు పురస్కారం 2023 సంవత్సరానికి ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు లభించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ…

వేదాంత గానకోవిదుడు… ముఖేష్

వేదాంత గానకోవిదుడు… ముఖేష్

August 30, 2023

సంగీతం విశ్వజనీనం. వాద్య స్వరసమ్మేళన రాగమాధుర్యంతో సమ్మోహింపజేసేదే పాట. ఏ పాటైనా నిత్యనూతనంగా నిలిచిపోవాలంటే, బాణీ, భావం బాగున్నంత మాత్రాన కూడా సరిపోదు. గాయకుని గొంతులోని మార్దవం, స్వచ్ఛత, ప్రత్యేకత, ప్రతిభ కలిస్తేనే ఆ పాట సుదీర్ఘకాలం సుమధురగీతంగా నిలిచిపోతుంది. ఏ పాటకైనా స్వరం ఆధారం. స్వరం వేరు, స్వరస్థానం వేరు. అనుస్వరంతో పాడితే అది ఒక అద్భుతగీతం…

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

July 31, 2023

(మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు రెండున్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ…

ఉద్యమ పాట మూగవోయింది

ఉద్యమ పాట మూగవోయింది

July 30, 2023

ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు…

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

July 15, 2023

(జూలై 14, ఎం.ఎస్. విశ్వనాథన్ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ…

ఒక వేణువు వినిపించెను సమ్మోహ గీతిక

ఒక వేణువు వినిపించెను సమ్మోహ గీతిక

July 7, 2023

జులై 2 ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలనుంచి ఒకే సంగీత వాయిద్యం చుట్టు అనేక వాద్యాలు, కర్ణాటక,హిందూస్తాని, పాశ్చ త్యత్య బాణిలు, కళాకారులూ చేసిన సంగీత నర్తనం, విన్యాసం ఐదు గంటలసేపు ప్రేక్షకులను రస డోలికల్లో ముంచింది. యువతను కేరింతలతో పదే పదే చప్పట్లతో dance చేయించింది. సినీ పరిశ్రమకు సపరిచితులైన ప్రముఖ వేణు…