ప్రజా వాగ్గేయకారుడు వంగపండు
August 5, 2026జానపదుల గుండె చప్పుళ్ళను తనపాటద్వారా ఊరూరా ప్రతిధ్వనించిన వాడతడు. జానపద బాణీలకు పోరాటపటిమను ఎర్రజెండగా ఎగురువేసినవాడతడు. సమాజం గర్భంలో రగిలిన మంటను పాటలు పొదిగి తూటాగా మార్చిన వాడతాడు. కర్షకుడిగా, కార్మికుడిగా పడిన పాటులన్ని పాటలుగా మారాయి. సామాన్య ప్రజలు బ్రతుకు కష్టాలు ఉత్తరాంధ్ర జానపదరీతులలో అనేకపాటలు వ్రాసారు, పాడారు.నాట్యమాడారు.తన పాటలన్నింటికి ఉత్తరాంధ్రలోని జానపద బాణీలే మూలధార మంటారు….









