మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

August 11, 2022

దాదాపు 190 ఏళ్ల బ్రిటిష్ ముష్కరుల దుష్కర దాస్య శృంఖలాలు తెంచుకుని భారతావని స్వేచ్ఛావాయువు పీల్చి ఈ ఆగస్టు 15 వ తేదీకి 75 సంవత్సరాలవుతున్న చారిత్రక సందర్భమిది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత వహించిన ఈ దేశంలో అంబానీ, ఆదానీ, ఇతర పారిశ్రామిక ముఠాకీ, ఈస్టిండియా కంపెనీని మించిన వ్యాపార కూటమికీ ఉన్నంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు జనసామాన్యానికి…

జయదేవ స్వరమణి… రఘునాథ్ పాణిగ్రహి

జయదేవ స్వరమణి… రఘునాథ్ పాణిగ్రహి

August 10, 2022

( ఈరోజు పాణిగ్రహి జయంతి. ఈ గొప్ప సంగీత విద్వాంసుడు మరణించడానికి కేవలం మూడునెలల ముందు భువనేశ్వర్ లో వారి స్వగృహంలో కలిసి నేను జరిపిన ఇంటర్వ్యూలో పాణిగ్రహి వెల్లడించిన కొన్ని మధుర స్మృతుల సారాంశాన్ని మీకు అక్షర రూపంలో సమర్పిస్తున్నాను.) పద్మశ్రీ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి పేరు తెలుగు సినీ ప్రేమికులకు 1956లో వచ్చిన ‘ఇలవేలుపు’ సినిమా…

వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

August 9, 2022

(ఈరోజు జాలాది జయంతి – 9 ఆగస్టు 1932)‘‘అందరూ రాయగలిగేవి… ఏ కొందరో రాయగలిగేవి’’ ఇలా సినిమా పాటలు రెండు రకాలనుకుంటే – జాలాది పాటలు – రెండో రకంలోకి వస్తాయి! వెదికి చూడండి.. మచ్చుకి ఒక్క బరువైన మాట కనిపిస్తే ఒట్టు! జాలాది పాట వింటున్నప్పుడు నిఘంటువులు నిద్రపోతాయి. అన్వయాల కోసం ఆలోచించాల్సిన పని తప్పి, మెదళ్లు…

కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు

కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు

August 8, 2022

“మంచి కథలు రావడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని, ఇటువంటి కథల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి కథలు వెలువడతాయని” రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక గౌరవ సంపాదకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు. ఆగస్ట్ 7, ఆదివారం ఉదయం విజయవాడ, ఠాగూర్ గ్రంథాలయంలో రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో జరిగిన కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు జాతియ…

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

August 6, 2022

మిత్రులారా, వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజిలాండ్ వేదికగా అంతర్జాలంలో జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా,సాహిత్యాభిమానులకు సాదర ఆహ్వానం. ఈ పరంపరలో గత ఏడు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు భారత దేశం, అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలలో దిగ్విజయంగా జరిగిన సంగతులు మీకు…

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

August 1, 2022

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్న కళాకారులను గుర్తించి, వారిని, కళలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అర్.కె. రోజా తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామనీ, గెలుపొందిన జట్లకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు…

‘కవితా’పయోనిధి… దాశరథి

‘కవితా’పయోనిధి… దాశరథి

July 22, 2022

తెలంగాణ విముక్తి కోసం తన కవితను ఆయుధంగా మలచి ఉద్యమించిన ‘సుకవి’ అతడు. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజల అగచాట్లను, కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలచి పీడిత ప్రజల గొంతును వెలుగెత్తి నినదించిన ఉద్యమ కారుడతడు. అందుకు ఆ నిరసనకారుడు ధారపోసిన కవితాధార ‘అగ్నిధార’. “ముసలి నక్కకు రాచరికంబు దక్కునే…ఓ… నిజాము పిశాచమా, కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని” అని…

భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం – ఉపరాష్ట్రపతి

భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం – ఉపరాష్ట్రపతి

July 16, 2022

•స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో జాతీయ కవిచక్రవర్తిగా కీర్తినొందిన శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవితం – సాహిత్యంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి•పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ల ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా అన్ని వర్గాలకు సమానమైన గౌరవాన్నిస్తూ, శాంతి, సామరస్యాలకు పెట్టింది పేరైన…

“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

July 15, 2022

“భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు…..” అంటూ భారతీయత ఉట్టిపడే అద్భుతమైన ‘ప్రతిజ్ఞ’ని శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. ఈ ప్రతిజ్ఞలో వీరు వినయశీలత, విధేయత, కుల, మత ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయులందరిని సోదర, సోదరీమణులుగా భావించి అందర్నీ భారతమాత ముద్దుబిడ్డలుగా భావించి చక్కని ప్రతిజ్ఞను అందించి దానిని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టారు….

నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’

నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’

July 11, 2022

బాల్యం ఒక వరం. ఏడు పదుల వయసులోనూ బాలునిగా, బాలలతో గడపడం ఒక అదృష్టం, అరుదైన అవకాశం కూడా! బహుశః అది ‘నూటిలో… కోటికో ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం. ఆ ఏడు పదుల నిత్య బాలుడు బాల సాహితీమూర్తి, చైతన్య స్ఫూర్తి చొక్కాపు వేంకటరమణ. బాల రచయితగా రచనలు చేసి, ‘చందమామ’తో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన…